Mahbubnagar

News August 8, 2024

NRPT: మహిళకు పాముకాటు.. ఆస్పత్రికి వెళ్తుండగా యాక్సిడెంట్

image

పాముకాటుకు గురైన మహిళను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. స్థానికుల సమాచారం.. ఊట్కూరు మం. ఏర్గడ్‌పల్లికి చెందిన సుజాత పాము కాటుకు గురైంది. ఆమెను అభినవ్(24) బైక్ పై చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్తున్నాడు. దత్తసాయి కాలేజ్ సమీపంలో అడ్డొచ్చి ఎద్దులను తప్పించబోయి అదుపుతప్పి కింద పడటంతో అభినవ్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ సుజాతను ఆస్పత్రికి తరలించారు.

News August 8, 2024

నాగర్‌కర్నూల్: ఏడేళ్ల బాలికపై అత్యాచారం

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన వెగుచూసింది. ఓ కామాంధుడు ఏడేళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 8, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలిలా…

image

ఉమ్మడి జిల్లాలో గురువారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా మాగనూరులో 28.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేటలో 19.8 మి.మీ, వనపర్తి జిల్లా అమరచింత 19.0 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా వటవర్లపల్లిలో 14.0 మి.మీ, గద్వాల జిల్లా బీచుపల్లిలో 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News August 8, 2024

గద్వాల: భార్యకు వీడియోకాల్‌ చేసి RMP సూసైడ్

image

భార్యకు వీడియో కాల్ చేసి RMP డాక్టర్ సూసైడ్ చేసుకున్న ఘటన గద్వాలలో బుధవారం జరిగింది. SI వెంకటేశ్ వివరాలు.. జమ్మిచేడుకు చెందిన భాస్కర్‌యాదవ్‌ RMPగా చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్నాడని నమోదైన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న భాస్కర్‌ HYDలో పిల్లల వద్ద ఉన్న భార్యకు వీడియో కాల్‌ చేసి కోర్టు కేసు, పలు సమస్యలతో బతకాలనిలేదని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు.

News August 8, 2024

మొరాయిస్తున్న బయోమెట్రిక్ హాజరు పరికరాలు !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు పరికరాలు పనిచేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరమైన సమస్యలతో బయోమెట్రిక్ హాజరును నమోదు చేయలేకపోతున్నామని బోధన, బోధనేతర సిబ్బంది పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ యంత్రాల్లో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

News August 8, 2024

ఊట్కూర్: పెద్దవాగులో భారీ చేప లభ్యం

image

NRPT: ఊట్కూరు మండలంలోని కర్ణాటక సరిహద్దు సంస్తపూర్, ఇడ్లూరు పెద్దవాగుకు భారీ వర్షాలకు వరద ఉద్ధృతి వస్తోంది. దీంతో సంగం బండ జలాశయానికి నీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహానికి భారీ చేపలు కొట్టుకు రావడంతో పరిసర గ్రామాల యువకులు పెద్ద ఎత్తున చేపలవేట మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఓ యువకుడికి 8 కిలోల చేప చిక్కింది. ఎక్కువ మొత్తంలో పెద్ద సైజు చేపలు చిక్కుతున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

News August 8, 2024

MBNR: స్థానిక పోరు.. జిల్లాల వారీగా వివరాలు !

image

త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహించేందుకు సర్కారు యోచిస్తోంది. CM రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష నేపథ్యంలో గ్రామస్థాయి నేతల్లో ఆశలు చిగురించాయి. గ్రామాలు ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోనే ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 468, నాగర్ కర్నూల్-461, గద్వాల్-255, వనపర్తి-255, నారాయణపేట-280 పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా గ్రామాల్లో నేతలు నువ్వా.. నేనా అంటూ స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.

News August 8, 2024

కేంద్రం బీసీ కుల గణన వెంటనే చేపట్టాలి: శ్రీనివాస్ గౌడ్

image

కేంద్ర ప్రభుత్వం బీసీ కుల గణన వెంటనే చేపట్టాలని మాజీమంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండల్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమాల్లో మాజీ మంత్రి బుధవారం రాత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా బీసీ కుల గణన ఇతర బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. దేశంలో బీసీలు అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా రాజకీయ విద్య ఉద్యోగ వేదికలను బీసీలకు ప్రాధాన్యం లభించడం లేదని ఆయన పేర్కొన్నారు.

News August 8, 2024

తపాలా కార్యాలయంలో రూ.25కే జాతీయ జెండా

image

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.25లకే జాతీయ జెండాను అందజేస్తున్నట్లు తపాలా శాఖ మహబూబ్ నగర్ డివిజన్ పర్యవేక్షకురాలు ఎస్. విజయజ్యోతి తెలిపారు. డివిజన్ పరిధిలోని అన్ని తపాలా కార్యాలయాల్లో తివర్ణ పతాకాలను అందుబాటులో ఉంచామని, రూ.25 చెల్లించి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https://www.epostoffice.gov.in ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే తమ సిబ్బంది ఇంటికే వచ్చి అందజేస్తారన్నారు.

News August 8, 2024

జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద

image

జూరాల జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో డ్యాం 39గేట్లు ఎత్తి 2.64 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 2.75 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. ఔట్ ఫ్లో 2.86 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సంగంబండ జలాశాయం గేట్లు ఎత్తడంతో మరింత వరద పెరిగి అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సుంకేసులలో 10 గేట్లు, సంగబండ రిజర్యాయర్ 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.