Mahbubnagar

News March 6, 2025

బెల్లయ్యకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వండి.. LHPS వినతి

image

LHPS వ్యవస్థాపక అధ్యక్షులు బెల్లయ్య నాయక్‌కు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని LHPS రాష్ట్ర కమిటీ నాయకులు బుధవారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా LHPS రాష్ట్ర నాయకులు విస్లావత్ చందర్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి గిరిజనుల సమస్యలపై బెల్లయ్య ఎన్నో పోరాటాలు చేశారన్నారు.

News March 6, 2025

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడండి: కలెక్టర్

image

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉండే హ్యాండ్ పంపులను అవసరమైతే మరమ్మతులు చేయించాలన్నారు. ఎక్కడైనా పైప్ లైన్ లీకేజీలు, డామేజీలు ఉంటే వెంటనే సరి చేయాలన్నారు.

News March 6, 2025

MBNR: కేంద్ర పథకాలపై ప్రత్యేక సదస్సు

image

MBNR:ZP మీటింగ్ హాల్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రథమంగా పాలమూరు ఎంపీ డికె.అరుణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.PMFME, విశ్వకర్మ పథకం, NREGS కింద గొర్రెలు, కోళ్ల పెంపకం, డైరీ ఫామ్స్(ఫిషరీస్) మత్స్య శాఖలో ప్రోత్సాహకాలు, టెక్స్టైల్స్, ట్రైబల్ వెల్ఫేర్, PMFME పథకాల అమలు తీరు వాటి మార్గదర్శకాలను సంబంధిత అధికారులు వివరించారు. ఎమ్మేల్యే యెన్నం, ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News March 5, 2025

MBNR: ‘ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి’

image

MBNR జిల్లాలో రహదారులపై ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర రవాణా శాఖ కమీషనర్ సురేంద్ర మెహన్ ఆదేశించారు.  బుధవారం జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి, ఎస్పీ జానకిలతో కలసి కలేక్టరేట్లోని సమావేశమయ్యారు. పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, వైద్య ఆరోగ్య, అర్అండ్‌బి శాఖలతో ప్రమాదాల నివారణపై తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.

News March 5, 2025

LRS సమాచారం కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్

image

“లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం” సమాచారం కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ కేటాయించినట్టు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ బుధవారం వెల్లడించారు. ఎల్ఆర్ఎస్ చెల్లింపు కోసం ఈనెల 31 వరకు 25% రాయితీకి అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇతర వివరాల కోసం కలెక్టరేట్ టోల్ ఫ్రీ నంబర్ 08542- 241165, మున్సిపాలిటీ హెల్ప్ లైన్ నంబర్ 7093911352కు సంప్రదించాలన్నారు.

News March 5, 2025

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ విడుదల

image

బుధవారం పాలమూరు వర్సిటీలోని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎన్. శ్రీనివాస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ చెన్నప్ప చేతుల మీదుగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ -2025 పోస్టర్ అవిస్కరించారు. ఈనెల నెల 9లోగా 18 నుండి 25ఏళ్లులోపు విద్యార్థులు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మై భారత్ పోర్టల్ పోర్టల్‌లో నమోదు చేసుకొని ఒక్క నిమిషం వీడియోను పంపాలన్నారు.

News March 5, 2025

విద్యార్థినికి నియామక పత్రం అందజేసిన సీఎం

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదివిన విద్యార్థిని పూజిత మొన్న వనపర్తిలోని ఉద్యోగం మేళాకు ఎంపికైంది. త్రెడ్ ఐటీ కంపెనీలో ఉద్యోగం సాధించిన పూజితకు ఉద్యోగ నియామక పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ కే.ఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. తమ కళాశాల విద్యార్థి మంచి ఉద్యోగం సాధించడం తమకు గర్వకారణం అన్నారు

News March 5, 2025

పీయూలో ప్రశాంతంగా సెమిస్టర్ పరీక్షలు

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం పీజీ కాలేజీ పరీక్ష కేంద్రాన్ని ఉపకులపతి ఆచార్య జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్య చెన్నప్పతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, జవాబు పత్రంలో బార్ కోడ్‌పై వివరాలను స్పష్టంగా రాయాలన్నారు.

News March 5, 2025

చిన్నారులను ఆహ్లాదకర వాతావరణంలో పెంచాలి: కలెక్టర్

image

శిశు గృహ చిన్నారులను ఆహ్లాదకర వాతావరణంలో పెంచాలని అధికారులను కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. బుధవారం స్టేట్ హోమ్ ఆవరణలోని శిశు గృహాన్ని ఆమె సందర్శించి, చిన్నారుల కోసం వేస్తున్న పెయింటింగ్ నూతనంగా నిర్మిస్తున్న పార్కు ఆట వస్తువులను పరిశీలించారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసేది వారికి ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. అదేవిధంగా పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలన్నారు.

News March 5, 2025

సీసీ కుంట: ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధురాలి మృతి

image

సీసీకుంట మండలం గూడూర్ గ్రామ శివారులో బావిలో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. అమరచింత మం. మస్థిపురానికి చెందిన గుండమ్మ(77) కురుమూర్తి స్వామి దర్శనానికి గతనెల 28న వెళ్లింది. ఆలయ పరిసరాల్లో అటుఇటు తచ్చాడుతూ పలువురికి కనిపించింది. ఇంతలోనే బావిలో ఆమె మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.