India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఫ్రీ బస్సు కారణంగా తాము బస్సు ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయిందని పలువురు పురుషులు మంగళవారం వాపోయారు. మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో వచ్చిన బస్సులన్నింటిలో మహిళలు పెద్ద ఎత్తున ఎక్కుతుండడంతో తమ పరిస్థితి ఏంటని పురుషులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉగాది, సోమవారం రంజాన్, మంగళవారం సెలవు, బుధవారం వర్కింగ్ డే కావడంతో హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడ్డారు.

ఊరుకొండ పేటలో మహిళపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మహిళల భద్రత అంశం ఆందోళన కలిగిస్తోందని BRS నేత, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేర స్థలంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసు పక్కాగా దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.

NGKL జిల్లా ఊర్కొండపేట ఆలయానికి వచ్చిన వివాహిత గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనా స్థలాన్ని ఈరోజు మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ పరిశీలించి మాట్లాడారు. అత్యాచారం చేసిన మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని, ఆమె ఒంటరిగా రావడాన్ని వారు అదునుగా తీసుకున్నారని తెలిపారు. యువతిని బెదిరించి అత్యాచారం చేశారని, నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన జడ్చర్ల మండలంలో నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. గద్వాల జిల్లా ధరూరు మం. మార్లవీడుకి చెందిన కిశోర్(45) వ్యాపారం చేసుకుంటూ HYDలో నివాసముంటున్నారు. సోమవారం కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయానికి తన భార్య పవిత్ర, కుమార్తె శిరీషలతో కలిసి HYD నుంచి జడ్చర్ల మీదుగా వెళ్తున్నారు. మల్లెబోయిన్పల్లి దగ్గర కారు బోల్తా పడటంతో కిశోర్‌కు తీవ్రగాయాలై మృతిచెందారు.

MBNR జిల్లాలో నిన్న బాలుడి కిడ్నాప్‌యత్నం కలకలం సృష్టించింది. స్థానికుల వివరాలు.. మిడ్జిల్ మం. వేములకి చెందిన రాజేందర్‌గౌడ్ కుమారుడు రుద్రాన్ష్ నిన్న రాత్రి ఒక్కసారిగా కనిపించకుండాపోయాడు. అదే గ్రామానికి చెందిన రామస్వామి అనే వ్యక్తి బాలుడితో వాడియాల స్టేజీ దగ్గర కనిపించినట్లు గ్రామస్థులు సమాచారమందించారు. అక్కడికెళ్లి రామస్వామిని ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానం చెప్పటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో శనివారం రాత్రి <<15944914>>యువతిపై 8 మంది దుండగులు సామూహిక అత్యాచారం<<>> చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం మైకంలో 8 మంది వివాహితపై విచక్షణారహితంగా అత్యాచారం చేయడమే కాకుండా చిత్రహింసలకు గురిచేసి పశువుల కంటే హీనంగా ప్రవర్తించారనే ప్రచారం సాగుతోంది. పోలీసులు నిందితులపై కఠినంగా వ్యవహరించాలని వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు.

మహబూబ్‌నగర్ రూరల్ మండల పరిధిలోని కోడూరు గ్రామం దగ్గర చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. పలక, బలపం పట్టాల్సిన చేతులు యాజమాన్యాల కింద నలిగిపోతున్నాయి. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చిన్నారులను బడిలో ప్రవేశం కల్పించకుండా బాల కార్మికుల చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, విద్య,శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో సంరక్షించాలని స్థానికులు కోరారు.

తప్పుడు కేసులకు భయపడొద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాసానిపల్లికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నేత రవి నేరంలో ప్రమేయం లేకున్నా తప్పుడు కేసు నమోదు చేశారని ఆయన అన్నారు. జైలుకి వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చిన ఆయనను ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డి.జానకి ఈద్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. శాంతిభద్రతలు, ప్రజల సౌకర్యం, శాంతియుతం,ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాల పర్యవేక్షణ, అత్యవసర సేవల ఏర్పాట్లు ఈద్గా, మసీదులు ప్రధాన కూడళ్ల వద్ద అదనపు బందోబస్తు అంశాలపై అధికారులతో సమీక్షించారు.

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజర్వేషన్లను, కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటులో అమలు చేయాలని బీసీ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి ఏప్రిల్ 2వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమానికి బీసీ నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు, మైత్రి యాదయ్య ముదిరాజ్, మురళి తదితరులున్నారు.
Sorry, no posts matched your criteria.