Mahbubnagar

News March 2, 2025

వనపర్తిలో మిత్రుడు.. CMగా వచ్చాడు! (PHOTO)

image

CM అయ్యాక స్నేహితుడు మన మధ్యకు వస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే. వనపర్తిలో అదే జరిగింది. 8th క్లాస్ నుంచి ఇంటర్ వరకు WNPలో చదివిన రేవంత్ రెడ్డి ఆదివారం CM హోదాలో జిల్లాకు వచ్చారు. ఆనాటి మిత్రులు గుర్తొచ్చి ఆదివారం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. హంగు, ఆర్భాటం అన్నీ వదిలేసిన CM స్నేహితులతో కలిసిపోయారు. భోజనం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. స్నేహానికి మన CM ఇచ్చిన ప్రియారిటీకి హాట్సాఫ్.

News March 2, 2025

MBNR: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్ప పొందుతూ ఓ యువకుడు మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు వివరాలిలా.. కౌకుంట్ల మండలం రాజోలికి చెందిన శ్రీకాంత్(25), లింగేశ్‌లు స్కూటీపై వెళ్తూ టిప్పర్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్ నిన్న మృతిచెందగా, లింగేశ్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 2, 2025

MBNR: ఫోన్ ఇవ్వలేదని మహిళ హత్య

image

గత నెల 26న జరిగిన మహిళహత్య కేసును పోలీసులు ఛేదించారు. వారు తెలిపిన వివరాలిలా.. మునిరంగస్వామి జాతర సందర్భంగా గతనెల 19న కొత్తమొల్గరకి చెందిన రంగమ్మకు భూత్పూర్‌కి చెందిన రాజుతో పరిచయమైంది. ఈక్రమంలో రాజు తన ఫోన్‌ను ఆమెకు ఇచ్చాడు. తిరిగి ఆ ఫోన్‌ని అడగటంతో ఆమె నిరాకరించింది. ఈనెల 26న ఆలయం వద్ద రాజు ఆమె తలపై బండరాళ్లతో దాడి చేసి పారిపోయాడు. ఫోన్ ఆధారంగా అతడిని పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.

News March 2, 2025

మహబూబ్ నగర్ జిల్లా.. నేటి ముఖ్యంశాలు

image

✓మహబూబ్ నగర్ జిల్లాలో.. రంజాన్ నెల ఉపవాస దీక్షలు ప్రారంభం✓బాలానగర్ మండలం నందారంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.✓దేవరకద్ర పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలు. ✓మహబూబ్ నగర్ జిల్లాలో. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.✓ఈనెల 12 నుంచి 14 వరకు కందూర్ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ✓మన్యంకొండలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి

News March 1, 2025

MBNR: యూడీఐడీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోండి.!

image

సదరం గుర్తింపు కార్డు కోసం యుడీఐడీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈఓ దివ్య దేవరాజన్ తెలిపారు. సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లు, డిఆర్డిఓ, డిడబ్ల్యుఓ, డిసిహెచ్ఎస్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్లతో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

News March 1, 2025

MBNR: హక్కుల కోసం కలిసి ముందు కెళ్దాం: మాజీ మంత్రి

image

గౌడ్స్ హక్కుల కోసం అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపు నిచ్చారు. HYD నెక్లెస్ రోడ్‌లోని నీరా కేఫ్‌లో గౌడ్ సంఘాల నాయకులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి పాల్గొని మాట్లాడారు. మహాసభ ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్దామన్నారు. నీరా కేఫ్ పై ప్రభుత్వంలో కదలిక రావడం సంతోషమన్నారు. షరతులు లేకుండా నీరా కేఫ్‌ని టాడీ కార్పొరేషన్‌కి అందించాలన్నారు.

News March 1, 2025

వేర్వేరు ఘటనల్లో ముగ్గురి ఆత్మహత్య

image

MBNR, WNP, NGKL జిల్లాల్లో శుక్రవారం వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల వివరాలిలా.. జడ్చర్లకు చెందిన వడ్డె సంజీవ(30) అప్పులు తీర్చలేక ఉరేసుకున్నాడు. గోపాల్‌పేటకు చెందిన కొంకలి మల్లయ్య(40) కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. NGKL జిల్లా పెనిమిళ్లకి చెందిన మేర కృష్ణయ్య సోదరి దగ్గర ఉంటుండగా, కడుపునొప్పి భరించలేక పొలం వద్ద ఉరేసుకున్నాడు.

News March 1, 2025

MBNR జిల్లా కలెక్టర్‌కు సీఎస్ కీలక ఆదేశాలు జారీ.!

image

మార్చి 5 నుండి 25 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతి కుమారి అన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. అదే విధంగా ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణపై విస్తృత ప్రచారం చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయికి కీలక ఆదేశాలు జారీ చేశారు. 

News March 1, 2025

మహబూబ్ నగర్ జిల్లా నేటి ముఖ్యంశాలు

image

✓మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం.✓నేటితో ముగిసిన కుల గణన సర్వే.✓రాజాపూర్‌లో పోలీసులు రెవెన్యూ సిబ్బంది ఇసుక రీచ్‌లు ధ్వంసం.✓ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు గడువు పొడిగింపు. ✓దేవరకద్రలో రైలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.✓దేవరకద్ర: వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.✓భూత్పూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.

News February 28, 2025

MBNR: ఎల్‌ఆర్ఎస్ దరఖాస్తులకు గడువు పొడిగింపు: కలెక్టర్

image

LRS కోసం దరఖాస్తు చేసుకున్న వారు మార్చి 31లోగా పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. LRS దరఖాస్తులపై చీఫ్ సెక్రటరీ‌తో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె మాట్లాడారు. గడువులోగా పరిష్కరించుకున్న వారికి ప్రభుత్వం 25% రాయితీనిస్తుందని, ఈ అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకొని తమ ప్లాట్లను క్రమ బద్ధీకరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.