Mahbubnagar

News February 28, 2025

దేవరకద్రలో రోడ్డు ప్రమాదం

image

దేవరకద్రలో బ్రిడ్జి వద్ద స్కూటీ, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న కౌకుంట్ల మండలం రాజోలి గ్రామానికి చెందిన శ్రీకాంత్, లింగేష్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని అంబులెన్స్ లో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 28, 2025

MBNR: చివరి అవకాశం.. నేటితో ముగియనున్న కులగణన సర్వే

image

మహబూబ్ నగర్ జిల్లాలో నేటితో కులగణన సర్వే ముగియనుంది. గతంలో ప్రభుత్వం సర్వే చేసిన కొందరు వివరాలు నమోదు చేసుకోలేదు. ఇంకా సర్వేలో పాల్గొననివారు, వివరాలు ఇవ్వని వారు వెంటనే సర్వేలో వివరాలు నమోదు అధికారులు సూచించారు. కుల గణనలో పాల్గొనని వారికి ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 28 వరకు అవకాశం ఇవ్వగా.. నేటితో సర్వే ముగుస్తోంది. సర్వేలో పాల్గొనని వారికి ప్రభుత్వ పథకాలు దూరమయ్యే అవకాశం ఉంది.

News February 28, 2025

MBNR : రంజాన్‌ను శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్పీ

image

మహబూబ్ నగర్ జిల్లాలో రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి గురువారం అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అందరూ ఒకరిపై ఒకరు విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ.. పోలీసులకు సహకరించాలన్నారు. సమాజంలో శాంతిని నెలకొల్పే బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులు ప్రజలు నమ్మొద్దన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News February 28, 2025

MBNR: 36 పరీక్ష కేంద్రాలు, 22,483 మంది విద్యార్థులు: కలెక్టర్

image

ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 22,483 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. గురువారం పరీక్షలపై సమీక్షించిన కలెక్టర్, పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేక రవాణా సదుపాయంతో పాటు తాగునీరు వసతి ప్రథమ చికిత్స వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

News February 28, 2025

ఇంటర్మీడియట్ పరీక్షలకు వేళాయె..!

image

★ మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు
★ మహబూబ్ నగర్ జిల్లాలో 22483 మంది ఇంటర్ విద్యార్థులు
★ ప్రథమ సంవత్సరం:10922
★ ద్వితీయ సంవత్సరం:11561 మంది
★ జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
★ పరీక్షల సందర్భంగా 144 సెక్షన్ అమలు
★ సిట్టింగ్ స్వ్కాడ్‌లు,ఫైయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు
★ ఇప్పటికే విడుదలైన హాల్ టికెట్లు
★ పరీక్ష సమయం: ఉ.9 నుంచి మ.12 వరకు
★ పరీక్షకు ఒక రోజు ముందే అన్ని సిద్ధం చేసుకోండి.

News February 28, 2025

MBNR: పక్కడ్బందీగా ఇంటర్మీడియట్ పరీక్షలు: కలెక్టర్

image

మార్చి 5 నుంచి 25 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నిర్వహించాలంటూ కలెక్టర్ విజయేంద్రబోయి అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేయనున్నట్లు తెలిపారు.

News February 27, 2025

మన్యంకొండ: భక్తులను ఆకట్టుకున్న సాంస్కృతిక నృత్యాలు

image

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం రాత్రి భక్తుల జాగరణను దృష్టిలో ఉంచుకొని కల్చరల్ ఫైన్ ఆర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు భక్తులను ఆద్యంతం మంత్రముగ్ధులను చేసి ఆకట్టుకున్నాయి.

News February 26, 2025

జడ్చర్లలో యువకుడి హత్య

image

జడ్చర్ల పరిధిలో అనుమానాస్పదంగా <<15574517>>యువకుడు <<>>మృతిచెందిన విషయం తెలిసిందే. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి హత్యగా గుర్తించారు. కాగా, బాత్‌రూం పక్కన ఉన్న గదిలో రక్తపు మరకలు రహీద్ ఖాన్‌ అని నిర్ధారించారు. మృతుడి మెడకు గాయం ఉండటంతో ఎవరో హత్య చేసి బాత్‌రూంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

News February 26, 2025

నవాబ్‌పేట: చికిత్స పొందుతూ కార్మికురాలు మృతి

image

ఈనెల 14న ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకొని గాయాల పాలైన గురుకుంట గ్రామపంచాయతీ కార్మికురాలు చెన్నమ్మ(62)చికిత్స పొందుతూ మృతిచెందారు. కుటుంబ సభ్యుల వివరాలిలా.. విధులలో భాగంగా కార్మికురాలు చెన్నమ్మ గ్రామంలోని వీధులను ఊడ్చిన చెత్తను అంటిస్తుండగా చీర కొంగుకు నిప్పు అంటుకుంది. గాయాలపాలైన ఆమెను చికిత్స నిమిత్తం MBNR ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. 

News February 26, 2025

MBNR: పునరావాస పనుల్ని వేగవంతం: కలెక్టర్

image

ఉద్దండపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాసపనుల్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ఉదండపూర్ రిజర్వాయర్‌ భూ నిర్వాసితుల పునరావాస పనులపై సమీక్షించారు. ఆయా శాఖల ద్వారా పునరావస్తు కేంద్రాల్లో పనులను వేగవంతం చేసి వారికి అప్పగించాల్సిందిగా ఇరిగేషన్ ఇతర శాఖలకు కలెక్టర్ సూచించారు.