Mahbubnagar

News September 17, 2024

NRPT: 250 మంది పోలీసులతో బందోబస్తు

image

నారాయణపేట జిల్లా కేంద్రంలో నేటి అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే గణేశ్ శోభాయాత్రకు 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. గణేశ్ మార్గ్‌లో సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి సమీక్ష చేస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని వచ్చే వాహనాలను ఇతర మార్గాల ద్వారా డైవర్ట్ చేశామని అన్నారు. ప్రధాన కూడళ్లలో పోలీస్ పీకేటింగ్ ఏర్పాటు చేశామన్నారు.

News September 16, 2024

వట్టెం నవోదయలో ప్రవేశాలకు గడువు పెంపు

image

బిజీనేపల్లి మండలం వట్టెంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ శ్రీ పి.భాస్కర్ కుమార్ తెలిపారు. ఐదో తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు నవోదయ వెబ్‌సైట్‌లో చూడాలని చెప్పారు.

News September 16, 2024

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద

image

శ్రీశైలం జలాశయంలో ఆదివారం రాత్రి 9 గంటలకు 883.30 అడుగులు, నీటి నిల్వ 206,0906 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 41,287 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 68,194 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు.

News September 16, 2024

MBNR: 11ఏళ్ల నిరీక్షణకు తెర.. బదిలీలపై టీచర్ల సంతోషం

image

ఆదర్శ పాఠశాలల్లో ఎట్టకేలకు 11ఏళ్ల తర్వాత బదిలీలు చేపట్టడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2013లో ఈ పాఠశాలలు ప్రారంభించగా.. అప్పటి నుంచి బదిలీలు చేపట్టలేదు. తాజాగా విద్యాశాఖ PGT, TGTలను పాత జోన్ల ప్రకారం బదిలీలు చేసింది. దీంతో ఆదర్శ పాఠశాలల్లో మొత్తం 160 ఖాళీలు ఉన్నాయి. సెలవు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల పలువురు ఆందోళనకు గురయ్యారు.

News September 16, 2024

‘ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి’

image

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని పీయూ అధ్యాపకులు ఎంపీ డీకే అరుణకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో పీయూలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమను ఆమె దర్శించుకున్నారు. విద్యార్థి సంఘ నాయకులు వారిచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. 12 యూనివర్సిటీల్లో 1445 మంది అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారని, తమను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.

News September 16, 2024

రాష్ట్రస్థాయి ఖోఖో టోర్నీ.. మనకు మూడోస్థానం

image

HYDలోని మౌలాలిలో శని, ఆదివారం నిర్వహించిన 34వ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా ఖోఖో పోటీల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ బాల, బాలికల జట్లు మూడోస్థానంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా భోఖో అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు ఒబేదుల్లా కొత్వాల్,జీఏ.విలియం పలువురు అభినందించారు.రానున్న టోర్నీల్లో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ టోర్నీలో కోచ్ లు,పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
>>CONGRATULATIONS❤

News September 16, 2024

ఒక్కటైన అమెరికా అమ్మాయి, వనపర్తి అబ్బాయి

image

వనపర్తి జిల్లాకు చెందిన అబ్బాయి, అమెరికా అమ్మాయి ఒక్కటయ్యారు. వనపర్తిలోని రాజనగరం రోడ్డులో ఉన్న ఫంక్షన్ హాల్‌లో అమెరికా అమ్మాయి నాతలీజో, పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నేత తమ్ముడు, శాస్త్రవేత్త నరేశ్ యాదవ్ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక, రాజకీయ నేతలు పాల్గొని జంటను ఆశీర్వదించారు. పెళ్లి కుమార్తె విదేశీ అమ్మాయి కావడంతో ఈ వేడుక పట్ల జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

News September 16, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✒రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు..మన పాలమూరుకు మూడవ స్థానం
✒NGKLలో కోడిపందాలు..10 మంది అరెస్ట్
✒కృష్ణారెడ్డి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న CM,MLAలు
✒NGKL:ధాన్యం టెండర్లు రద్దు చేయాలని హైకోర్టు ఆదేశాలు
✒కార్మికుల వేతనాలు విడుదల చేయాలి:IFTU
✒రేపు ప్రజావాణి రద్దు:కలెక్టర్లు
✒MBNR:గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
✒పెబ్బేరు:కానిస్టేబుల్ సస్పెండ్ చేసిన ఎస్పీ
✒వినాయక ఉత్సవాలు..డీజే మోగితే కేసులే:SIలు

News September 15, 2024

MBNRలో ఐటీఐ, జూ.కళాశాల, పీహెచ్సీ‌కి జీవో జారీ

image

నియోజకవర్గంలోని హకీంపేట్‌లో ఐటీఐ, జూ.కళాశాల, పీహెచ్సీ, 8 నుంచి 12 వరకు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం జీవో జారీ చేసిందని కడా ప్రత్యేక అధికారి కె.వెంకట్ రెడ్డి తెలిపారు. కొడంగల్‌ను విద్యాహబ్‌గా మార్చేందుకు సీఎం ప్రత్యేక చొరవతో ఇప్పటికే మెడికల్, పశువైద్య కళాశాలలు, గురుకుల సమీకృత భవనాలు, ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేసినట్లు తెలిపారు.

News September 15, 2024

MBNR: షాపింగ్ మాల్స్ కార్మికుల సమస్యలపై సర్వే

image

మహబూబ్‌నగర్ పట్టణంలో షాపింగ్ మాల్స్ కార్మికుల సమస్యలపై సర్వే చేపట్టినట్లు సీఐటీయూ జిల్లా కోశాధికారి బి.చంద్రకాంత్, టౌన్ కన్వీనర్ రాజ్ కుమార్ ఆదివారం తెలిపారు. మాల్స్, రైల్వే కార్మికుల్లో నాన్ ఎంప్లాయిమెంట్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను వివరించారు.