Mahbubnagar

News January 22, 2025

MBNR: తొలిరోజు రేషన్ కార్డులకే అధికం

image

ఉమ్మడి జిల్లాలో తొలిరోజు గ్రామ, వార్డు సభలకు దరఖాస్తుదారులు పోటెత్తారు. 4 పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జాబితాతో పేర్లు లేకపోవడంతో ప్రజలు నిలదీయడం, అధికారులు సముదాయించడంలో ఉక్కిరిబిక్కిరయ్యారు. తొలిరోజు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులకు MBNRలో 6096, NGKLలో 2826, వనపర్తిలో 4749 అప్లికేషన్లు రాగా, గద్వాలలో మొత్తం 7539, NRPTలో 3073 దరఖాస్తులు వచ్చాయి.

News January 22, 2025

నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

ఈనెల 23వ తేదీన బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఉంటుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. 18 -35 సంవత్సరాల వయసు ఉండి విద్యార్హత కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జాబ్ మేళాలో ఎంపికైన నిరుద్యోగులకు హైదరాబాద్, కర్నూల్, గద్వాలలోని వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశం కలుగుతుందని ఆమె తెలియజేశారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

News January 21, 2025

విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసిన పీయూ వీసీ 

image

హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత రానాను మంగళవారం పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్య డీ.చెన్నప్ప మర్యాదపూర్వకంగా కలిశారు. యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల నియామకం, కొత్త కోర్సుల రూపకల్పన, మొదలైన అంశాల గురించి చర్చించారు.

News January 21, 2025

అధైర్య పడవద్దు.. అందరికీ సంక్షేమ పథకాలు: కలెక్టర్

image

ఎవరు అధైర్య పడకూడదని అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. ధరూర్ మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రణాళిక ప్రకారం గ్రామసభలు నిర్వహించి, అర్హులకు పథకాలు వర్తింప చేస్తామన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.

News January 21, 2025

MBNR : ప్రభుత్వ ఆసుపత్రిలో ఉరేసుకొని మహిళ మృతి

image

మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మంగళవారం ఉదయం ఉరేసుకొని ఓ మహిళ మృతి చెందింది. బంధువుల వివరాల ప్రకారం.. దామరగిద్ద మండలం కందేన్‌పల్లికి చెందిన నారమ్మ (32) తీవ్ర అనారోగ్యంతో సోమవారం సాయంత్రం ఆసుపత్రిలో చేరింది. మంగళవారం ఉదయం కాలకృత్యాలకు వెళ్లి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 21, 2025

ఐజ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బింగి దొడ్డికి చెందిన వీరాంజనేయులు తన పుట్టినరోజు వేడుకల కోసం స్నేహితులతో కలిసి బైక్‌పై ఐజాకి వెళ్లి వస్తున్నాడు. తిమ్మప్ప ఆలయం దగ్గర అతడి బైక్‌ను మరొక బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరాంజనేయులుకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

News January 21, 2025

కొడంగల్: సీఎంని, పోలీసులని దూషించిన వ్యక్తికి 14 రోజుల రిమాండ్: ఎస్ఐ

image

ఈనెల 9న సాయంత్రం కోస్గి పరిధి సర్జఖాన్‌పేట్‌కి చెందిన కోస్గి కృష్ణయ్య గౌడ్ CM రేవంత్ రెడ్డిని, పోలీసులను అసభ్య పదజాలంతో దూషించాడని స్థానిక ఎస్ఐ తెలిపారు. ప్రజాశాంతికి భంగం కలిగించేలా, రెండు వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడి దానిని వీడియో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశాడని, ఈ మేరకు అతడిపై ఈనెల 11న కేసు నమోదు చేసి 20న అరెస్ట్ చేశామన్నారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు.

News January 21, 2025

MBNR:BC స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ..APPLY చేసుకోండి..!

image

మహబూబ్ నగర్ బీసీ స్టడీ సర్కిల్లో RRB,SSC, బ్యాంకింగ్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు BC స్టడీ సర్కిల్ అభివృద్ధి అధికారిని ఆర్.ఇందిర, డైరెక్టర్ ఎ.స్వప్న తెలిపారు. MBNR,NGKL,NRPT జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9లోగా www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1500 స్టైఫండ్, బుక్స్ ఇవ్వనున్నారు. సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 21, 2025

MBNR: గ్రామసభలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి: కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుంచి ప్రారంభించనున్న 4 సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు నేటి నుంచి జనవరి 24 వరకు షెడ్యూల్ ప్రకారంగా గ్రామసభల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం మహబూబ్ నగర్ సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

News January 21, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔గణతంత్ర దినోత్సవం పకడ్బందీగా ఏర్పాటు చేయండి:కలెక్టర్లు
✔వరి సాగు.. రైతన్నలు బిజీబిజీ
✔NRPT:రోడ్డు ప్రమాదం.. ఓ మహిళ మృతి
✔రేపటి నుంచి అన్ని గ్రామాల్లో గ్రామసభలు
✔ముమ్మరంగా రైతు భరోసా సర్వే
✔అర్హులందరికీ సంక్షేమ పథకాలు: అడిషనల్ కలెక్టర్లు
✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్
✔సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:SIలు

error: Content is protected !!