Mahbubnagar

News August 1, 2024

గద్వాల: చిన్నారులపై కుక్కల దాడి

image

గద్వాలలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. పట్టణంలోని 3వ వార్డు హమాలీ కాలనీలో చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో హస్మిత, రుషి అనే ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటిముందు ఆడుకుంటున్న పిల్లలపై కుక్కలు దాడి చేయడంతో గమనించిన స్థానికులు వాటిని తరిమికొట్టారు. అనంతరం వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీధి కుక్కలను దూర ప్రాంతానికి తరలించాలని మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.

News August 1, 2024

నూతన గవర్నర్‌ను కలిసిన జితేందర్ రెడ్డి

image

రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా వచ్చిన జిష్ణు దేవ్ శర్మను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ భవన్ ప్రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తదితరులు ఉన్నారు.

News August 1, 2024

సుప్రీం కోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నాం: ఎంపీ డీకే అరుణ

image

ఎస్సీ వర్గీక‌ర‌ణ‌పై సుప్రీం కోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నామని ఎంపీ డీకే అరుణ‌ అన్నారు. దేశ అత్యున్న‌త న్యాయ స్థానం ఇచ్చిన ఈ తీర్పును స్వాగ‌తిస్తున్నామని, ఈ గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌ధాని మోదీ ఇచ్చిన మాట ప్ర‌కారం ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసం ఎంత‌గానో కృషి చేశారని పేర్కొన్నారు.

News August 1, 2024

జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్ బదిలీ

image

ఉమ్మడి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా దిరాజు శ్రీనివాసరాజు బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరి స్థానంలో జిల్లా దేవాదాయ శాఖ జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ అంజలీదేవిని మహబూబ్నగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గురువారం మధ్యాహ్నం అంజలిదేవి బాధ్యతలు తీసుకోనున్నారు.

News August 1, 2024

కృష్ణా నదిలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి

image

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిలో ప్రవాహం కొనసాగుతోంది. జూరాల 45గేట్లు ఎత్తి 3.19 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3.17లక్షల క్యూసెక్కులు ఉంది. జూరాల, సుంకేసుల డ్యాం నుంచి భారీ ప్రవాహం ఉండటంతో శ్రీశైలం జలాశయానికి గంటగంటకు వరద పెరుగుతుంది. శ్రీశైలం 10గేట్లు ఎత్తి 3,76,670 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 3,95,162, ఔట్ ఫ్లో 4,36,902 క్యూసెక్కులు ఉంది.

News August 1, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో ఒక్కరే మండల విద్యాధికారి

image

వాస్తవానికి ప్రతి మండలానికి ఒక మండల విద్యాధికారి ఉండాలి. కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 80కి పైగా మండల కేంద్రాలు ఉన్నాయి. ఐదు మంది MEOలకు 4గురు బదిలీ అయ్యారు. ఒక్కరే రెగ్యులర్ మండల విద్యాధికారి ఉన్నారు. గ్రామీణ పాఠశాలల పర్యవేక్షణ, విద్యార్థులకు విద్య ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు దృష్టి కేంద్రీకరించాలని విద్యార్థుల తల్లిద్రండులు కోరుతున్నారు.

News August 1, 2024

పాలమూరు విశ్వవిద్యాలయం ఎంబీఏ సెమిస్టరీ షెడ్యూల్ విడుదల

image

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని ఎంబీఏ 4వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 9 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి రాజ్ కుమార్ వెల్లడించారు. ఎంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 12 నుంచి 28 వరకు కొనసాగుతాయని తెలిపారు. అదేవిధంగా ఎంసీఏ 4వ సెమిస్టర్ పరీక్షలు 9 నుంచి 16 వరకు, ఎంసీఏ 2,3,వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 12 నుంచి 24 వరకు కొనసాగుతాయని తెలిపారు.

News August 1, 2024

ఎమ్మెల్యే బండ్ల నివాసంలో అల్పాహారం తీసుకున్న మంత్రి

image

గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నివాసానికి మంత్రి జూపల్లి కృష్ణ రావు చేరుకున్నారు.. అనంతరం ఎమ్మెల్యే నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అల్పాహారం తీసుకున్నారు. గద్వాల అభివృద్ధి కోసం సహకరించాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. జిల్లా అభివృద్ధి తనవంతు కృషి చేస్తానని మంత్రి ఎమ్మెల్యేకి భరోసా ఇచ్చారు.

News August 1, 2024

14 రోజుల్లో 221 TMCల నీరు: జూరాల ఈఈ

image

జూరాలకు ప్రాజెక్టుకు జులై 17 నుంచి వరద మొదలైందని పీజేపీ డ్యాం ఈఈ జుబేర్ అన్నారు. ఇప్పటి వరకు 221 టీఎంసీల వరదనీరు వచ్చి చేరిందని, అందులో 14 టీఎంసీలు సాగునీటి ప్రాజెక్టులకు వినియోగించుకుంటున్నామని, మిగిలిన 207 టీఎంసీల వరదను నదిలోకి వదిలేశమని అన్నారు. ఎక్కువ, దిగువ జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 66.54 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయిందన్నారు.

News August 1, 2024

నాగర్‌కర్నూలు జిల్లాలో అమానవీయ ఘటన

image

నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో అమానవీయ ఘటన జరిగింది. ఆడపిల్ల పుట్టిందనో .. అనారోగ్యంతో మరణించిందో తెలియదు కానీ బుధవారం నవజాత శిశువును చెత్తకుప్పలో పడేశారు. ఎస్ఐ నరేశ్ వివరాల ప్రకారం.. అనంతసాగర్ చెరువు సమీపంలోని చెత్తలో రెండు రోజుల క్రితం జన్మించిన శిశువు మృతదేహం లభించిందని తెలిపారు. శిశువును నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.