Mahbubnagar

News September 13, 2024

అలంపూర్: చాలాకాలం తరువాత గుర్తించారు..!

image

అలంపురంలోని బాల బ్రహ్మేశ్వర ఆలయం లో ఉన్న ద్వారపాలకుల విగ్రహానికి ఈఓ పురేందర్ కుమార్ రంగులు వేయిస్తున్నారు. 60ఏళ్ల క్రితం కళ్ళే రంగస్వామి(కుంటి రంగస్వామి)అనే స్థానిక కళాకారుడు ఈ ద్వారపాలకుల విగ్రహాలను స్వయంగా చేశారు. మంచి రూపలావణ్యం కలిగిన విగ్రహాలను భక్తులు గుర్తించలేకపోతున్నారంటూ ఈవో వాటికి పేయింటింగ్ చేయించారు. ఇంతకాలానికి గుర్తించినందుకు ధన్యవాదాలంటూ కళ్లె వంశీయులు రంగ అన్నారు.

News September 13, 2024

MBNR: కుల,మత సామరస్యతకు వారు నిదర్శనం

image

కుల,మత సామరస్యతకు ప్రతీకగా, భగవంతుడు సర్వాంతర్యామి అని మరోసారి రుజువైంది. చిన్నంబావి మండలం బెక్కెం గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్ఠించి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. గురువారం గణపతి మండపంలో నిర్వహించిన వేలంపాటలో లడ్డూను గ్రామ ముస్లిం సోదరులు తాజోద్దీన్, మహమ్మద్‌లు వేలం పాటలో పాల్గొని రూ.15వేలకు గణనాథుని లడ్డూను దక్కించుకున్నారు.

News September 13, 2024

‘ప్రజా పాలన దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి’

image

జిల్లా కేంద్రంలో ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్ లో అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఎస్పీ పరేడ్ మైదానంలో సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు.

News September 13, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!

image

✒వర్షాల EFFECT.. దెబ్బతిన్న పత్తి పంట
✒NGKL:ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
✒నేషనల్ కిక్ బాక్సింగ్‌లో కోటకొండ బిడ్డకు గోల్డ్ మెడల్
✒ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్
✒ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి:కలెక్టర్లు
✒GDWL: డ్రంక్&డ్రైవ్‌లో ఆరుగురిపై కేసు నమోదు
✒చట్టాన్ని అతిక్రమిస్తే శిక్షలు తప్పవు: న్యాయమూర్తి శ్రీలత
✒భారీ వర్షం..ఎకరానికి రూ.30 వేలు నష్టపరిహారం ఇవ్వాలి:CPI

News September 12, 2024

నేషనల్ కిక్ బాక్సింగ్‌లో కోటకొండ బిడ్డకు గోల్డ్ మెడల్

image

నారాయణపేట జిల్లా కోటకొండకు చెందిన గొల్ల అజయ్ క్రీడల్లో సత్తా చాటాడు. జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించారు. అజయ్ నిరుపేద కుటుంబానికి చెందిన బిడ్డ కాగా.. తండ్రి దస్తప్ప వ్యవసాయంతో పాటు గొర్రెల కాపరిగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్న అజయ్.. చదువుతోపాటు ఇష్టమైన కిక్ బాక్సింగ్‌లో మెడల్ సాధించి ఔరా అనిపించాడు.
-CONGRATS

News September 12, 2024

లక్ష్మారెడ్డి కుటుంబాన్ని ఓదార్చిన మంత్రి పొంగులేటి

image

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో శ్వేతారెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. శ్వేతా రెడ్డి మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.

News September 12, 2024

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. గురువారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా కానాయిపల్లి 31.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా గట్టులో 30.5 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా ఉడిత్యాల్ 29.5 డిగ్రీలు, నారాయణపేట జిల్లా గుండుమల్ లో 29.0 ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో 29.5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News September 12, 2024

శ్రీశైలం జలాశయం రెండు గేట్లు ఎత్తివేత

image

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీశైలం జలాశయంలో 2 గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్ ఫ్లో 1,38,833 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1,24,017 క్యూసెక్కులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని వివరించారు.

News September 12, 2024

ఓటరు జాబితా..లోక్ సభ ఎన్నికలనాటికి ఇదీ పరిస్థితి!

image

1.కొడంగల్-2,41,794
2.నారాయణ పేట-2,36,182
3.మహబూబ్ నగర్-2,59,260
4.జడ్చర్ల-2,22,838
5.దేవరకద్ర-2,39,745
6.మక్తల్-2,44,173
7.షాద్నగర్-2,38,478
8.వనపర్తి-2,73,863
9.గద్వాల-2,56,637
10.అలంపూర్-2,40,063
11.నాగర్ కర్నూల్-2,36,094
12.అచ్చంపేట-2,47,729
13.కల్వకుర్తి-2,44,405
14.కొల్లాపూర్-2,39,463 మంది ఓటర్లు ఉన్నారు. అర్హులైన యువత నూతన ఓటరుగా నమోదు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా అధికారులు పిలుపునిచ్చారు.

News September 12, 2024

MBNR: పనిచేయని బయోమెట్రిక్ హాజరు పరికరాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు పరికరాలు పనిచేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరమైన సమస్యలతో బయోమెట్రిక్ హాజరును నమోదు చేయలేకపోతున్నామని బోధన, బోధనేతర సిబ్బంది పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ యంత్రాల్లో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.