India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ACB DSP బాలకృష్ణ కథనం మేరకు DPO శ్యామ్ సుందర్ సూచనతో ఒక వెంచర్ మేనేజర్ తో పంచాయతీ కార్యదర్శి రూ. 2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు తెలిపారు. DPO కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నేడు, రేపు ‘మన మహబూబ్ నగర్ మన మహానగరోత్సవం’ వేడుకలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌గా ఏర్పాటైనా సందర్భంగా నగర ప్రముఖులు, ప్రజలందరూ వారి అనుభవాలు మహానగరోత్సవం వేదికగా వ్యక్త పరచనున్నారు. ప్రముఖ నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో అనుమానాస్పదంగా మహిళ మృతి చెందింది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన చెన్నమ్మ(55) బుధవారం రాత్రి భర్త సుల్తాన్ పొలానికి వెళ్లగా ఒంటరిగా పడుకుంది. ఉదయం భర్త ఇంటికి వచ్చిన సమయంలో ఆమె గాయాలతో ఉంది. వెంటనే నాగర్‌కర్నూల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు బిజినేపల్లి ఎస్ఐ తెలిపారు.
మహబూబ్‌నగర్ డిపోకు చెందిన బస్సుకు షాద్‌నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులోని పోచమ్మ ఆలయ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు యూటర్న్ తీసుకుంటుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పడవలో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డారు. మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఇంటర్ చదివే రోజుల్లో నాగార్జునసాగర్ వెళ్లిన రేవంత్‌కు పడవలోనే గీతారెడ్డిని చూసి మనసు పారేసుకున్నారు. ఇంకేముంది.. పరిచయం కాస్త స్నేహంగా.. స్నేహం కాస్త ప్రేమగా మారింది. రేవంత్ రెడ్డి గీతారెడ్డి తరఫున వారి ఇంట్లో మాట్లాడి ప్రేమను గెలిపించుకున్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో 1992లో ఒక్కటయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్‌కి కౌకుంట్ల మండలంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మండలంలోని ముచ్చింతల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రామకృష్ణారెడ్డి, పుట్టపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కురుమూర్తి, శేఖర్ తదితరులు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి గతంలో పుదుచ్చేరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న సమయంలో ఎన్నికలలో పార్టీ గెలుపొంది అధికారం చేపట్టింది. దీంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చిన్నారెడ్డిని సెంటిమెంట్‌గా భావిస్తారు. పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో HYDలోని ప్రజాభవన్‌లో ఆ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి కందస్వామి చిన్నారెడ్డితో భేటీ అయ్యారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా “షబ్-ఎ-బరాత్”కు ముస్లింలు అన్ని మస్జిద్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. షాబాన్ నెలలో 15వ(నేడు) రాత్రి ప్రత్యేక ప్రార్థనలు, ఖురాన్ ఆరాధనలు చేస్తూ, తమ కోసం, తమ ప్రియమైనవారి కోసం అల్లాహ్ దయను కోరుతూ గడుపుతారు. షబ్-ఎ-బరాత్‌ను క్షమాపణ రాత్రి లేదా ప్రాయశ్చిత్త దినం అని కూడా పిలుస్తారు.
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీకి వచ్చిన రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. గోపి గురించి మెడికల్ ఆఫీసర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వస్తున్న రోగులు ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో లేబర్ రూమ్‌ను పరిశీలించి ఆరోగ్యంగా ఉన్న తల్లి బిడ్డలను పరామర్శించారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళలకు “SBIRSETI” ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ G.శ్రీనివాస్ తెలిపారు. గురువారం Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. బ్యూటీ పార్లర్ & ఎంబ్రాయిడరీలలో 30 రోజులపాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. SSC MEMO, ఆధార్, రేషన్ కార్డులతో ఈనెల 17లోపు దరఖాస్తులు చేసుకోవాలని, 19-45 సం.లలోపు ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు 95424 30607కు సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.