Mahbubnagar

News January 13, 2025

NGKL: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకు కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి సంక్రాంతి కనుమ పండుగలను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా చేసుకోవాలని ఆయన కోరారు. సంక్రాంతి పండుగ ప్రజలందరికీ జీవితాలలో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరి జీవితాలలో భోగభాగ్యాలు కలగాలని కోరారు.

News January 13, 2025

కల్వకుర్తి: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

కల్వకుర్తిలోని <<15140785>>లారీ ఢీకొట్టిన<<>> ఘటనలో ఒకరు మృతిచెందారు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు, వంగూర్ మం. కోనేటిపురం వాసి శ్రీను రాచూరులోని కాఫీ కంపెనీలో పనిచేస్తున్నారు. అదివారం రాత్రి సిల్వర్ జూబ్లీ క్లబ్ ఎదుట కంపెనీ వాహనం కోసం వేచి ఉండగా లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో నాగరాజు లారీ టైర్ల కిందపడి చనిపోగా శ్రీనును ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 13, 2025

విద్యాసంస్థల్లో మతోన్మాదుల జోక్యం అడ్డుకోవాలి: ప్రొ.హరగోపాల్

image

పాఠశాలల్లో మతోన్మాదుల జోక్యాన్ని అడ్డుకోవాలని కోరుతూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ.. మతాలకు సంబంధించిన చిహ్నాలు, దుస్తులను విద్యాసంస్థల్లో నిషేధించాలని కోరారు. తుక్కుగూడ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం రాములుపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

News January 13, 2025

మంద జగన్నాథం మృతి పట్ల సీఎం సంతాపం

image

నాగర్‌కర్నూల్ మాజీ MP మంద జగన్నాథం మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారుడిగా జగన్నాథం పోషించిన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. వారి మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. జగన్నాథం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

News January 13, 2025

నిఘా నీడలో ఇంటర్ ప్రయోగ పరీక్షలు

image

ఉమ్మడి జిల్లాలో జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే నెల 3 నుంచి 22 వరకు ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్ అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రయోగ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో డిపార్ట్మెంటల్ అధికారుల ప్రమేయం లేకుండా ఈ సారి పరీక్షలు జరగనున్నాయి.

News January 13, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔NGKL:మాజీ ఎంపీ జగన్నాథం మృతి
✔ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు
✔యువత ఈ రాష్ట్ర సంపద: డిప్యూటీ సీఎం
✔జూరాల ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి నిల్వ
✔భూమిలేని పేదలకు ప్రతి ఏడాది రూ.12 వేలు:dy CM భట్టి
✔రోజురోజుకు పెరుగుతున్న చలి
✔పండగకు ఊరేళ్తున్నారా.. జాగ్రత్త:SIలు
✔సంక్రాంతి.. పలుచోట ముగ్గుల పోటీలు
✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✔రైతు భరోసా..కసరత్తు చేస్తున్న అధికారులు

News January 12, 2025

MBNR: ఎంపీగా మంద జగనాథం హ్యాట్రిక్‌గా గెలుపు.!

image

NGKL పార్లమెంటు నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎంపీగా పోటీ చేసిన మంద జగన్నాథం 4 సార్లు గెలిచి 2 సార్లు ఓటమి పాలయ్యారు. 1996లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1999, 2004లో టీడీపీ, 2009లో కాంగ్రెస్ నుంచి గెలిపోందారు. 1998లో టీడీపీ, 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చెయగా ఓడిపోయారు. 2024లో BSP నుంచి ఎంపీగా పోటీ చేయగా ఈసీ నామినేషన్ పత్రాలు తిరస్కరించారు.

News January 12, 2025

MBNR: మాజీ ఎంపీ జగన్నాథం రాజకీయ ప్రస్థానం.!

image

NGKL మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మృతి చెందారు. 1951 మే 22న పాలమూరు జిల్లా ఇటిక్యాలాలో  జన్మించిన జగన్నాథం మెడిసిన్ చదివి కొంతకాలం డాక్టర్‌గా సేవలందించారు. 2009లో NGKL నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపోందారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో BRSలో చేరి ఓడిపోగా.. 2019లో టికెట్ రాలేదు. 2023లో కాంగ్రెస్‌లో టికెట్ రాకపోవడంతో BSP కొనసాగుతున్నారు.

News January 12, 2025

NGKL: 3 నెలల క్రితం పెళ్లి.. వివాహిత సూసైడ్

image

వివాహిత ఉరేసుకున్న ఘటన కొల్లాపూర్ మం.లో జరిగింది. కుటుంబీకుల వివరాలు.. కుడికిల్లకు చెందిన భవాని(20)కి 3 నెలల క్రితం పెబ్బేరు మ. పాతపల్లి వాసి రాజేందర్‌తో పెళ్లైంది. శుక్రవారం పుట్టింటికి వచ్చిన భవాని.. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. డోర్ లాక్ చేసి ఉండటంతో స్థానికుల సహాయంతో భర్త పగలగొట్టారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమెను కొల్లాపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయింది.

News January 12, 2025

NGKL: ‘పండగకు ఊరెళ్తున్నారా.. జాగ్రత్తలు పాటించండి’

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు ఆయా జిల్లాల పోలీసులు అల్టర్ చేశారు. ఊరెళ్లేవారు విలువైన వస్తువులు, నగదు ఇంట్లో ఉంచొద్దని బ్యాంకు లాకర్‌లో దాచుకోవాలని నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ సూచించారు. ఇంటికి తాళం వేసేటప్పుడు డోర్ కాటన్ అడ్డంగా ఉంచి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇరుగు పొరుగు వారికి చెప్పాలని, సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.

error: Content is protected !!