India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలోని ప్రజలందరినీ సామాజిక భద్రతా పథకాలలో చేర్చాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ బ్యాంకులను కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 14, 15 తేదీల్లో శిల్పారామంలో జరిగే మన మహబూబ్‌నగర్ మహా నగరోత్సవం మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ సూచించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎటువంటి పోస్టులు పెట్టొద్దని చెప్పారు. తెలియని సమాచారాన్ని పోస్ట్ చేయడం, షేర్ చేయడం నేరమే అన్నారు.
జోగులాంబ గద్వాల జోన్-7 పరిధిలో ఇద్దరు ఎస్‌ఐలను బదిలీ చేసినట్టు డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్ తెలిపారు. రాజాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న కేతావత్ రవిని మహబూబ్ నగర్ వీఆర్‌కు బదిలీ చేయగా, జడ్చర్ల PS ఎస్సై శివానందంను రాజాపూర్ పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేశారు. ఈమేరకు డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికంగా నిర్వహించాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కోరారు. ఈ విషయమై బుధవారం కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఇతర ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నేడు 3137 క్వింటాళ్లు వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాలుకు గరిష్ఠం ధర రూ.6881, కనిష్ఠ ధర రూ.4050 లభించింది. కందులు 130 క్వింటాలు అమ్మకానికి రాగా గరిష్ఠంగా ధర రూ.6926, కనిష్ఠం ధర రూ.5200 లభించింది. పత్తికి క్వింటాలుకు గరిష్ఠంగా ధర రూ.6709 లభించింది. మొక్కజొన్న క్వింటాలుకు గరిష్ఠంగా ధర రూ.2411 లభించింది.
ఉమ్మడి పాలమూరు జిల్లా కొత్తూరు మండలంలోని జేపీ దర్గాను సినీ హీరో విశ్వక్ సేన్ సందర్శించారు. త్వరలో విడుదల కానున్న మూవీ ‘లైలా’ విజయవంతం కావాలని కుటుంబ సభ్యులతో కలిసి దర్గాని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి ఈ దర్గాకు వస్తున్నట్లు చెప్పారు. ఈ మధ్య కాలంలో కొద్దిగా బిజీగా ఉండి రాలేకపోయానని ఇప్పుడు లైలా విడుదల సందర్భంగా వచ్చినట్లు చెప్పారు.
కరెంట్ పని చేస్తుండగా.. ఓ వ్యక్తికి షాక్ తగిలిన ఘటన బిజినేపల్లిలో చోటచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. కోయిలకొండ మండలం లింగుపల్లి గ్రామానికి చెందిన బాబు(38) బిజినేపల్లిలో కరెంటు పని చేస్తుండగా ఒక్కసారిగా షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు ఓ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అక్కడి నుంచి HYDకి పంపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంట్లో గొడవపడి బయటికెళ్లిపోయిన మహిళ శవమై తేలిన ఘటన గండీడ్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. పగిడ్యాల్‌కి చెందిన పద్మమ్మ(38) ఆదివారం ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు అలిగి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంతవెతికినా ఆమె జాడ కనిపించలేదు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత పగిడ్యాల్ మల్లమ్మచెరువులో శవమై తేలింది. పద్మమ్మకు భర్త, ముగ్గరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదైంది.
అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడూర్ మండల కేంద్రంలో నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన ఉప్పరి చిన్నయ్య (40) అప్పుల బాధ భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ విషయమై కేసు నమోదు కాలేదు.
లక్ష్మీనారాయణ కంపౌండ్‌లో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. జడ్చర్ల మండలం జయప్రకాశ్‌నగర్‌కు చెందిన శంకర్(33) ఇంటి నుంచి మేస్త్రీ పనికోసం బయలుదేరాడు. ఎప్పుడు.. ఎలా.. ఏం జరిగిందో తెలియదుకాని కాంపౌండ్ వద్ద రోడ్డుపై పడి మృతిచెందాడు. మృతుడికి మూర్ఛ వచ్చేదని, మద్యం తాగే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.