India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం ఖో-ఖో పోటీలకు మహబూబ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాంనగర్ పాఠశాలలో PETగా విధులు నిర్వహిస్తున్న బి.పుష్ప ఖో-ఖో రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. న్యూఢిల్లీలో ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఉమెన్స్ ఖో-ఖో టోర్నీలో ఆమె పాల్గొననున్నారు. దీంతో హెచ్ఎం అంజలి దేవి, ఉపాధ్యాయులు అభినందించారు. CONGRATULATIONS

ఓటర్ జాబితా ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా మార్పులు, చేర్పులకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి విజ్ఞప్తి చేశారు. గురువారం తన ఛాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఒంటరిగా నమోదు చేసుకోవాలని, ఇందుకు వారు సహకరించాలన్నారు. మార్పులు చేర్పులతోపాటు తప్పులు లేని జాబితా సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పోచమ్మ గడ్డ తండాలో రైతు బిక్యా నాయక్‌కు చెందిన మూడెకరాల వరి పొలాన్ని గురువారం కలెక్టర్ పరిశీలించారు. భూగర్భ జలాలు పడిపోవడంతో వరి పంట ఎండిపోయిందని, రైతులకు ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో వ్యవసాయం ఎలా చేసుకోవాలో అగ్రికల్చర్ ఆఫీసర్లు తెలియజేయాలన్నారు. వారికి సూచనలు, సలహాలు అందించాలన్నారు. కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ ఏడీ ఆంజనేయులు ఉన్నారు.

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాగునీరు, విద్యుత్ సరఫరా, పంటల విస్తీర్ణం తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. చెరువులు, కుంటలు కబ్జా కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మహబూబ్‌నగర్ పురపాలక పరిధిలోని ప్రజలు మున్సిపల్ ట్యాక్స్ పెండింగ్ లేకుండా చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం మొత్తంగా రూ.1.92 లక్షల ట్యాక్స్ వసూలు చేసినట్టు వెల్లడించారు. స్వచ్ఛందంగా ప్రజలు తమ ఇంటి, వ్యాపార సముదాయాలకు సంబంధించిన టాక్స్‌లను చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఫైరయ్యారు. పాలమూరు జిల్లా నుంచి తాను సీఎం అయ్యానని, ఈ జిల్లాకు అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని రేవంత్ రెడ్డి అన్న మాటలు డొల్ల మాటలేనన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ సర్కార్ రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెబుతున్నా ఇంకా పేదల జీవితంలో మార్పు రావడం లేదు. కడుపు నింపుకునేందుకు ఆ తల్లిదండ్రులు పిల్లలను ఇటుక బట్టీలకు, చెత్త కుప్పల్లో ఏరుకునేందుకు పంపిస్తున్నారు. ఇలాంటి పేదలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బాల కార్మికులపై, పేదలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదుకోవాలని కోరుతున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డును నిర్మించాలని కేంద్ర రోడ్డు రవాణా & రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో గురువారం మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణతో కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.

వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున వడదెబ్బ బాధితులకు తక్షణమే తగిన చికిత్స అందించాలని MBNR కలెక్టర్ విజయేంద్రబోయి వైద్యసిబ్బందిని ఆదేశించారు. జానంపేట PHCని ఆకస్మిక తనిఖీచేశారు. అన్ని విభాగాలు, రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

మూసాపేట మండలం జానంపేట ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులదలో అన్ని రకాల వైద్య సేవలు ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పట్ల ప్రజలకు నమ్మకం కలిగేలా నడుచుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.