Mahbubnagar

News September 8, 2024

పాలమూరు జిల్లాలో నీట మునిగిన పత్తి పంట వివరాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5.74 లక్షల ఎకరాల్లో పత్తిని రైతులు సాగు చేశారు. భారీ వర్షాలకు 2 వేల ఎకరాల వరకు పత్తి పంట నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ అధికారుల అంచనాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటల పరిశీలన ప్రారంభించామని వ్యవసాయ శాఖ అధికారి బి.వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు పంట నష్టంపై ప్రాథమిక సమాచారం తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

News September 8, 2024

MBNR: పనిచేయని సీసీ కెమెరాలు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ వారి గణాంకాల ప్రకారం ప్రధాన కూడళ్ళు, పట్టణాలు, మండల కేంద్రాల్లో మొత్తం 6,643 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో రూ.లక్షలు వెచ్చించి నేరాల పరిశోధనల్లో, కేసుల ఛేదనలో ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ లోపంతో మొత్తం 1,350 సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో పోలీసులకు కేసుల ఛేదన సవాలుగా మారుతోంది.

News September 8, 2024

గద్వాల: నీటి గుంతలో పడి పదేళ్ల బాలుడి మృతి

image

గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో పండగ పూట విషాదం నెలకొంది. నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. స్థానికుల సమాచారం.. తనగల గ్రామ శివారులోని గుట్ట మొరం మట్టిని తరలించగా ఏర్పడిన గుంతలో నీరు నిల్వ నిలిచింది. గ్రామానికి చెందిన బోయ భాస్కర్ కుమారుడు పట్టాభి(10) శనివారం స్నేహితులతో కలిసి వెళ్లి ప్రమాదవశాత్తు ఆ గుంటలో పడి మరణించాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుయ్యారు.

News September 8, 2024

రాష్ట్రంలోనే అత్యల్పంగా అక్షరాస్యత గల జిల్లా గద్వాల !

image

వయోజనులను అక్షరాలు నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నవ భారత సాక్షరత కార్యక్రమం అమలు చేసిందని, వాటిపై ప్రత్యేక దృష్టి పెడతామని వయోజన విద్య ప్రోగ్రాం అధికారి నుమాన్ అన్నారు. ఉమ్మడి జిల్లాలో MBNR-55.04%, GDWL-49.87%, NGKL-58.99%, NRPT-49.98%, WNPT-55.67 శాతం అక్షరాస్యత ఉందని అంచనా. GDWL జిల్లా రాష్ట్రంలోనే అక్షరాస్యత అత్యల్పంగా ఉంది. నేడు ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

News September 8, 2024

MBNR: అంగన్వాడీలో 65ఏళ్లు దాటితే ఇంటికి

image

అంగన్వాడి కేంద్రాల నిర్వహణ ప్రతిష్టం చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంగన్వాడీ కేంద్రాలలో టీచర్లు, ఆయాలు 65 ఏళ్లు దాటితే పదవీ విరమణ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 65ఏళ్లు దాటిన టీచర్లు, ఆయాల జాబితాను సిద్ధం చేస్తున్నారు. కొడంగల్ ప్రాజెక్టులో ఆయాలు 65ఏళ్ల పైబడి ఉన్నారని గుర్తించారు. త్వరలో వీరుంతా పదవీ విరమణ చేయనున్నారు.

News September 8, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం..!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. కాలువలు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులకు ఆదేశించారు. శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమై రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురుస్తుండటంతో వాగులు, కాలువలు నిండి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు.

News September 8, 2024

ఉమ్మడి జిల్లాలో 2 వేలు ఉపాధ్యాయ ఖాళీలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 3,227 ప్రభుత్వ పాఠశాలల్లో 12,708 మందికి ప్రస్తుతం 10,225 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. 508 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి పరీక్ష నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న 1,975 మంది SGTలకు SAగా విద్యాశాఖ పదోన్నతి కల్పించింది.DSC ద్వారా కొత్త ఉపాధ్యాయులను నియమించినా ఇంకా సుమారు 2 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. మరో DSCకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

News September 8, 2024

ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన BSNL

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 19 లక్షల చరవాణి, 6వేల వరకు FTTH కలెక్షన్లు ఉన్నాయి. జూలైలో 11,305, ఆగస్టులో 12,718 మంది కొత్తగా BSNL సిమ్ కార్డులు కొనుగోలు చేశారు. 2 నెలల నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 108 ప్రాంతాల్లో 4G టవర్లు ఏర్పాటు చేశామని, ఇంకా 60 4G టవర్లు అందుబాటులో తీసుకొస్తామని, BSNLలో రూ.10 నుంచి రూ.3వేల వరకు ధరలతో 12 రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయని డీజీఎం వెంకటేశ్వర్లు తెలిపారు.

News September 7, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✔శ్రీశైలం డ్యామ్..8 గేట్ల ఎత్తివేత
✔NGKL:బొలెరో వాహనం ఢీకొని చిన్నారి మృతి
✔దౌల్తాబాద్:అప్పుడే పుట్టిన శిశువుని పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు
✔పలుచోట్ల వర్షం.. సజావుగా రాకపోకలు
✔ఉమ్మడి జిల్లాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
✔NRPT:10న అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక
✔పలుచోట్ల మట్టి విగ్రహాలు పంపిణీ
✔ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోండి:SIలు

News September 7, 2024

SDNR: దొంగతనం చేస్తుంటే చూశాడని బాలుడి హత్య

image

షాద్‌నగర్ పట్టణ సమీపంలోని హాజీ పల్లి రోడ్డులో ఎల్లయ్య అనే వ్యక్తి దొంగతనం చేస్తుండగా ఆరేళ్ల బాలుడు చూశాడు. ఈ విషయం ఎవరికైనా చెబుతాడేమోనని భయంతో ఎల్లయ్య అనే వ్యక్తి బాలుని బండకేసి బాధడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి తల పూర్తిగా చిక్కిపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.