Mahbubnagar

News July 27, 2024

తెలకపల్లి: ఒకే ఊరిలో ఇద్దరు ఆత్మహత్య

image

ఒకే ఊరిలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలకపల్లి మండలం గౌరారంలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. పరుశురాం(38)కూలీ పని చేసుకుంటూ జీవనంసాగిస్తున్నాడు. నిన్న రాత్రి అతడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన అమృతమ్మ (40) ఇంట్లో ఉరేసుకుంది. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరి ఆత్మహత్యతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News July 27, 2024

ఈనెల చివరి నాటికి నిండనున్న శ్రీశైలం

image

అచ్చంపేట: కర్ణాటక, మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తుండడంతో శ్రీశైలం కళకళలాడుతోంది. ఆల్మట్టి డ్యాం నుంచి మూడు లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. సగానికి పైగా ప్రాజెక్టు నిండినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.81 TMC కాగా, ప్రస్తుతం 109.TMCలకు చేరుకుంది.

News July 27, 2024

పాలమూరోళ్లం KCRకు ఏం అన్యాయం చేశాం: CM

image

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈరోజు CM రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. పాలమూరు ప్రస్తావన తీసుకొచ్చారు. ‘పాలమూరోళ్లం మేము.. KCRకు ఏం అన్యాయం చేశాం.. 2009లో కరీంనగర్‌లో KCRను ఓడగొడతారని భయపడి పాలమూరుకు వలసొస్తే.. వలసలు పోయే పాలమూరు ప్రజలు KCRను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు.. భుజాల మీద మోసి పార్లమెంట్‌కు పంపించారు. తెలంగాణ వచ్చాక సీఎం అయి కూడా పాలమూరుకు KCR ఏం చేయలేదని ఆరోపించారు.

News July 27, 2024

ఆ కేసుల్లో పట్టుబడితే జైలుకే: నాగర్ కర్నూల్ SP

image

డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్లు డ్రైవింగ్ చేస్తే బండిని సీజ్ చేసి వాళ్లను జైలుకు పంపిస్తామని NGKL జిల్లా SP గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హెచ్చరించారు. శుక్రవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ఎస్పీ డ్రంక్ అండ్ డ్రైవ్, వితౌట్ నెంబర్ ప్లేట్, మైనర్ డ్రైవింగ్‌లో పట్టుబడిన 200మందికి అవగాహన కల్పించి, ట్రాఫిక్ రూల్స్ వివరించారు. రోడ్డు ప్రమాదాలు నిలువరించడానికి ట్రాఫిక్ పోలీస్ వింగ్ ప్రారంభించామన్నారు.

News July 27, 2024

శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం

image

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగుతోంది. ఇన్ ఫ్లో 3,43,888 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 57,300 క్యూసెక్కులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 863.40 అడుగులకు చేరింది. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని పేర్కొన్నారు.

News July 27, 2024

భూత్పూర్: వాహనం ఢీకొని యువకుడి దుర్మరణం

image

బొలెరో వాహనం బైక్‌ను ఢీకొనడంతో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఎస్ఐ చంద్రశేఖర్ వివరాలు ప్రకారం.. భూత్పూర్ మండలంలోని శేరిపల్లి(హెచ్)కి చెందిన సాయితేజ(21) బైక్‌పై భూత్పూర్ చౌరస్తా నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో ఇంటర్నల్ రోడ్డుపై బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో సాయితేజ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News July 27, 2024

కృష్ణానదిలో పెరుగుతున్న నీటిమట్టం

image

కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. 865 అడుగుల మేర వరద జలాల ప్రవాహం ఉండటంతో సప్తనదుల ప్రాంతంలో సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా మునుగుతుందని పురోహితులు రఘురామ శర్మ చెప్పారు. సంగమేశ్వర క్షేత్రంతో పాటు సోమశిల, జటప్రోల్‌లో పురాతన దర్గాలు, సురభిరాజుల కట్టడాలు పూర్తిగా ముంపునకు గురవుతాయని తీర గ్రామాల ప్రజలు పేర్కొన్నారు.

News July 27, 2024

జూరాల జలాశయం 36 గేట్లు ఎత్తివేత

image

జూరాల జలాశయంలోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయంలోకి 2.65 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. దిగువకు 36 గేట్లు ఎత్తి 2.30 లక్షల క్యూసెక్కులు, జల విద్యుదుత్పత్తి ద్వారా 20 వేలు కలిపి 2.50 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జలాశయంలో నీటి నిల్వ 6.554 టీఎంసీల మేర ఉంది. ఆల్మట్టి జలాశయానికి 2.75 లక్షల క్యూసెక్కుల వరద చేరుతుందని జూరాల అధికారులు వివరించారు.

News July 27, 2024

సుంకేసుల బ్యారేజ్ రెండు గేట్లు ఎత్తివేత

image

గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్ర సమీపంలో ఉన్న సుంకేసుల బ్యారేజ్ 2 గేట్లు శుక్రవారం సాయంత్రం ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 292 మీటర్లు ఉండగా ప్రస్తుతం 289.70 మీటర్లుగా ఉంది. రెండు గేట్ల ద్వారా 7286 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 1.540 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రేపటికి వరద పెరిగితే మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉంది.

News July 27, 2024

షాద్‌నగర్: విద్యుత్ శాఖ ఉన్నతాధికారిపై వేటు

image

షాద్‌నగర్ ట్రాన్స్ కో డిపార్ట్‌మెంట్‌లో గ్రేడ్ 2 ఉద్యోగి ఆర్టిజన్ ప్రభాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఫరూక్ నగర్ మండలం వెలిజర్ల యూనిట్‌లో పనిచేస్తున్న ప్రభాకర్ రెడ్డి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వినియోగదారుల వద్ద డబ్బులు తీసుకుని వాటిని శాఖకు చెల్లించకపోవడం, నిధులు దుర్వినియోగం చేయడంపై చర్యలు తీసుకున్నారు.