Mahbubnagar

News July 27, 2024

MBNR: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఊరట

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ZPTCలు, MPTCలు, సర్పంచులుగా పనిచేసిన వారికి గౌరవ వేతనాలు కొన్ని నెలల పాటు అందలేదు. గౌరవ వేతనాల కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులను కేటాయించడంతో ఇటీవలనే పదవీ విరమణ చేసిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఉపశమనం కలగనుంది. గతంలో వివిధ అభివృద్ధి పనులు చేసినప్పటికీ వారికి బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు. ప్రస్తుతం బడ్జెట్‌లో ఆ నిధులు కేటాయించడంతో వారికి ఊరట లభించింది.

News July 27, 2024

MBNR: ‘ఆర్టీసీ అభ్యున్నతికి ఉద్యోగులు కృషి చేయాలి’

image

ఆర్టీసీ అభ్యున్నతి కోసం ఉద్యోగులు కృషి చేయాలని TGSRTC హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ విజయం పరిధిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రతిభ ప్రగతి పురస్కారాలు అందజేశారు. రీజియన్ పరిధిలోని దాదాపు 50 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్ఎం శ్రీదేవి, డీఎం సుజాత పాల్గొన్నారు.

News July 27, 2024

ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు..

image

ఉమ్మడి జిల్లాలో మొత్తం 9.37 లక్షల బీపీఎల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం తెల్లరేషన్ కార్డు ఉన్నవారికే రూ.500కె గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 7 లక్షల మందికిపైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. జిల్లాల వారీగా బీపీఎల్ గ్యాస్ కనెక్షన్ల వివరాలిలా..
మహబూబ్‌నగర్ – 2,40,693
నారాయణపేట – 1,40,217
నాగర్ కర్నూల్ – 2,38,954
వనపర్తి – 1,57,390
జోగులాంబ గద్వాల – 1,60,654.

News July 27, 2024

మరికల్: అయిల్ పామ్ తోటలతో అధిక లాభాలు: కలెక్టర్ సిక్తా

image

అయిల్ పామ్ తోటలు పెంచడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం మరికల్ మండలం కన్మనూర్ గ్రామంలో రైతు మోహన్ రెడ్డి సాగు చేస్తున్న అయిల్ పామ్ తోటలను పరిశీలించారు. తోటల యాజమాన్య పద్ధతులు, దిగుబడి రైతును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చని, తోటలు పెంచేందుకు ముందుకు రావాలన్నారు.

News July 26, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో ‘ఇందిరమ్మ ఇండ్లు’ వివరాలు

image

ఈ ఏడాది ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు 45 వేల మందికి పైగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను అందిస్తామని బడ్జెట్లో ప్రకటించింది. జిల్లాల వారీగా కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల వివరాలిలా..
✓ మహబూబ్‌నగర్ జిల్లా – 10,500
✓ నారాయణపేట జిల్లా – 10,500
✓ నాగర్ కర్నూల్ జిల్లా – 14,000
✓ వనపర్తి జిల్లా – 3,500
✓ గద్వాల జిల్లా – 7,000 ఇళ్లను కేటాయించారు.

News July 26, 2024

MBNR: జిల్లా వ్యాప్తంగా 16,913 కిలోల బెల్లం పట్టివేత

image

కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో రాష్ట్రానికి బెల్లం రవాణా అవుతున్న విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఆఫీసర్లను అలర్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో వారు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. అయితే మే 18 నుంచి ఈనెల 11 వరకు ఉమ్మడి జిల్లాలో 16,913 కిలోల బెల్లం పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. 400 కిలోల పటికను పట్టుకోగా, ఈ కేసుల్లో 38 వెహికల్స్ సీజ్ చేశారు.

News July 26, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✏ప్రజలే బీఆర్ఎస్ పార్టీని చీల్చి చెండాడారు: మంత్రి జూపల్లి
✏జూరాలలో కొనసాగుతున్న వరద.. 47 గేట్లు ఎత్తివేత
✏CM సభా స్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే కసిరెడ్డి,కలెక్టర్
✏NGKL: ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి
✏రేపు గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్స్
✏దౌల్తాబాద్: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
✏NGKL,WNPT జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
✏ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి: హర్షవర్ధన్ రెడ్డి

News July 26, 2024

ప్రజలే బీఆర్ఎస్ పార్టీని చీల్చి చెండాడారు: మంత్రి జూపల్లి

image

బడ్జెట్‌ను చీల్చి చెండాడుతామంటూ మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ పార్టీని చీల్చి చెండాడారని.. పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నాకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అంటే కేసీఆర్‌కు గౌరవం లేదని, ప్రజాస్వామ్యాన్ని చులకనగా చూస్తున్నారని విమర్శించారు.

News July 26, 2024

పాలమూరుకు వాతావరణ శాఖ అలర్ట్..

image

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మరో 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేటలో వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. కాగా నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇందులో భాగంగా 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

News July 26, 2024

కొడంగల్: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

దౌల్తాబాద్ మండలం బిచ్చాల గ్రామానికి చెందిన అంజిలప్ప(47) కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. అంజప్ప వ్యవసాయంతో పాటు గ్రామంలో మైనర్ కరెంటు రిపేర్లు చేస్తాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కిష్టయ్య ఇంట్లో కరెంటు రాకపోవడంతో రిపేరు చేసేందుకు స్తంభం ఎక్కాడు. షాక్‌కు గురై స్తంభం పైనుంచి కిందపడ్డాడు. చికిత్స కోసం అంజిలప్పను ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.