Mahbubnagar

News January 4, 2025

షాద్‌నగర్‌కు చేరుకున్న మంత్రి సీతక్క

image

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి మంత్రి సీతక్క షాద్‌నగర్ నియోజకవర్గానికి చేరుకున్నారు. పట్టణంలోని బైపాస్ కేశంపేట రోడ్డులో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళ కాంగ్రెస్ నాయకురాలు బతుకమ్మతో స్వాగతం పలికారు.

News January 4, 2025

మహబూబ్‌నగర్: గొర్రెల మందపై చిరుతపులి దాడి

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని నందిపాడు, దోరెపల్లి, గుండుమాల్ పరిసర ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నాయని అటవీ అధికారులు తెలిపారు. కాగా.. గురువారం రాత్రి కొత్తపల్లితండా మాజీ సర్పంచ్ బెణిక్యానాయక్ పొలంలో గొర్రెల మందపై చిరుత దాడి చేసిందని కాపరులు తెలిపారు. రాత్రుళ్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవి జంతువుల దాడిలో పశువులు మృతిచెందితే తమకు సమాచారం అందించాలని అటవీ అధికారులు తెలిపారు.

News January 4, 2025

NRPT: చిన్నారిపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి రిమాండ్: డీఎస్పీ

image

నారాయణపేట పట్టణంలోని ఓ కాలనీలో మూడు రోజుల క్రితం ఓ ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని శుక్రవారం రిమాండ్ చేసినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. నరేశ్ అనే వ్యక్తి మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.

News January 4, 2025

ఎర్రవల్లి: ప్రజలకు ఉత్తమ సేవలదించాలి: ఐజీ

image

కొత్తగా విధుల్లో చేరే పోలీసులు ప్రజలకు ఉత్తమ సేవలందించి డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు తీసుకురావాలని మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ సూచించారు. హైదరాబాద్, నిజామాబాద్, ములుగు జిల్లాల నుంచి కానిస్టేబుల్స్‌గా ఎంపికైన వారు ఎర్రవల్లి పదో బెటాలియన్‌లో 9 నెలలు శిక్షణ పూర్తి చేశారు. కమాండెంట్ సాంబయ్య ఆధ్వర్యంలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News January 4, 2025

అచ్చంపేట: ఉమామహేశ్వర స్వామి ఆలయం చరిత్ర ఇదే !

image

శివుడు, పార్వతీదేవితో కొలువు దీరిన ప్రాంతంగా ఉమామహేశ్వరం ఆలయం ప్రఖ్యాతి చెందింది. ఈ ఆలయం చుట్టూ ఎత్తైన చెట్లతో కూడిన కొండపై.. ఉత్తర ద్వారం జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం కలిగి ఉంది. రెండో శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని మౌర్య చంద్రగుప్త పాలనలో ఉంది. దీన్నే పూర్ మ్యాన్స్ ఊటీ అని పిలుస్తారు. క్రీ.శ.14వ శతాబ్దిలో మాధవనాయుడు కొండపైకి వెళ్ళేందుకు మెట్లను నిర్మించినట్లు ప్రచారం.

News January 4, 2025

దేవరకద్ర: సాగుచేసిన రైతులకు రైతుభరోసా: జూపల్లి

image

పంటలు సాగు చేసిన రైతులకు రైతుభరోసా అందిస్తామని, రేపు జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. దేవరకద్రలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గత BRS ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రైతులకు రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేసిందన్నారు.

News January 3, 2025

కేటిదొడ్డి: ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం.. తల్లిబిడ్డా క్షేమం

image

ఆర్టీసీ బస్సులో నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో డ్రైవర్‌, కండక్టర్‌ సహకారంతో ప్రయాణికులే పురుడు పోసిన ఘటన శుక్రవారం గద్వాల ఆర్టీసీ డిపో పరిధిలో చోటు చేసుకుంది. రాయచూరు జిల్లా బాయిదొడ్డికి చెందిన పావని నిండు గర్భిణీ కావడంతో ఆరోగ్య పరీక్షల నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి ఆర్టీసీ బస్సులో ఎక్కింది. మార్గమధ్యలో నందిన్నె వద్ద ఆమెకు పురిటినొప్పులు రావడంతో బస్సులోనే ప్రసవం చేశారు.

News January 3, 2025

కల్వకుర్తి: తాండ్ర ఉన్నత పాఠశాల అభివృద్ధికి రూ.5 కోట్లు 

image

కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి తాండ్ర పాఠశాలలో చదువుకున్నారు. ఇటీవల కల్వకుర్తిలో పర్యటించిన సందర్భంగా తాండ్ర పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. హామీ మేరకు నిధులు మంజూరు కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News January 3, 2025

MBNR: చదివింది చారెడు.. చికిత్సలు బారెడు!

image

అసలే గ్రామీణ ప్రాంతాలు.. అంతంతే వైద్య సేవలు. దీనినే పెట్టుబడిగా పెట్టుకుని పాలమూరులో కొందరు నకిలీ RMPలు చెలరేగిపోతున్నారు. చదివింది చారెడు.. చికిత్సలు బారెడు అనేలా.. వచ్చీరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు సిఫార్సు చేస్తూ భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై DMHO కృష్ణ వివరణ కోరగా.. అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

News January 3, 2025

MBNR: దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

image

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ పరిధి చిలుకూరులో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గద్వాల జిల్లా ధరూర్ మండలానికి చెందిన దంపతులు బతుకుదెరువు నిమిత్తం HYD వలస వచ్చి చిలుకూరులో ఉంటున్నారు. వారికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. గురువారం స్థానికంగా ఉండే ఓ యువకుడు చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి PSలో అప్పగించారు. కేసు నమోదైంది.

error: Content is protected !!