Mahbubnagar

News September 4, 2024

శాంతి భద్రతల రక్షణలో డయల్ 100 సేవలు కీలకం: ఎస్పీ యోగేష్

image

శాంతి భద్రతల రక్షణలో డయల్ 100 సేవలు కీలకమని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న బ్లూ కోర్ట్స్, పెట్రో కార్స్ పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులు డయల్ 100కు ఫోన్ చేసిన వెంటనే పోలీసులు స్పందించాలని, ఘటన స్థలానికి చేరుకొని బాధితులకు సహాయం అందించాలని అన్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

News September 4, 2024

MBNR: గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గ్రామపంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ సహా ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొద్ది నెలలుగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల నిలిచిపోవడంతో ఖజానా ఖాళీగా దర్శనమిస్తోంది. ఓ వైపు ట్రాక్టర్ల నెలవారీ కిస్తీలు పేరుకుపోతుండగా, మరోవైపు కార్మికులకు వేతనాలు లేక ఇబ్బందులు తప్పడంలేదు.

News September 4, 2024

శ్రీకృష్ణుడి శోభయాత్రలో ఎమ్మెల్యేలు

image

భూత్పూర్ మండలం మదిగట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బుధవారం నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, శ్రీకృష్ణుని శోభాయాత్రలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కుచుకుళ్ల రాజేశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News September 4, 2024

MBNR: ‘మట్టి మేలు’ తలపెట్టవోయ్!

image

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే వ్యాపారులు వివిధ ప్రాంతాల నుంచి ఆకట్టుకునే రూపాల్లో ఉన్న మట్టి గణపతి విగ్రహాలను ఇప్పటినుంచే మార్కెట్లో అమ్మకానికి ఉంచుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల కన్నా మట్టి విగ్రహాలు పర్యావరణాన్ని పరిరక్షిస్తాయని నిపుణులు అంటున్నారు.

News September 4, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు రానున్నాయి. పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి సిబ్బంది లేకపోవడంతో.. విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఉమ్మడి జిల్లాలో 3,227 ప్రభుత్వ పాఠశాలల్లో.. 3,01,693 మధ్య విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో స్కావెంజర్లు ఏర్పాటుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు మంజూరు అయ్యాయని డీఈఓ రవీందర్ తెలిపారు.

News September 4, 2024

కొనసాగుతున్న జూరాల విద్యుత్ ఉత్పత్తి

image

జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలకడగా కొనసాగుతోంది. మంగళవారం ఎగువ జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్లలో ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్ ఈలు సురేశ్, సూరిబాబు వివరించారు. ఎగువలో 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 130,116 ఎం. యూ. దిగువలో ఇప్పటి వరకు 99,710 ఎంయూ విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 228.909 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామని తెలిపారు.

News September 4, 2024

మహబూబ్ నగర్-విశాఖ ఎక్స్‌ ప్రెస్ రద్దు

image

భారీ వర్షాల కారణంగా MBNR- విశాఖపట్నం, విశాఖపట్నం- MBNR(12862/61) ఎక్స్ ప్రెస్ రైళ్లను నిరవధికంగా రద్దు చేశారు. వరంగల్-ఖమ్మం మధ్యన వరదలకు పట్టాలు దెబ్బతినడంతో ఈ రైలును ఆది, సోమతో పాటు మంగళవారం కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు(12862) రోజూ సాయంత్రం 6.20 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి, విశాఖపట్నం నుంచి వచ్చే రైలు (12861) రోజూ ఉదయం 6.45 గంటలకు కాచిగూడకు వస్తుంది.

News September 4, 2024

ప్రభుత్వ వైఫల్యంతో నష్టం వాటిల్లింది: నిరంజన్ రెడ్డి

image

WNP: ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రమంతా ఈ రోజు అపార నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విపత్తు సంభవించినప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి సోయి లేకుండా, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోలేదన్నారు. ఐదు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుంటే ఈ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారని నిలదీశారు.

News September 4, 2024

శ్రీశైలం UPDATE.. నీటి మట్టం 883.80 అడుగులు

image

శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. 10 గేట్లను ఎత్తి 2,70,470 క్యూసెక్కులు, కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల ద్వారా 67,217 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు జలాశయంలో నీటి మట్టం 883.80 అడుగులకు చేరింది. జూరాల నుంచి 2,08,511 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 10,326 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు.

News September 4, 2024

MBNR: బీఆర్ఎస్ నేతలకు సంపత్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్

image

విపత్కర పరిస్థితుల్లో BRS నేతలు రాజకీయాలు చేయొద్దని AICC కార్యదర్శి సంపత్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా 24 గంటలు తమ ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తలు పని చేస్తున్నారు. BRS నేతలు KTR, హరీశ్ రావు ఇద్దరు రాజకీయ లబ్ధి కోసం విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. జనాలు తిరగబడి చెప్పుతో కొట్టే రోజులు వస్తాయని’ ఆయన హెచ్చరించారు.