Mahbubnagar

News January 1, 2025

MBNR: నగ్న చిత్రాలు తీసి అత్యాచారం

image

ఓ మహిళ నగ్న చిత్రాలు తీసి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన అమానవీయ ఘటన నవాబ్‌పేట మం.లో జరిగింది. SI విక్రమ్ వివరాలు.. ఓ మహిళ స్నానం చేస్తుండగా నర్సింహులు ఫొటోలు తీశాడు. సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజు రోజుకి వేధింపులు పెరగడంతో బాధితురాలు PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News January 1, 2025

పాలమూరు మెడికల్ కళాశాలకు వృద్ధురాలి మృతదేహం 

image

జడ్చర్ల పట్టణంలోని ఓ వృద్ధాశ్రమంలో మృతి చెందిన వృద్ధురాలు గొల్ల భీమమ్మ మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆశ్రమ నిర్వాహకులు చిత్తనూరి రామకృష్ణ మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాలకు వృద్ధురాలి మృతదేహాన్ని మంగళవారం అప్పగించారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్ మొదటి సంవత్సర చదువుతున్న విద్యార్థులు మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఛైర్మన్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.

News January 1, 2025

MBNR: యుజీసీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేయాలి: కలెక్టర్

image

జనవరి 3న MBNRలో నిర్వహించే యుజీసీ నెట్ 2024 పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. పరీక్షలు నిర్వహించే సెంటర్‌ను మంగళవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. పరీక్షలకు 185 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద శాంతి భద్రతల నిర్వహణ, నిరంతర విద్యుత్, ఫస్ట్ ఎయిడ్ కిట్ తదితర సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

News December 31, 2024

గద్వాల: ఉత్తమ సేవలతో ఉద్యోగులకు గుర్తింపు: అడిషనల్ కలెక్టర్

image

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని, వారికి తమ ఉత్తమ సేవలు గుర్తింపునిస్తాయని గద్వాల అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో క్రీడల అధికారి ఆనంద్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లడుతూ.. జిల్లాలో క్రీడారంగం అభివృద్ధికి ఆనంద్ విశేష కృషి చేశారని కొనియాడారు. క్రీడా కార్యక్రమాల్లో ఆయన అందించిన సేవలు అభినందనీయమని ప్రశంసించారు.

News December 31, 2024

MBNR: బై బై 2024.. ఏం సాధించారు? ఏం కోల్పోయారు?

image

ఈ ఏడాది నేటితో పూర్తవుతోంది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు ఈ సంవత్సరం ఎన్నో తీపి జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాలను మిగిల్చింది. చేసిన తప్పుల నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని ఉంటారు. వాటన్నింటిని సరిదిద్దుకునే ప్రయత్నమూ చేసుంటారు. మరీ ఈ ఏడాది మీరేం సాధించారు? ఏం కోల్పోయారు? ఏం నేర్చుకున్నారు? మీ మధుర జ్ఞాపకాన్ని కామెంట్ చేయండి.

News December 31, 2024

2024కు వీడ్కోలు పలికేందుకు అంతా సిద్ధం

image

2024కి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు పాలమూరు జిల్లా వ్యాప్తంగా చిన్నా పెద్ద సిద్ధమయ్యారు. యువతులు న్యూ ఇయర్ సందర్భంగా ఇంటి ముందు రంగుల ముగ్గులు వేసి 2025కి స్వాగతం పలికేందుకు రెడీగా ఉండగా.. యువకులు పార్టీలు, దావత్‌లు అంటూ ఫుల్ జోష్ మీద ఉన్నారు. కొందరు మాత్రం ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి న్యూ ఇయర్‌కు మీప్లాన్స్ ఏంటో కామెంట్ చేయండి.

News December 31, 2024

మహబూబ్ నగర్‌కు హైకోర్టు మాజీ న్యాయమూర్తి రాక

image

మహబూబ్ నగర్‌కు నేడు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ వస్తున్నట్లు గద్వాల కలెక్టర్ సంతోష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ పై అధ్యయనం చేస్తారని తెలిపారు. ఇందుకు గాను జిల్లాలోని ఎస్సీ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కుల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు MBNR కలెక్టరేట్లో హాజరై మాజీ న్యాయమూర్తికి విజ్ఞాపనలు సమర్పించి, చర్చించుకోవాలని తెలిపారు.

News December 31, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔కల్వకుర్తి‌:రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి✔న్యూ ఇయర్..ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు:SPలు✔గద్వాల:13వ రోజు న్యాయవాదుల దీక్ష✔ఎస్ఎస్ఏలకు క్రమబద్ధీకరించాలి:బిఎస్పీ✔జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు గద్వాల యువకుడు✔NGKL:పాముకాటుతో యువ రైతు మృతి✔NRPT:PSను తనిఖీ చేసిన డిఎస్పీ✔19వ రోజు కొనసాగిన ఉద్యోగుల సమ్మె✔సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:SIలు ✔జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన కోస్గి విద్యార్థి

News December 30, 2024

కల్వకుర్తి‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి యువకులు మృతి

image

కల్వకుర్తిలోని కొత్త కాటన్ మిల్ వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్‌పై కల్వకుర్తి వైపు వస్తున్న ఇద్దరు యువకులు అదుపుతప్పి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పట్టణానికి చెందిన శ్రీనాథ్ (17), భాను (16)గా గుర్తించారు. మృతులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

News December 30, 2024

వనపర్తి: ‘లిఫ్ట్ ఇరిగేషన్ సబ్ స్టేషన్ నిర్మాణానికి నిధులు విడుదల’

image

కర్నే తండా లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించిన విద్యుత్‌ ఉప కేంద్రాన్ని వెంటనే మంజూరు చేయాలని గతంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా రూ.1 కోటి 63 లక్షల మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో RT నంబర్ 345 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

error: Content is protected !!