Mahbubnagar

News July 24, 2024

కొల్లాపూర్: నీట మునిగిన శ్రీ సంగమేశ్వరం

image

కొల్లాపూర్ తీరానికి సమీపంలోని సోమశిలలో సప్త నదుల ప్రాంతం శ్రీ సంగమేశ్వర క్షేత్రం చుట్టూ కృష్ణా నది వరదతో ఆలయంలోని వేపదారు శివలింగం నీట మునిగింది. జటప్రోల్లో పురాతన దర్గా, సురభి రాజుల భవనం చుట్టూ వరదలాలు ప్రవహించాయి. మత్స్యకారులు తీరం వెంబడి ఏర్పరచుకున్న తాత్కాలిక నివాసాలను ఎగువ ప్రాంతానికి తరలించారు. పుష్కర ఘాట్లకు వరద వచ్చి చేరింది. 842 అడుగులకు పైగా వరద జలాలు శ్రీశైలం వైపు ప్రవహిస్తున్నాయి.

News July 24, 2024

MBNR: 20ఏళ్ల తర్వాత దేవాదాయ శాఖలో బదిలీలు

image

దేవాదయ శాఖలో 20 ఏళ్ల తర్వాత బదిలీలు కానున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1340 దేవాలయాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం పొందుతున్నవారు 236 మంది ఉన్నారు. ఉద్యోగుల పూర్తి వివరాలను రాష్ట్ర కమిషనర్ కార్యాలయానికి పంపించినట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీనివాసరాజు వెల్లడించారు. ఈనెల 29 వరకు బదిలీల ప్రక్రియ పూర్తి కానుంది.

News July 24, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలు ఇలా..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా ఉడిత్యాల్లో 15.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా సిరిసినగండ్లలో 13.5 మి.మీ, నారాయణపేట జిల్లా బిజ్వార్‌లో 8.8 మి.మీ వనపర్తి జిల్లా సోలిపూర్‌లో 6.8 మి.మీ, గద్వాల జిల్లా రాజోలిలో 2.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 24, 2024

‘PU అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలి’

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ఇటీవలే వెలువడిన సెమిస్టర్-6 ఫలితాలు వెలువడ్డాయి. ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలని PU పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో సెమిస్టర్-6 చదివి ఫెయిల్ అయిన విద్యార్థులు యూనివర్సిటీ అధికారులను కోరుతున్నారు. అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించకపోతే ఒక సంవత్సరం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News July 24, 2024

అచ్చంపేట: ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

image

అచ్చంపేటలో ఓ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 19న పాఠశాలలో షీటీం ఇన్ ఛార్జ్ పద్మ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తన ఫోన్‌లో నీలిచిత్రాలు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించినట్లు షీటీం దృష్టికి వచ్చింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News July 24, 2024

శ్రీశైలంకు కొనసాగుతున్న వరద

image

శ్రీశైలం జలాశయంలో మంగళవారం 842.4 అడుగుల నీటిమట్టం, 65.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం జూరాల గేట్లు ఎత్తి 1,22,357 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 29,433 మొత్తం 1,51,790 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. 24గంటల వ్యవధిలో రేగుమాన్ గడ్డ నుంచి ఎంజీకేఎస్ఐకు 977క్యూసెక్కుల నీటిని ఎత్తిపోశారు. భూగర్భ కేంద్రంలో 2.346 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నారు.

News July 24, 2024

మహబూబ్‌నగర్ రావడం సంతోషంగా ఉంది: నాగ్ అశ్విన్

image

కల్కి సినిమా డైరక్టర్ నాగ్ అశ్విన్ MBNR జిల్లా కేంద్రంలోని ఏవీడీ సినిమాస్ (థియేటర్)కు మంగళవారం రావడంతో ఆయన్ను చూస్తేందుకు యువత, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. అభిమానులను ఉద్దేశించి నాగ్ మాట్లాడుతూ.. మన జిల్లాకు రావడం సంతోషంగా ఉందని, తమ ఫ్యామిలీ అందరూ ఇక్కడి వారే కావడం, కల్కి సినిమా ఇక్కడ పెద్దగా ఆడడం సంతోషంగా ఉందన్నారు. ప్రభాస్ అభిమానులకు, ఉమ్మడి జిల్లా సినిమా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

News July 24, 2024

కేంద్ర బడ్జెట్‌లో పాలమూరుకు నిరాశే..!

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వివిధ వర్గాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ప్రధానంగా ఈసారి బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు లేకపోవడం పాలమూరు ప్రజల్ని నిరాశకు గురిచేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై, కొత్తగా నిర్మించ తలపెట్టిన రైల్వేలైన్ల నిర్మాణంపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

News July 24, 2024

MBNR: మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు

image

ఉమ్మడి జిల్లాలో మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు చేపట్టినట్లు సెర్ఫ్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కరుణాకర్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా మహిళా సమాఖ్య భవనంలో ఇంటర్వ్యూ ద్వారా ఎస్ఆర్పీల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 23 మంది ఎస్ఆర్పీలను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు.

News July 24, 2024

కేంద్ర బడ్జెట్‌పై పాలమూరు ఎంపీలు ఏమన్నారంటే..!

image

కేంద్ర బడ్జెట్‌లో పాలమూరుకు ఎలాంటి కేటాయింపులు జరగలేదని మల్లురవి అన్నారు. ‘పాలమూరు-రంగారెడ్డి ఊసేలేదు. ఉన్నత విద్యా సంస్థలు, రైల్వే లైన్లు లేవు. జిల్లాకు జరిగిన అన్యాయంపై ఆందోళన చేస్తాం’ అని ఆయన హెచ్చరించారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా బడ్జెట్ ఉందని DK అరుణ హర్షం వ్యక్తం చేశారు. యువత, మహిళలు, రైతులకు ఎంతో మేలు జరగనుందని, ఉద్యోగులకు ఊరట, PM ఆవాస్‌ యోజన కింద ఇళ్లు నిర్మిస్తారని ఆమె అన్నారు.