Mahbubnagar

News July 24, 2024

MBNR: తెలంగాణకు బడ్జెట్‌లో మొండి చేయి..!: మంత్రి జూపల్లి

image

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉందని, ఎప్పటి లాగే తెలంగాణకు మొండి చేయి చూపారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఎన్డీయే భాగస్వాములైన ఏపీ, బీహార్‌లో పాటు అస్సాంకు ప్రాధాన్యం కనిపించిందని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ఊసే లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై ఎలాంటి భరోసా ఇవ్వలేదని విమర్శించారు.

News July 23, 2024

గద్వాల : జూరాలకు కొనసాగుతోన్న వరద

image

జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం జూరాల జలాశయంలో 317.560 మీటర్ల స్థాయిలో 7.759 టీఎంసీల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. జూరాలకు ఎగువ ప్రాంతం నుంచి 1,65,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 36 గేట్లను ఎత్తి దిగువకు 1,41,357 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దీంతో పాటు విద్యుత్ ఉత్పత్తికి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి నీటిని వినియోగిస్తున్నారు.

News July 23, 2024

MBNR:ఉమ్మడి జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

✓MBNR:కల్కి మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న నాగ్ అశ్విన్.✓ తెలంగాణకు బిజెపి మొండి చేయి: పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.✓ కోయిలకొండ వీరభద్ర స్వామి ఆలయంలో నాగుపాము దర్శనం.✓ కొడంగల్: కడ పరిధిలో అభివృద్ధి పనులపై పవర్ ప్రజెంటేషన్.✓ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు పాల్గొన్న ఎమ్మెల్యేలు✓ గద్వాల జిల్లా కూలీలను మట్టి మిద్దె తప్పిన పెను ప్రమాదం.✓ జూరాలకు పోటెత్తిన వరద.

News July 23, 2024

MBNR: కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ ఏడ్మా సత్యం మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, మొక్కను అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

News July 23, 2024

గద్వాల జిల్లాలో కూలిన మట్టి మిద్దె.. తప్పిన ప్రమాదం..!

image

ఉమ్మడి జిల్లాలో మరో మట్టిమిద్దె కూలింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గద్వాల జిల్లా రాజోలి మండలం తూర్పు గార్లపాడుకు చెందిన మార్కు మట్టిమిద్దె నానింది. మంగళవారం తెల్లవారుజామున ఓ గది పైకప్పు కూలింది. ప్రమాద సమయంలో మార్కు, భార్య, పిల్లలతో కలిసి పక్క గదిలో పడుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. గతంలో NGKL జిల్లాలో మిద్దెకూలి నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.

News July 23, 2024

‘పాలమూరు’ ప్రాజెక్టుకు సాయం అందేనా..?

image

పాలమూరు జిల్లాలో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రం నుంచి నిధులు అందజేయాలన్న డిమాండ్ ఉంది. రూ.52 వేల కోట్ల అంచనాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు అందిస్తే త్వరితగతిన పూర్తి కానుంది. ఈసారి బడ్జెట్లో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం అందుతుందన్న అంచనాలున్నాయి. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్న డిమాండ్ ఉంది.

News July 23, 2024

పార్లమెంటులో పాలమూరుకు న్యాయం జరిగేనా..!

image

నేడు జరగనున్న కేంద్ర బడ్జెట్‌లో పాలమూరుకు న్యాయం జరిగినా !. ఎన్నో ఏళ్లుగా వికారాబాద్, కృష్ణ రైల్వే లైన్ కోసం ఈ ప్రాంత ప్రజలు నిరీక్షిస్తున్నారు. నూతనంగా ఏర్పాటైన జిల్లాలు నవోదయ పాఠశాలల కోసం ఎదురుచూస్తున్నారు. నారాయణపేటలో సైనిక పాఠశాల ప్రారంభంలోనే ఆగిపోయింది. నల్లమలకు పర్యటక హబ్, మాచర్ల రైల్వే లైన్ కోసం ఉమ్మడి జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.

News July 23, 2024

ఆల్మట్టి ప్రాజెక్టు అప్డేట్

image

ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో భారీగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు 1,15,406 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో 1.50 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 123.081 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 93.810 టీఎంసీల నీరు నిల్వ ఉంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు.

News July 23, 2024

NGKL: పాముకాటుతో బాలిక మృతి

image

NGKL: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక పాముకాటుకు గురై మృతి చెందిన ఘటన చారకొండ మండలంలోని తుర్కలపల్లికి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఏదుల సువర్ణ, యాదయ్య దంపతుల పెద్ద కూతురు రేణుక(4) సోమవారం రాత్రి 8 గంలకు ఇంటి ముందు ఆడుకుంటుండగా కాలుపై పాము కాటువేసింది. బిడ్డ ఏడుస్తూ రావడంతో గమనించిన తల్లిదండ్రులు వెంటనే కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది.

News July 23, 2024

MBNR: ప్రతి 15 రోజుల లక్కీ డిప్

image

ఈనెల 1 నుంచి టీజీఆర్టీసీ ప్రవేశపెట్టిన గిఫ్ట్ స్కీంలో భాగంగా డీలక్స్ బస్సుల్లో ప్రయాణించిన మహిళా ప్రయాణికుల ప్రతి 15 రోజుల లక్కీ డిప్ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో నిర్వహించారు. రీజియన్ పరిధిలో నిర్వహించిన ఈ లక్కీడ్రాలో లక్ష్మీదేవమ్మ, సుజాత, అర్షియాబేగం విజేతలుగా నిలిచారు. వీరికి సమాచారం ఇచ్చామని, త్వరలో బహుమతులు అందజేస్తామని అధికారులు తెలిపారు.