Mahbubnagar

News July 23, 2024

శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు చేరిక

image

శ్రీశైలం జలాశయానికి ఎగువనున్న జూరాల ప్రాజెక్టు క్రస్టు గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా సోమవారం 1,74,717 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతుంది అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 832.5 అడుగుల వద్ద 52.1476 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో స్థానికంగా 14.0 మి.మీ., వర్షపాతం నమోదైంది. అలాగే శ్రీశైలం జలాశయంలో నుంచి 61 క్యూసెక్కుల నీరు ఆవిరైంది.

News July 23, 2024

స్వచ్ఛందంగా పోలీసుల సేవలను వినియోగించుకోవాలి: ఎస్పీ

image

ప్రజలు ఎలాంటి పైరవీలు చేయకుండా స్వచ్ఛందంగా పోలీసుల సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ జానకి అన్నారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సంబంధిత మండల ఎస్సైకు ఫోన్ చేసి ఫిర్యాదుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వేగవంతంగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఫిర్యాదుదారులతో సీఐ, ఎస్సైలు మర్యాదపూర్వకంగా మెలగాలని అన్నారు.

News July 22, 2024

రేపు MBNR జిల్లాకు కల్కి బుజ్జి కారు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్‌లో రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు కల్కి సినిమా విజయోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్, కల్కిలో ముఖ్యపాత్ర పోషించిన బుజ్జి కార్ రాబోతోందని తెలిపారు. గత నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కల్కి సినిమా భారీ విజయం సాధించిందని పేర్కొన్నారు.

News July 22, 2024

రేపు MBNR జిల్లాకు కల్కి బుజ్జి కారు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్‌లో రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు కల్కి సినిమా విజయోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్, కల్కిలో ముఖ్యపాత్ర పోషించిన బుజ్జి కార్ రాబోతోందని తెలిపారు. గత నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కల్కి సినిమా భారీ విజయం సాధించిందని పేర్కొన్నారు.

News July 22, 2024

మహబూబ్‌నగర్‌ ఐడీవోసీ ఉద్యోగి మృతి

image

మహబూబ్‌నగర్‌లో ఐడీవోసీ కార్యాలయం ఉద్యోగి మృతిచెందారు. ఎస్టీవో మోహన్ రాజ్ విధులకు హాజరవుతుండగా నీరసంతో కిందపడి చనిపోయినట్లు తెలిసింది. మృతుడు మోహన్ రాజ్ స్వస్థలం వనపర్తి జిల్లా. ఘటనకు సంబంధించి మరిన్ని సమాచారం తెలియాల్సి ఉంది.

News July 22, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి జిల్లాలో సోమవారం నమోదైన వివరాలిలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వాత్త్వర్లపల్లి 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా పెబ్బేరు 9.5 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో 6.8 మి.మీ, గద్వాల జిల్లా బీచుపల్లిలో 6.4 మి.మీ, నారాయణపేట జిల్లా ధన్వాడలో 4.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

News July 22, 2024

MBNR: మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ !

image

ఉమ్మడి జిల్లాలోని మహిళలు వివిధ వ్యాధులతో సతమతం అవుతున్నట్లు ‘ఆరోగ్య మహిళ’ ప్రత్యేక వైద్య పరీక్షల్లో తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 64 PHCల్లో 340 మంది మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు గుర్తించారు. ముఖ్యంగా అతివల్లో క్యాన్సర్‌ ముప్పు చాపకింద నీరులా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పని ఒత్తిడితో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని.. అవగాహనతో వ్యాధిని నయం చేసుకోవచ్చని గద్వాల DMHO శశికళ అంటున్నారు.

News July 22, 2024

గద్వాల: దంపతుల మధ్య గొడవ.. భర్త సూసైడ్

image

దంపతుల మధ్య గొడవతో భర్త సూసైడ్ చేసుకున్నాడు. గద్వాలకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సుధీర్‌, శ్వేత దంపతులు HYD అత్తాపూర్‌‌లో ఉంటున్నారు. శనివారం శ్వేత సోదరుడి ఇంటికి వెళ్లారు. అక్కడ దంపతుల మధ్య గొడవ జరగ్గా విసుగెత్తిన సుధీర్‌ సెల్‌ఫోన్‌ నేలకేసికొట్టి తన ఇంటికి వచ్చేశారు. కోపంతో వెళ్లారని అక్కడే ఉన్న శ్వేత.. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి సుధీర్‌ ఉరేసుకొని కనిపించారు. ఘటనపై కేసు నమోదైంది.

News July 22, 2024

ఉమ్మడి జిల్లాలో జోరందుకున్న నాట్లు

image

వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలో ముసురు వాన కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెక్ డ్యాంలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టులు, జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యప్తంగా వారి నాట్లు జోరందుకున్నాయి. బారి వర్షాలకు జిల్లాల వారీగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

News July 22, 2024

ఈ సరైన పంట రుణమాఫీ అయ్యేనా..?

image

ఏటా ఉమ్మడి జిల్లాలో వానకాలం, యాసంగి సీజన్లో రైతులకు ఆశించిన స్థాయిలో పంట రుణాలు అందటం లేదు. పంట రుణమాఫీ చేస్తారని రైతులు రెన్యూవల్ చేసుకోవడం లేదనీ, కొత్త రుణాలు ఇవ్వకపోవడానికి ఇదే కారణమని బ్యాంకర్లు సాకులు చెబుతూ వచ్చారు. ఈ ఏడాది ప్రభుత్వం పంట రుణమాఫీ చేయడంతో బ్యాంకర్లు కొత్త రుణాలను లక్ష్యం మేర మంజూరు చేస్తారన్న ఆశలు రైతుల్లో చిగురిస్తున్నాయి.