India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందిన ఉద్యోగులపై కలెక్టర్ విజయేందిర కొరడా ఝుళిపించారు. వారికి కేటాయించిన ఇళ్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అనర్హులకు డబుల్ ఇళ్ల కేటాయించారన్న ఫిర్యాదులపై విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ, రిటైర్డ్, పెన్షనర్లు ఇళ్లు పొందినట్లు తేలింది. దీంతో నిబంధనలు అతిక్రమించిన ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాని చెప్పారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి పీఆర్ఎల్ఐ పథకంగా పేరు పెడుతూ.. నీటిపారుదల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి జైపాల్ రెడ్డి పేరు పెట్టడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.
ఓ మహిళ అదృశ్యమైన ఘటన మండలంలో జరిగింది. ఎస్ఐ వెంకటేశ్ వివరాల ప్రకారం.. మండలంలోని కొనగట్టుపల్లి గ్రామానికి చెందిన రావుల చెన్నమ్మ (30) ఈనెల 17న పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదు. బాధితురాలు తల్లి జంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
జడ్చర్ల మండలంలోని నసురుల్లాబాద్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరులో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరిగినా తాను సహించేది లేదని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికీ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులదేనని స్పష్టం చేశారు.
కౌకుంట్ల మండలం పేరూరు గ్రామంలో నేడు ఉదయం 10:00 గంటలకు నిర్వహించే గ్రామ సభలో దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జీ. మధుసుధన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐ సీసీ సెక్రటరీ, తెలంగాణ ఇన్‌ఛార్జ్ విశ్వనాథ్ అదే పాల్గొంటారు. ఈ సభను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జీఎంఆర్ తెలిపారు. ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఆత్మీయ బరోసా కు వినతి పత్రాలను ఇవ్వాలన్నారు.
భూత్పూర్ మండలంలోని కప్పెట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజ నరసింహ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామ సభల ద్వారా ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవచ్చన్నారు. ప్రజలతో మమేకం కావడానికి, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి ఇలాంటి గ్రామసభలు ఉపయోగపడుతాయని తెలిపారు. ఆయన వెంట దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు.
ఆత్మకూరు మండలంలోని శ్రీరామ్ నగర్ వెళ్లే రహదారిలో బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని అరుదైన జాతికి చెందిన పిల్లి మృతి చెందింది. అటుగా వెళ్తున్న వాహనదారులు ఇది గుర్తించి మొదట పులి పిల్ల అని భావించి.. దగ్గరికెళ్లేందుకు భయపడ్డారు. కొంతమంది ధైర్యం చేసి దగ్గరికి వెళ్లి చూడగా అది అరుదైన జాతికి చెందిన పిల్లిగా గుర్తించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు కావలసిన వసతులు ఉన్నాయా లేవా అని ఇంటర్ అధికారులు ఆరా తీస్తున్నారు. మౌలిక వసతులకు సంబంధించిన వివరాలను ఇంటర్ అధికారులు తీసుకుంటున్నారు. ఈ ఏడాది నుంచి ప్రయోగ పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగనున్నాయి.
మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో <<15213302>>మహిళ<<>> ఉరేసుకున్న విషయం తెలిసిందే. దామరగిద్ద మండలం కందేన్‌పల్లికి చెందిన నారమ్మ(32) భర్తతో విడాకులు తీసుకొని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె MBNR ఆస్పత్రికి వచ్చింది. మంగళవారం ఉదయం బాత్‌రూంలో సూసైడ్ చేసుకుంది. కడుపునొప్పి భరించలేక తన కూతురు సూసైడ్ చేసుకుందని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో తొలిరోజు గ్రామ, వార్డు సభలకు దరఖాస్తుదారులు పోటెత్తారు. 4 పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జాబితాతో పేర్లు లేకపోవడంతో ప్రజలు నిలదీయడం, అధికారులు సముదాయించడంలో ఉక్కిరిబిక్కిరయ్యారు. తొలిరోజు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులకు MBNRలో 6096, NGKLలో 2826, వనపర్తిలో 4749 అప్లికేషన్లు రాగా, గద్వాలలో మొత్తం 7539, NRPTలో 3073 దరఖాస్తులు వచ్చాయి.
Sorry, no posts matched your criteria.