India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని రోజులుగా తేలికపాటి వర్షాలు పడడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం నుంచి ఆకాశం మేఘాకుతమై ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులు సూచించారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా గండీడ్ మండలం సల్కర్ పేటలో 41.5 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మహమ్మదాబాద్ 14.0, దేవరకద్ర 8.5, మహబూబ్‌నగర్ అర్బన్ 6.5, కోయిలకొండ మండలం పారుపల్లి 4.3, భూత్పూర్ 2.8, హన్వాడ 2.5, చిన్న చింతకుంట 1.0 మిల్లీమీటర్ల వర్షం రికార్డయింది.

దేశ రాజధాని దిల్లీలో సోమవారం బీజేపీ సీనియర్ ఎంపీలు సమావేశమయ్యారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో MBNR ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడానికి దిల్లీ వెళ్లిన ఆమె, పలు కీలక అంశాలపై ఎంపీలతో చర్చించారు.

ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావడమే తమ లక్ష్యమని ఎస్పీ జానకి తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 12 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు.

PUతో అమెరికాలోని నోట్రె డామ్ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ సెంటర్ ఫర్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ ది హోల్ చైల్డ్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో బీఈడీ అధ్యాపకుల ద్వారా విద్యార్థులను సామాజికంగా తీర్చిదిద్దొచ్చని యూనివర్సిటీ తెలిపింది. PU ఉపకులపతి ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ సమక్షంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పూస రమేశ్ బాబు, గ్లోబల్ సెంటర్ ప్రతినిధి రుబీనా ఫిలిప్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల కళలశాఖ ప్రతి సంవత్సరం ‘పి.వి.రమణ రంగస్థల స్మారక పురస్కారం’ ప్రదానం చేయనున్నారు. 2024-25 సంవత్సరానికి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ ఓ సర్కులర్ విడుదల చేసింది. ఆగస్టు 1లోగా రంగస్థలంలో కృషి చేసిన నటులు, సాంకేతిక నిపుణులు అర్హులైన వారు తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణంలో తమ బయోడేటాతో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.

రైతులకు కేంద్రం అందిస్తున్న రూ.6వేలు ‘PM-KISAAN’ పథకాన్ని అడ్డుపెట్టుకొని సైబర్ కేటుగాళ్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. వాటిపై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. నకిలీ యాప్లపై క్లిక్ చేయవద్దని, OTPలు ఎవరికి చెప్పవద్దని ఆయా జిల్లాల ఎస్పీలు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి సూచించారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే 1930కు ఫోన్ చేయాలన్నారు. SHARE IT

HYDలో కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు Xలో ట్వీట్ చేశారు. ‘ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎంతటి వారినైనా వదలం. కల్లు శాంపిల్ టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ పంపాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు, కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం’ అని రాసుకొచ్చారు.

కొత్త రేషన్ కార్డు తమకు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌లో https:epds.telangana.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. FSC Search.FSC Application Search ఆప్షన్ స్క్రీన్‌పై క్లిక్ చేస్తే మీ-సేవా అప్లికేషన్ సెర్చ్ విండో ఓపెన్ అవుతుంది. మీ జిల్లాను ఎంచుకొని, మీ-సేవా కేంద్రం ఇచ్చిన అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి Search క్లిక్ చేయాలి. వెంటనే మీ దరఖాస్తుకు సంబంధించిన స్టేటస్ కింద డిస్ ప్లే అవుతుంది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి B- డివిజన్ 2డే లీగ్ టోర్నీలో ఉమ్మడి పాలమూరు జిల్లా జట్టు మొదటి రోజు సత్తాచాటింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు 68.1 ఓవర్లలో 243/10 పరుగులు చేసింది. అనంతరం రాకేష్-XI జట్టు 19.1 ఓవర్లలో 55/6 పరుగులు చేసింది. మహబూబ్ నగర్ జట్టులో శ్రీకాంత్-71, సంజయ్-69 పరుగులు చేయగా.. గగన్ 4 వికెట్లు తీశారు. మహబూబ్ నగర్ 188 పరుగుల లీడ్‌లో ఉంది.
Sorry, no posts matched your criteria.