India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్ మాట్లాడారు. వాట్సప్, ఫేస్‌బుక్, టెలిగ్రాం, మొదలైన సోషల్ మీడియా యాప్స్‌లో వచ్చే ఏ.పి.కె. ఫైల్స్ లింకులను ఓపెన్ చేయవద్దని ప్రజలను కోరారు. సైబర్ నేరగాళ్లు ఇలాంటి లింకులను పంపుతున్నారని, వీటిని ఓపెన్ చేస్తే బ్యాంకు అకౌంట్లలోని డబ్బులు పోయే ప్రమాదం ఉందన్నారు.
రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతనంగా 112 ఆప్ తీసుకొచ్చింది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో 112కు ఫిర్యాదు చేస్తే సమీపంలోని ఠాణాకు సమాచారం వెళ్తుందని వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. అప్రమత్తమై లొకేషన్ ద్వారా వారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి కాపాడుతారని.. ప్రతి ఒక్కరు ఈ యాప్‌పై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జూరాలకు వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతూనే ఉంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు నారాయణపురం డ్యాం నుంచి దిగువ ఉన్న జూరాల ప్రాజెక్టుకు 1 లక్ష 70 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. దీంతో జూరాల 37 గేట్లను ఎత్తివేసి 1 లక్ష 84 వేల క్యూసెక్కుల పడితే నీటిని వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరవళ్లు తొక్కుతుంది. నదితీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా గనపూర్‌లో 15.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో 13.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా రాజోలిలో 12.0 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్లలో 9.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ధన్వాడలో 5.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
ఉమ్మడి జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతకు ఎస్బీఐ ఆధ్వర్యంలో ఏసీ రిపేరింగ్ ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నామని ఆఫీస్ అసిస్టెంట్ చెన్నకేశవులు మంగళవారం తెలిపారు. 19-45 సంవత్సరాల వయసు గలవారు అర్హులు. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 6 వరకు బండమీదిపల్లిలోని స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్టీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 9 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందని చెప్పారు.
వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన తన భర్త తిరిగి ఇంటికి రాలేదని అతడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. SI కృష్ణంరాజు కథనం.. ధరూర్ మం. ర్యాలంపాడుకు చెందిన లోకేశ్వర్ రెడ్డి(32)కి ఆరేళ్ల క్రితం ఉట్కూర్‌కు చెందిన జ్యోతితో పెళ్లి కాగా ఇక్కడే ఉంటున్నారు. ఈనెల 23న చికిత్స కోసం MBNRలోని ఆసుపత్రికి వెళ్లిన అతడి తిరిగి ఇంటికి రాలేదు. అతడి ఆచూకీ లేకపోవడంతో జ్యోతి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
వయ్యారిభామ కలుపు మొక్క చాలా ప్రమాదకరమైనదని, పంటలు, కాల్వల్లో, బహిర్గత ప్రాంతాల్లో ఎక్కవగా విస్తరించి అధిక నష్టాన్ని కలుగజేస్తుందని మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్రవేత్త డా. రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ మొక్క నివారణకు చర్యలు, తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు. ఈ మొక్క ఎక్కువ విషప్రభావం కల్గి మనుషులు, పశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వర్షాకాలంలో పూతరాక ముందే దీనిని తొలగించాలన్నారు.
వానాకాలం పంటల సీజన్ మరో నెల రోజుల్లో ముగియనున్నా రైతుభరోసా కింద ఇంతవరకు ఆర్థిక సాయం అందలేదు. మరోవైపు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. దీంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పంటల సాగుకు పెట్టుబడి కరువై రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్లో అసలు రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందుతుందా లేదా అని ఎదురుచూస్తున్నారు.
➤పోలీస్ పర్మిషన్ తప్పనిసరి
➤కరెంట్ కనెక్షన్ కోసం DD అవసరం
➤మండపాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు
➤కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలి
➤DJలకు అనుమతి లేదు
➤రాత్రి 10 దాటిన తర్వాత మైక్‌లు ఆఫ్ చేయాలి
➤సీసీ కెమెరాలు బిగించుకోవడం మేలు
ఫైర్ సేఫ్టీ కూడా తప్పక పాటించాలని, శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని పాలమూరు పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT
✒జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
✒NGKL: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
✒జూరాలకు భారీగా వరద.. 25 గేట్లు ఓపెన్
✒MBNR: LRS దరఖాస్తులు.. రూ.3కోట్ల ఆదాయం
✒ఉమ్మడి జిల్లాలో GHMల భర్తీ.. విద్యాశాఖ ఫోకస్
✒సర్పంచ్ ఎన్నికలు.. వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం
✒గద్వాల: బ్లాస్టింగ్‌తో వలస కార్మికుడి మృతి
✒మదర్ థెరీసా జయంతి ఉత్సవాలు
Sorry, no posts matched your criteria.