Mahbubnagar

News August 26, 2024

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

image

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. సోమవారం సాయంత్రం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,32,281 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు అవుట్ ఫ్లో 66,051 క్యూసెక్కులుగా నమోదయింది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 884 అడుగులు నమోదయింది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మరోసారి ఏ క్షణమైనా తెరిచే అవకాశం ఉంది. 215.80 టీఎంసీలకు గాను 210.03 టీఎంసీలు నమోదయింది.

News August 26, 2024

HYDలో హైడ్రా సరే.. మక్తల్ చెరువులు సంగతేంటి: MP

image

హైదరాబాద్‌లో హైడ్రా సరే కాని మక్తల్ నియోజకవర్గంలో కబ్జాలు చేసిన చెరువులు సంగతేంటని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సోమవారం మక్తల్ మండల కేంద్రంలో ఆమె మాట్లాడారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం హైడ్రా పేరుతో డ్రామా చేస్తున్నారని విమర్శించారు. హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని అన్నారు. రుణమాఫీ లెక్కలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

News August 26, 2024

MBNR: గణేశుడిని నిలబెట్టేవారికి ముఖ్య గమనిక

image

➤పోలీస్ పర్మిషన్ తప్పనిసరి
➤కరెంట్ కనెక్షన్ కోసం DD అవసరం
➤మండపాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు
➤కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలి
➤DJలకు అనుమతి లేదు
➤రాత్రి 10 దాటిన తర్వాత మైక్‌లు ఆఫ్ చేయాలి
➤సీసీ కెమెరాలు బిగించుకోవడం మేలు
ఫైర్ సేఫ్టీ కూడా తప్పక పాటించాలని, శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని పాలమూరు పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT

News August 26, 2024

MBNR: గ్రామాల్లో మొదలైన ‘పంచాయతీ’ సందడి !

image

పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. పంచాయతీల్లో సర్పంచ్ గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది.MBNR-441, NGKL-463, GDWL-255, NRPT-290, WNPT-255 జిల్లాలో గ్రామపంచాయతీలు ఉన్నాయి.

News August 26, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలివే..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాత వివరాలిలా.. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాదులో 13.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూలు జిల్లా సిరిసనగండ్లలో 11.8 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో 11.3 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా ఘన్పూర్ లో 2.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా చిన్న తాండ్రపాడులో 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News August 26, 2024

జూరాలకు భారీగా వరద.. 25 గేట్లు ఓపెన్

image

జూరాలకు భారీ వరద మరోసారి పోటెత్తడంతో డ్యాం 25 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 1.10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 25 గేట్ల ద్వారా 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నెల వ్యవధిలోనే ప్రాజెక్టుకు వరద రెండోసారి పోటెత్తిందని అధికారులు తెలిపారు. దీంతో కృష్ణా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News August 26, 2024

MBNR: LRS దరఖాస్తులు.. రూ. 3కోట్ల ఆదాయం

image

డీటీసీపీ లేఅవుట్ లేకుండా వెంచర్లు చేసి విక్రయించిన పాటను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు 2020 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీల్లో 1.94లక్షల దరఖాస్తులు చేసుకున్నారు. వీటి ద్వారా ప్రభుత్వానికి మూడు కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆయా మున్సిపాలిటీ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దరఖాస్తుల పరిశీలన నత్త నడిపిన సాగుతుంది. పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

News August 26, 2024

పార్కింగ్‌లో వాహనాలకు రక్షణ ఏదీ..?

image

అలంపూర్ పుణ్యక్షేత్రంలోని పార్కింగ్‌లోని వాహనాలకు రక్షణ కరువైంది. పార్కింగ్ వేలం ద్వారా సంబంధిత ఆలయానికి సుమారు అరకోటి ఆదాయం వస్తున్నా.. వాహనాలకు నిలువు నీడ లేకుండా పోయింది. అదేవిధంగా గుత్తేదారుల వాహనాల దగ్గర టికెట్లు తీసుకొని వాహనాలను లోపలికి పంపిస్తున్నారే తప్పా, క్రమ పద్ధతిలో వాహనాలు పెట్టించడం లేదు. దీంతో ఒక వాహనానికి మరొక వాహనం తగులుతూ వాహనదారు తరచూ ఘర్షణకు దిగుతున్నారు.

News August 26, 2024

MBNR: వార్డుల వారీగా ఓటరు జాబితా !

image

పంచాయతీల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అధికారులు గ్రామపంచాయతీ వార్డుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేశారు. ఇప్పటికే ఓటరు జాబితా ముసాయిదాను గ్రామపంచాయతీలలో అందుబాటులో ఉంచారు. పార్లమెంట్ ఎన్నికల ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని, పంచాయతీ ఓటరు జాబితాను తయారుచేశారు. అయితే తుది జాబితాను సెప్టెంబర్ 21న ప్రచురించనున్నారు.

News August 26, 2024

NRPT: ప్రేమ పేరుతో యువతికి మోసం

image

యువతిని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భం దాల్చాక మొహం చాటేసిన యువకుడిపై కేసు నమోదు అయింది. SI కృష్ణంరాజు వివరాలు.. ఊట్కూరు మం. కొల్లూరుకు చెందిన యువకుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్లుగా ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి దగ్గరయ్యాడు. ఆమె గర్భవతి కాగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మొహం చాటేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.