India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
PUకి పెద్దదిక్కు లేకుండా పోయారు. వైస్ ఛాన్స్లర్ లక్ష్మీకాంత్ రథోడ్ మే నెలలో పదవి కాలం పూర్తికాగా… ఆయన స్థానంలో ప్రభుత్వం ఇన్చార్జి వీసీగా ఐఏఎస్ అధికారిని నియమించింది. అయితే ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా యూనివర్సిటీకి రాలేదు. దీంతో కొన్ని అకాడమీ పరమైన అంశాల్లో నిర్ణయం, అనుమతి కోసం అధికారులే నేరుగా హైదరాబాద్ వెళ్లి సదరు IAS అధికారిని అనుమతి తీసుకోవాల్సి వస్తోంది.
ఉమ్మడి జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 52 జీహెచ్ఎం పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. SAలకు పదోన్నతులు కల్పించి భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే సీనియార్టీ జాబితాలతో పాటు ఖాళీల వివరాలను అధికారులు ప్రకటించారు. వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించి, రెండు రోజుల్లో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి చూపని యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.
జూరాల జలాశయంలోకి వరద కొనసాగుతోంది. జలాశయంలోకి 31 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా.. జలవిద్యుదుత్పత్తి ద్వారా 39 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నట్లు జూరాల అధికారులు తెలిపారు. గేట్ల ద్వారా నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. జలాశయంలో నీటినిల్వ 8.6 టీఎంసీల మేర ఉంది. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయంలోకి 28 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా దిగువకు 27 వేలు వదులుతున్నారు.
ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌పై క్లిక్ చేయగా బ్యాంకు ఖాతా నుంచి రూ.95 వేలు డ్రా అయిన ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది. CI ఆదిరెడ్డి తెలిపిన వివరాలు.. స్థానిక భవానీనగర్‌కు చెందిన కౌసల్య వాట్సాప్‌కు వచ్చిన లింక్‌ను పిల్లలు క్లిక్ చేశారు. ఆ వెంటనే ఖాతాలో ఉన్న రూ.95,800ను సైబర్ కేటుగాళ్లు కాజేశారు. బాధితురాలు వెంటనే సైబర్ క్రైమ్ నంబర్ 1930కి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI తెలిపారు.
క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలే పార్టీకి బలం, బలగం అని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు -2024 కార్యశాల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదులో అంకితభావంతో పనిచేసి ఒక్క కార్యకర్త 100 మందికి పార్టీ సభ్యత్వం ఇప్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలతో మమేకమై స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు.
సభ్యత్వ నమోదులో కార్యకర్తలు క్రియాశీల పాత్ర పోషిస్తే రాబోవు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని MBNR ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో ఇవాళ నిర్వహించిన కార్యశాల సమావేశంలో అరుణ పాల్గొని మాట్లాడారు. ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు అంకితభావంతో నిర్వహించాలని ఎక్కువ మంది యువకులకు పార్టీ సభ్యత్వం ఇప్పించాలని ఆమె పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
✒అలంపూర్: కరెంట్ స్తంభం విరిగి పడి బాలుడి మృతి
✒కొత్తూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లీకూతురు మృతి
✒కల్వకుర్తి బస్టాండ్‌లో గుండెపోటుతో వ్యక్తి మృతి
✒MBNR: గుండెపోటుతో బీజేపీ కార్యకర్త మృతి
✒రేపు వర్షాలు.. పాలమూరు జిల్లాకు ఎల్లో అలర్ట్
✒గండీడ్: దారుణం.. కన్న తల్లిని కొట్టి చంపిన కొడుకు
✒ఒక్కేషనల్ కోర్సులు.. దరఖాస్తుల ఆహ్వానం
✒అటహాసంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ టోర్నీ
ఉమ్మడి జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో జిల్లాల్లోని ఆస్పత్రుల్లో రోగుల తాకిడి పెరిగింది. మూడు జిల్లా పరిధిలో 75 చికున్‌గున్యా కేసు నమోదు కాగా.. వనపర్తి, MBNR జిల్లాలు చికున్‌గున్యా హైరిస్క్‌లో ఉన్న జిల్లాల జాబితాలో ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది సేవలు విస్తృతంగా పెంచాలని, పరీక్షలు చేయాలని సూచించింది. వ్యాధుల కట్టడిలో వైద్యశాఖ విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి.
కొత్తూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం తల్లీకూతురు మృతిచెందాడు. హైవేపై వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కొత్తూరు వైపు నుంచి వస్తున్న లారీ టెంపోను ఢీకొట్టింది, ఆ టెంపో వెళ్లి ఆటోను ఢీ కొట్టింది. ఆటో, బైక్ ను ఢీకొట్టడంతో వాహనంపై వెళ్తున్న తల్లీకూతురు ఎగిరి రోడ్డుపై పడి మృతి చెందినట్లు తెలిసింది. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.