India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MBNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ సంఘం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తీర్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కళింగ కృష్ణ, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రిన్సిపల్స్ రమేష్ లింగం, మద్దిలేటి, మాధవరావు, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాత వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా కల్లూరులో 7.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా మొగల్మట్కాలో 6.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతలలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా ఘన్పూర్ లో 1.0 మిల్లీమీటర్లు, గద్వాలలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి బస్టాండ్‌లో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు దిగుతూ కుప్పకూలాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. వంగూరు మండలం చౌదరిపల్లికి చెందిన పట్టాభి వ్యక్తిగత పనుల నిమిత్తం స్వగ్రామం నుంచి కుటుంబ సభ్యులతో కల్వకుర్తికి వచ్చాడు. బస్టాండ్‌లో బస్సు దిగుతూ గుండెపోటుతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టాభి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
జిల్లాలో ప్రవహిస్తున్న కృష్ణా నది ప్రస్తుతం నిండుకుండలా ఉంది. కృష్ణమ్మ నిశ్శబ్దం ఒడిలో ప్రకృతి జలపాతాల అందాలు, పరివాహ ప్రాంత అటవీ అందాలు కృష్ణా నదిలో లాంచీ ప్రయాణం పర్యాటకుల మదిలో మర్చిపోలేని ఓ మధుర జ్ఞాపకం. ఈ ప్రయాణానికి పర్యాటకులు ఎంతగానో ఆసక్తి చూపుతారు. పర్యాటక శాఖకు ఆదాయం కూడా జమవుతుంది. సోమశిల నుంచి శ్రీశైలం వరకు పర్యాటక శాఖ లాంచీ ప్రయాణం కొనసాగించాలని పర్యాటకులు కోరుతున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు సూచించారు.
జాతీయ విద్యావిధానంలో ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 67 పాఠశాలలుండగా.. వీటిలో మొదటి విడతగా 36 పాఠశాలల్లో వృత్తి విద్య అమలు చేస్తున్నారు. ఒక్కో పాఠశాలలో రెండేసి కోర్సులు బోధిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో 10 పాఠశాలలకు సామగ్రి కొనుగోలు కోసం విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.28 వేలు, రూ.48 వేల చొప్పున రూ.4.80 లక్షలు కేటాయించారు.
ఉమ్మడి జిల్లాకు చెందిన 9 మంది RTC ఉద్యోగులకు 2024 ప్రగతి చక్రం పురస్కారాలను మంత్రి పొన్నం ప్రభాకర్, RTC ఎండీ సజ్జనార్ ప్రదానం చేశారు. ఉత్తమ కండక్టర్లు, డ్రైవర్లు, సూపర్వైజర్లుగా ఎండీ సుల్తాన్(WNPT), MD షర్ఫుద్దీన్ (WNPT), మహాలింగం(NGKL), రవికుమార్(NGKL), శ్రీనివాసులు (కల్వకుర్తి), ఫర్జానా బేగం(కల్వకుర్తి), నిర్మల (NGKL), వెంకటస్వామి(కొల్లాపూర్), నాగరాజు ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
రాష్ట్ర స్థాయి అండర్-16 యూత్ బాలబాలికల బాస్కెట్ బాల్ టోర్నీకి మహబూబ్ నగర్ ఆతిథ్యమిస్తోంది. మహబూబ్ నగర్‌లోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఆది,సోమవారాల్లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఉదయం, రాత్రి వేళల్లో టోర్నీలోని మ్యాచ్‌లు నిర్వహించేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని 17 జిల్లాల నుంచి 500 మంది బాలబాలికలు, అఫీషియల్స్ పాల్గొంటున్నారు. భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు.
జూరాల జలాశయంలోకి వస్తున్న వరద తగ్గింది. జలాశయంలోకి 67వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. దిగువకు 10 గేట్లు ఎత్తి 41 వేలు, జలవిద్యుదుత్పత్తి ద్వారా 37 వేలు మొత్తం 78 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. జలాశయంలో నీటి నిల్వ 9.132 టీఎంసీల మేర ఉంది. మరో నాలుగు వేల క్యూసెక్కులు జూరాల కాల్వలకు, ఎత్తిపోతల పథకాలకు వినియోగించుకున్నట్లు జూరాల అధికారులు తెలిపారు.
కోర్టు ద్వారా బైల్ పొంది సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించలేని నిరుపేద ఖైదీలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం రాష్ట్ర, జిల్లాస్థాయి సాధికార కమిటీలను ఏర్పాటు చేసిందని MBNR జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. ఇవాళ మొదటిసారి జిల్లా సాధికార కమిటీ నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లా సాధికార కమిటీ నోడల్ అధికారిగా ప్రొహిబిషన్ అధికారిని నియమించాలని తీర్మానించినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.