Mahbubnagar

News August 24, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

✔మల్లికార్జున ఖర్గేను కలిసిన మంత్రి జూపల్లి ✔NGKL:వనపట్ల సమీపంలో కారు బోల్తా ✔జూరాల ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత ✔అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాలకు చివరి తేదీ 31 ✔బాల పురస్కార్ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం ✔MROకు రెవెన్యూ రికవరీ యాక్ట్ పై అవగాహన ✔WNPT:కలెక్టరేట్ ముందు రైస్ మిల్లర్ల ఆందోళన ✔భూ సమస్యల పరిష్కారానికి నూతన ఆర్ఓఆర్ చట్టం: చిన్నారెడ్డి

News August 24, 2024

మల్లికార్జున ఖర్గేను కలిసిన మంత్రి జూపల్లి

image

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాష్ట్ర టూరిజం, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. వారిరువురి మధ్య రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాల గురించి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చర్చ జరిగినట్లు జూపల్లి మీడియోతో పేర్కొన్నారు.

News August 24, 2024

తెలంగాణ పర్యాటక అభివృద్ధికి చేయూతనివ్వండి: జూపల్లి  

image

మంత్రి జూపల్లి కృష్ణారావు శ‌నివారం ఢిల్లీలోని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షకావత్‌ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ‌లో టూరిజం అభివృద్ధికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయని, పర్యాటక అభివృద్ధికి చేయూతనివ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. మంత్రి వెంట తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ ముఖ్య‌కాద‌ర్శి వాణిప్ర‌సాద్, తదితరులు ఉన్నారు.

News August 24, 2024

లింగాల: బాల పురస్కార్ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డు కోసం ప్రతిభ గల బాల, బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ICDS) అధికారులు తెలిపారు. ధైర్య సాహసాలు ,క్రీడలు, పర్యావరణం కళలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సేవా రంగాలలో ప్రావీణ్యం కలిగిన 5 నుంచి 18 ఏళ్ల వయసు గల బాల, బాలికలు ఆగస్టు 31 తేదీ వరకు http.s://awrds.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.

News August 24, 2024

విదేశీ పర్యటన ముగించుకొని నేడు హైదరాబాద్‌కు అచ్చంపేట ఎమ్మెల్యే

image

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఈ రోజు విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ రానున్నారు. గత పది రోజుల క్రితం చైనా వెళ్లిన ఎమ్మెల్యే పలు అంశాలపై అధ్యయనం చేశారు. విదేశీ పర్యటన ముగించుకొని వస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణకు స్వాగతం పలికేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News August 24, 2024

జూరాలకు భారీగా పెరిగిన వరద

image

జూరాలకు వరద భారీగా పెరుగుతోంది. జలాశయంలోకి 90వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. జలాశయం నుంచి జల విద్యుదుత్పత్తి 35వేల క్యూసెక్కులు, 16గేట్లు ఎత్తి 66వేల క్యూసెక్కులు మొత్తం 1.01లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయంలోకి 43వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. నారాయణ్ పూర్ జలాశయంలోకి 30వేల క్యూసెక్కుల వరద చేరుతోందని అధికారులు తెలిపారు.

News August 24, 2024

మహమ్మదాబాద్: బాలికపై అత్యాచారం.. వ్యక్తిపై కేసు

image

బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు అయిన ఘటన మహమ్మదాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. గత నెల మైనర్ బాలికపై మండల కేంద్రంలో నివాసం ఉంటున్న రమేశ్ రెడ్డి అనే వ్యక్తి అత్యాచారం చేశారని బాలిక తల్లిదండ్రులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీంతో అత్యాచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

News August 24, 2024

MBNR: అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాలకు చివరి తేదీ 31

image

డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2024-25 సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు విశ్వవిద్యాలయ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సుధారాణి పేర్కొన్నారు. ఆయా కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 31 చివరి తేదీ అని, అదనపు సమాచారం కోసం సమీప అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని, www.braouonline.in,/ www.braou.ac.in వెబ్ సైట్ లో చూడాలన్నారు.

News August 24, 2024

MBNR: 18 ఏళ్లు నిండే వారికి అలర్ట్.!!

image

పాలమూరులో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. 2025 JAN 1 వరకు 18 ఏళ్లు నిండే వారు ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చు. OCT 10 వరకు BLOలు ఇంటింటి సర్వే, జాబితాలో ఫొటోల మార్పు, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపడతారు. ఓటరుగా పేర్లు నమోదు చేసుకున్న వారి వివరాలతో OCT 29న ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. NOV 28 వరకు అభ్యంతరాలు స్వీకరించి, DEC 24 నాటికి పరిష్కరించి JAN 6న తుది జాబితా ప్రకటిస్తారు.

News August 24, 2024

NRPT: ‘సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చర్యలు’

image

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే పోస్టులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్స్‌అప్ తదితర సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని అన్నారు. సోషల్ మీడియాపై ఐటి సెల్ విభాగం 24 గంటల నిఘా పెడుతుందని అన్నారు.