Mahbubnagar

News August 23, 2024

NGKL: మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై స్పందించిన మహిళా కమిషన్

image

సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో రుణమాఫీపై వాస్తవ పరిస్థితి ఏంటనే విషయమై తెలుసుకునేందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఆవుల సరిత, విజయరెడ్డి వెళ్లగా వారిపై కొందరు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శారద ఈరోజు HYD నుంచి నాగర్‌కర్నూల్ ఎస్పీకి లేఖ రాశారు. జరిగిన విషయాన్ని తనకు తెలియజేయాలని లేఖ ద్వారా కోరారు.

News August 23, 2024

శాస్త్రవేత్తలు భారతదేశ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలి : జూపల్లి

image

భవిష్యత్తులో ఇస్రో శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోగాలు చేసి దేశ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాక్షించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవంగా సందర్భంగా పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్ -3మిషన్ విజయం సందర్భంగా భారత ప్రభుత్వం ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించిన సంగతీ తెలిసిందే

News August 23, 2024

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నేటి వర్షపాతం వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా… అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులలో 70.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా పెబ్బేరులో 59.0 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా బీచుపల్లి 40.1 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా గుండుమల్లో 38.3 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా పెద్దముద్దునూరు 35.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News August 23, 2024

జూరాల: 165.375 మిలియన్ యూనిట్లకు చేరిన విద్యుదుత్పత్తి

image

ప్రస్తుత వర్షాకాలం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి 165.375 మిలియన్ యూనిట్లకు చేరింది. ప్రాజెక్టు నుంచి వరదనీటి విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో ఎగువన ఐదు యూనిట్ల ద్వారా 4.305, దిగువన ఆరు యూనిట్ల ద్వారా 4.583 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. గురువారం నాటికి ఎగువన 94.563, దిగువన 70.812 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని చేపట్టామని అధికారులు తెలిపారు.

News August 23, 2024

అచ్చంపేట: పెళ్లైన ఆరు నెలలకే యువకుడి మృతి

image

ద్విచక్ర వాహనంను తప్పించబోయి కారు ఒక వ్యక్తిని ఢీకొన్న ఘటన అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి శివారులో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. బాలరాజు(32) అనే వ్యక్తి చెన్నారం వైపుకు వెళ్తుండగా, సందీప్ అనే వ్యక్తి తన కుటుంబంతో కారులో వస్తున్నాడు. ఈ క్రమంలో కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి బాలరాజును ఢీకొట్టగా అతను అక్కడే చనిపోయాడని తెలిపారు. అతడికి పెళ్లై ఆరు నెలలే అయిందన్నారు.

News August 23, 2024

NRPT: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: పట్నాయక్

image

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్లో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో ప్రజావాణి సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారిగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో విద్య శాఖకు సంబంధించి అత్యధికంగా ఫిర్యాదులు అందుతున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు.

News August 22, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

✒ఆదాని కుంభకోణంపై విచారణ చేపట్టాలి: జూపల్లి
✒కలకత్తాలో ఘటన.. పలుచోట్ల వైద్య విద్యార్థుల నిరసన
✒జడ్చర్ల: రోడ్డు ప్రమాదం.. తల్లీకూతురి మృతి
✒ఒకే దఫాలో రైతులకు రుణమాఫీ చేయాలి:BRS
✒NGKL: జీతాలు ఇవ్వడం లేదంటూ కార్మికుల ఆందోళన
✒GDWL:రోడ్డు ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు
✒రేపు ఖోఖో సంఘం ఉమ్మడి జిల్లా ఎన్నికలు
✒KGBVలో బదిలీలు.. దరఖాస్తు చేసుకోండి:DEOలు
✒ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుల ఆహ్వానం

News August 22, 2024

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

image

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. శుక్రవారం ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ ఫ్లో 1,24,153 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. అవుట్ ఫ్లో 42,898 ఉండగా పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 883. 50 ఉంది. ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగిస్తున్నారు.

News August 22, 2024

ఆదాని కుంభకోణంపై విచారణ చేపట్టాలి: జూపల్లి

image

ఆదాని కుంభకోణంపై విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ టిపిసిసి ఆధ్వర్యంలో HYD ఈడి ఆఫీస్ ముందు చేపట్టిన నిరసనలో జూపల్లి పాల్గొని మాట్లాడారు. ప్రజల సొమ్మును ప్రధాని మోదీ ఆదానికి దోచిపెడుతున్నారన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి లోతుగా దర్యాప్తు చేసి వాస్తవాలను బయటకు తీయాలని మంత్రి డిమాండ్ చేశారు.

News August 22, 2024

గన్ పార్క్ వద్ద ధర్నాలో పాల్గొన్న ఎంపీ మల్లు రవి

image

అదానీకి వ్యతిరేకంగా గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ధర్నాలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి పాల్గొని మాట్లాడారు. ఈ దేశ ప్రధానమంత్రి పెద్ద పారిశ్రామికవేత్తలకు దేశాన్ని తాకట్టు పెడుతున్నాడని విమర్శించారు. అదానీపై ఉన్న ప్రేమ ఈ దేశ పేద ప్రజలపై లేదని తెలిపాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.