Mahbubnagar

News February 21, 2025

వనపర్తి: పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు!

image

ఇంట్లో గొడవల కారణంగా ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని మృతి చెందిన ఘటన వీపనగండ్ల మండలంలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. బొల్లారానికి చెందిన శ్రీనివాస్ గౌడ్(50) భార్య పిల్లలతో కలిసి MBNRలో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం బంధువు ఒకరు చనిపోవటంతో శ్రీనివాస్ గ్రామానికి వచ్చారు. కాగా.. కొన్నిరోజులుగా కుటుంబ కలహాలతో విరక్తి చెంది తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి నిప్పంటిచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News February 21, 2025

MBNR: గొంతు కోసుకున్నాడు..!

image

మహమ్మదాబాద్ మండలంలో ఓ యువకుడు కుటుంబ సమస్యల కారణంగా గొంతు కోసుకున్న ఘటన గురువారం జరిగింది. స్థానికుల వివరాలిలా.. చౌదర్‌పల్లికి చెందిన ఖాసీం ఇంట్లో గొడవల కారణంగా మనస్తాపానికి గురై బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

News February 21, 2025

నాగర్‌కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

image

తాడూరు మండల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తెలకపల్లి మండలం అనంతసాగర్‌కి చెందిన శ్రీను(42), శేఖర్(30)లు బైక్‌పై హైదరాబాద్ వెళ్తున్నారు. వీరి బైక్‌ని తాడురు సమీపంలోని గుంతకోడూరులో ఓ కారు ఢీకొనగా.. ఇద్దరు కిందపడ్డారు. వీరి పైనుంచి ఆ కారు వెళ్లటంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతి చెందారు.

News February 21, 2025

MBNR: రేపు రేవంత్ రెడ్డి రాక.. షెడ్యూల్ ఇలా!

image

సీఎం రేవంత్ రెడ్డి నేడు (శుక్రవారం) కొడంగల్ నియోజకవర్గం, నారాయణపేటలో పర్యటించనున్నారు.12 గంటలకు దుద్యాల మండలం పోలేపల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి, భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం రాకతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News February 21, 2025

MBNR: నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన.. రూ.5 లక్షల సబ్సిడీ

image

సీఎం రేవంత్ నేడు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా సర్కారు తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. వాటన్నింటికీ రేపు శంకుస్థాపనలు మొదలు కానున్నాయి. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుంది. బేస్‌మెంట్ కట్టగానే రూ.లక్ష లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు.

News February 21, 2025

MBNR: ఆహార భద్రతపై దృష్టి: రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్

image

జిల్లాలో ఆహార భద్రత పట్ల పకడ్బందీగా దృష్టి సారిస్తున్నారని రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల తనిఖీ అనంతరం కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరుని పరిశీలించారు. ఆహార భద్రత పకడ్బందీగా కొనసాగుతుందని అధికారులను అభినందించారు.

News February 20, 2025

MBNR: సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎంపీ

image

హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎస్టీ మోర్చ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సంత్ సేవాలాల్ భోగ్ బండార్ హోమం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల ఆరాధ్య దైవం, హిందూ ధర్మ పరిరక్షకుడు సంత్ సేవాలాల్ మహరాజ్ అని అన్నారు. సేవాలాల్ జయంతిని ఫిబ్రవరి 15న దేశ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని పార్లమెంట్లో తెలిపినట్లు చెప్పారు.

News February 20, 2025

రాష్ట్రంలోనే చదువుల నిలయం మన పాలమూరు: MLA యెన్నం

image

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు మహబూబ్‌నగర్ చదువుల కేంద్రం కావాలి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని పంచవటి విద్యాలయ 21వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చదువుకోవడానికి మన మహబూబ్‌నగర్‌కే రావాలన్నారు. పంచవటి విద్యాలయ యాజమాన్యం విద్యా నిధికి రూ.5 లక్షలు అందజేశారు.

News February 20, 2025

మన్యంకొండ హుండీ ఆదాయం రూ.32,39,301

image

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి హుండీలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కింపు కొనసాగింది. ఆలయం నిర్వహణ అధికారి శ్రీనివాసరాజు పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి హుండీ ఆదాయం రూ.32,39,301 వచ్చినట్లు ఆలయ ధర్మకర్త అళహరి మధుసూదన్ కుమార్ తెలిపారు.  

News February 20, 2025

భూత్పూర్: అనుమానాస్పద వివాహిత మృతి

image

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన తిమ్మాజీపేట మండలంలో జరిగింది. ఎస్ఐ ప్రకారం.. భూత్పూర్ మండలం భట్టుపల్లితండాకు చెందిన సంధ్య(23)కు గొరిటతండా వాసి జగన్‌‌తో పెళ్లైంది. అదనపు కట్నం కోసం భార్యను తరచూ వేధించేవాడు. కాగా, మంగళవారం రాత్రి సంధ్య చనిపోయిందంటూ తండావాసులు తల్లికి సమాచారం అందించారు. అదనపు కట్నం కోసమే తన కూతురిని హత్య చేశారంటూ తల్లి అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.