India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏడాది పాలన పూర్తి చేసుకున్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను పలువురు మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు పూల బొకేతో శుభాకాంక్షలు తెలపడం సంతోషంగా ఉందన్నారు. తప్పులు జరిగినప్పుడు విమర్శించినా స్వీకరిస్తానని, సమస్యలు ఉంటే తన దృష్టికి తెచ్చినప్పుడు తప్పనిసరిగా పరిష్కరిస్తానని పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సుల సంఖ్యలు పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో త్రిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించి బస్సుల సంఖ్యను పెంచుతానని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో అక్కాతమ్ముడు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లికి చెందిన మనోజ్(25) అక్క పద్మ(31)ను ఆమె కుటుంబంతో కుంట్లూర్‌కు బయలుదేరారు. కోహెడ-పెద్దఅంబర్‌పేట ఔటర్‌రింగ్‌లో లారీ అకస్మాత్తుగా నిలపడంతో వేగంగా వస్తున్న వీరి కారు ఢీకొంది. ఈప్రమాదంతో మనోజ్, పద్మ మృతిచెందారు. మృతుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తగా ఏర్పడిన మండలాలు ఇకపై మండల ప్రజా పరిషత్లుగా ఏర్పాటు కానున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో మహమ్మదాబాద్, కౌకుంట్ల, గద్వాల్ జిల్లాలో ఎర్రవల్లి, వనపర్తి జిల్లాలో యేదుల, నారాయణపేట జిల్లాలో గుండుమల్, కొత్తపల్లి మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే వీటికి ప్రత్యేకంగా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు రానున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
భోజన నాణ్యతలో రాజీ పడకూడదని, ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సోమవారం ప్రభుత్వ కళాశాల విద్యార్థుల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, అన్నింటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పలు సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గృహ సంక్షేమ అధికారి మాధవి, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.
రాజకీయ పార్టీ నేతలు, యూనియన్లు, ప్రజా సంఘాల నేతలు పోలీసుల అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. నేటి నుండి ఈనెల 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని చెప్పారు. ధర్నాలు, నిరసన ర్యాలీలు, మత పరమైన ర్యాలీలు పోలీసుల అనుమతులు లేకుండా నిర్వహించరాదని అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయన్నారు.
ప్రభుత్వాలు బడ్జెట్లో విద్యకు అవసరమయ్యే నిధులు కేటాయించాలని ప్రొఫెసర్ హరగోపాల్ సూచించారు. షాద్ నగర్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యతో పేదరికాన్ని నిర్మూలించవచ్చని అన్నారు. ప్రభుత్వాలు విద్యకు నిధుల కేటాయింపులు తగ్గిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య విధ్వంసానికి కారణాలను వెతికి పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు.
శ్రీశైలం పశ్చిమ ద్వారంగా పరిగణించబడి తుంగభద్ర నది తీరాన ఉన్నది. ఇక్కడ పురాతనమైన దేవాలయాలు, బాధమీ చాళుక్య శిల్పా సంపద, సంస్కృతిని సూచిస్తున్నాయి. ఆలయంలో ప్రధాన దేవుళ్లుగా బాల బాలబ్రహ్మేశ్వర , జోగులాంబ అమ్మవారు కొలువైన్నారు, మహాశక్తి పీఠాలలో ఒకటిగా, అష్ట దశ ఆలయ సమూహాల్లో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా, తీర్థ యాత్రల ప్రదేశంగా భక్తులను ఆకట్టుకుంటుంది.
మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని వాడ్యాల గేటు సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువరైతు దుర్మరణం చెందాడు. మండలంలోని దోనూరు గ్రామానికి చెందిన కుమార్ (24) స్పింక్లర్ పైపులు తీసుకొని వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రిజర్వేషన్లపై నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు ఉండాలని అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన మాలల సింహగర్జన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. మాల, మాదిగలు ఐక్యంగా ఉండి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధనకై ఉద్యమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, మాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.