Mahbubnagar

News February 16, 2025

రాజాపూర్‌: రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి

image

రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన రాజాపూర్ మండలంలో ఆదివారం జరిగింది. రైల్వే హెడ్ స్టేషన్ మాస్టర్ వెంకట్రావు వివరాల ప్రకారం.. మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామ శివారులో రైలు ఢీకొని ఓ మహిళ (30) మృతి చెందింది. మృతదేహాన్ని MBNR ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్ఐ అక్బర్ తెలిపారు. మహిళ ఆచూకీ తెలిస్తే 98480 90426 తెలపాలన్నారు.

News February 16, 2025

MBNR: నాలుగేళ్ల బాలికపై అత్యాచారయత్నం.!

image

అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన MBNR పట్టణంలో శనివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిని తన ఇంట్లోకి తీసుకొని అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా.. చిన్నారి తల్లి వెళ్లి చూడగా అసలు విషయం బయటపడింది. స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 15, 2025

MBNR: మినీ మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి రాక

image

ఈనెల 21న సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన ఖరారైంది. పోలేపల్లి ఎల్లమ్మ జాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరావడం ఆనవాయితీగా వస్తోంది.

News February 15, 2025

MBNR: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

ఈ నెల 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిని వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. NGKL జిల్లా పెంట్లవెల్లికి చెందిన షాలు(45) అడ్డాకులలో ఉంటూ రాళ్లు కొడతూ జీవిస్తున్నారు. అడ్డాకుల వైపు నుంచి వచ్చిన పొక్లెయిన్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవీందర్(32) అక్కడికక్కడే మృతిచెందగా.. షాలుకు గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షాలు శుక్రవారం మృతిచెందారు.

News February 15, 2025

జోగులాంబ: పంచాయతీ కార్యదర్శిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ACB

image

ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ACB DSP బాలకృష్ణ కథనం మేరకు DPO శ్యామ్ సుందర్ సూచనతో ఒక వెంచర్ మేనేజర్ తో పంచాయతీ కార్యదర్శి రూ. 2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు తెలిపారు. DPO కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

News February 14, 2025

MBNR: నేటి నుంచి మహానగరోత్సవం 

image

జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నేడు, రేపు ‘మన మహబూబ్ నగర్ మన మహానగరోత్సవం’ వేడుకలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌గా ఏర్పాటైనా సందర్భంగా నగర ప్రముఖులు, ప్రజలందరూ వారి అనుభవాలు మహానగరోత్సవం వేదికగా వ్యక్త పరచనున్నారు. ప్రముఖ నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.

News February 14, 2025

బిజినేపల్లి: అనుమానాస్పదంగా మహిళ మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో అనుమానాస్పదంగా మహిళ మృతి చెందింది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన చెన్నమ్మ(55) బుధవారం రాత్రి భర్త సుల్తాన్ పొలానికి వెళ్లగా ఒంటరిగా పడుకుంది. ఉదయం భర్త ఇంటికి వచ్చిన సమయంలో ఆమె గాయాలతో ఉంది. వెంటనే నాగర్‌కర్నూల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు బిజినేపల్లి ఎస్ఐ తెలిపారు.

News February 14, 2025

మహబూబ్‌నగర్ RTC బస్సుకు రోడ్డు ప్రమాదం

image

మహబూబ్‌నగర్ డిపోకు చెందిన బస్సుకు షాద్‌నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులోని పోచమ్మ ఆలయ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు యూటర్న్ తీసుకుంటుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 14, 2025

సీఎం రేవంత్ రెడ్డి LOVE STORY మీకు తెలుసా..?

image

పడవలో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డారు. మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఇంటర్ చదివే రోజుల్లో నాగార్జునసాగర్‌ వెళ్లిన రేవంత్‌కు పడవలోనే గీతారెడ్డిని చూసి మనసు పారేసుకున్నారు. ఇంకేముంది.. పరిచయం కాస్త స్నేహంగా.. స్నేహం కాస్త ప్రేమగా మారింది. రేవంత్ రెడ్డి గీతారెడ్డి తరఫున వారి ఇంట్లో మాట్లాడి ప్రేమను గెలిపించుకున్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో 1992లో ఒక్కటయ్యారు.

News February 14, 2025

కౌకుంట్ల: బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు

image

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్‌‌కి కౌకుంట్ల మండలంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మండలంలోని ముచ్చింతల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రామకృష్ణారెడ్డి, పుట్టపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కురుమూర్తి, శేఖర్ తదితరులు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.