India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శివుడు, పార్వతీదేవితో కొలువు దీరిన ప్రాంతంగా ఉమామహేశ్వరం ఆలయం ప్రఖ్యాతి చెందింది. ఈ ఆలయం చుట్టూ ఎత్తైన చెట్లతో కూడిన కొండపై.. ఉత్తర ద్వారం జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం కలిగి ఉంది. రెండో శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని మౌర్య చంద్రగుప్త పాలనలో ఉంది. దీన్నే పూర్ మ్యాన్స్ ఊటీ అని పిలుస్తారు. క్రీ.శ.14వ శతాబ్దిలో మాధవనాయుడు కొండపైకి వెళ్ళేందుకు మెట్లను నిర్మించినట్లు ప్రచారం.
పంటలు సాగు చేసిన రైతులకు రైతుభరోసా అందిస్తామని, రేపు జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. దేవరకద్రలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గత BRS ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రైతులకు రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేసిందన్నారు.
ఆర్టీసీ బస్సులో నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో డ్రైవర్, కండక్టర్ సహకారంతో ప్రయాణికులే పురుడు పోసిన ఘటన శుక్రవారం గద్వాల ఆర్టీసీ డిపో పరిధిలో చోటు చేసుకుంది. రాయచూరు జిల్లా బాయిదొడ్డికి చెందిన పావని నిండు గర్భిణీ కావడంతో ఆరోగ్య పరీక్షల నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి ఆర్టీసీ బస్సులో ఎక్కింది. మార్గమధ్యలో నందిన్నె వద్ద ఆమెకు పురిటినొప్పులు రావడంతో బస్సులోనే ప్రసవం చేశారు.
కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి తాండ్ర పాఠశాలలో చదువుకున్నారు. ఇటీవల కల్వకుర్తిలో పర్యటించిన సందర్భంగా తాండ్ర పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. హామీ మేరకు నిధులు మంజూరు కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అసలే గ్రామీణ ప్రాంతాలు.. అంతంతే వైద్య సేవలు. దీనినే పెట్టుబడిగా పెట్టుకుని పాలమూరులో కొందరు నకిలీ RMPలు చెలరేగిపోతున్నారు. చదివింది చారెడు.. చికిత్సలు బారెడు అనేలా.. వచ్చీరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు సిఫార్సు చేస్తూ భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై DMHO కృష్ణ వివరణ కోరగా.. అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధి చిలుకూరులో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గద్వాల జిల్లా ధరూర్ మండలానికి చెందిన దంపతులు బతుకుదెరువు నిమిత్తం HYD వలస వచ్చి చిలుకూరులో ఉంటున్నారు. వారికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. గురువారం స్థానికంగా ఉండే ఓ యువకుడు చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి PSలో అప్పగించారు. కేసు నమోదైంది.
అసలే గ్రామీణ ప్రాంతాలు.. అంతంతే వైద్య సేవలు. దీనినే పెట్టుబడిగా పెట్టుకుని పాలమూరులో కొందరు నకిలీ RMPలు చెలరేగిపోతున్నారు. చదివింది చారెడు.. చికిత్సలు బారెడు అనేలా.. వచ్చీరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు సిఫార్సు చేస్తూ భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై DMHO కృష్ణ వివరణ కోరగా.. అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలంలోని ఉడిమిళ్ల గ్రామానికి చెందిన విద్యార్థి భరత్ గురువారం జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల 48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. భరత్ ప్రస్తుతం అచ్చంపేట రెసిడెన్సియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని పలువురు ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు కృష్ణ మనోహర్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా కృష్ణ మనోహర్ గౌడ్ చేసిన సేవలను గుర్తించి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నియమించినట్లు నరేందర్ గౌడ్ వెల్లడించారు.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నందు గురువారం ఇన్ఫ్లోనిలిచిపోయింది. దీనితో వచ్చే జూన్ వరకు వర్షాలు లేకపోవడంతో తాగునీటికి కష్టాలు తప్పేటట్లు లేదు. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 9.657 టీఎంసీలు, ప్రస్తుత నిల్వ 4.091 టీఎంసీలు, ఆవిరి ద్వారా 29 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 550, కుడి కాలువకు 500, మొత్తం అవుట్ స్లో 342 క్యూసెక్కులు వెళ్తున్నట్లు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ వెంకటేశ్వరరావు వివరించారు.
Sorry, no posts matched your criteria.