Mahbubnagar

News August 19, 2024

MBNR: ముళ్లపంది దాడిలో చిరుత మృతి.!

image

మద్దూరు మండలం జాదవరావుపల్లి శివారులో ముళ్లపంది దాడి చేయగా చిరుత చనిపోయింది. గ్రామస్థులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్ నాయక్‌కు సమాచారం ఇచ్చారు. వారు చిరుత మృతదేహాన్ని పరిశీలించగా, ముళ్లపంది ముళ్లు గుచ్చుకున్నట్లు గుర్తించారు. దీంతో ముళ్లపంది దాడిలో చిరుత చనిపోయినట్లు నిర్ధారించారు. MBNRవెటర్నరీ సర్జన్ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. రిపోర్టు ఆధారంగా త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

News August 19, 2024

GDWL: నంబర్‌ప్లేట్ లేని వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులు

image

నంబరు ప్లేట్లు లేకుండా, నంబర్ ప్లేట్స్‌కు అడ్డుగా స్టిక్కర్స్ వేసి వాహనదారులు తమ వాహనాలు నడిపితే సీజ్‌ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని గట్టు ఎస్ఐ మల్లేశ్ అన్నారు. గట్టు మండల శివారులో వాహనాల తనిఖీ చేపట్టారు. ఎస్ఐ మాట్లాడుతూ.. వాహనదారులు తమ వాహనాలకు ముందు, వెనక తప్పనిసరిగా నంబర్ ప్లేట్లు అమర్చుకోవాలన్నారు.

News August 18, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✔హజ్ యాత్ర కోసం ఆన్‌లైన్ లో దరఖాస్తుల ఆహ్వానం
✔MBNR: దైవ దర్శనానికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
✔ఉమ్మడి జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలు
✔NGKLలో ప్రమాదం.. ఒకరి మృతి
✔కొందరికి రుణమాఫీ జరగని మాట వాస్తవమే:NGKL ఎంపీ
✔త్వరలో చేనేత ఎన్నికలు..ఓటరు జాబితాపై ఫోకస్
✔ప్రభుత్వానికి రైతుల మీద చిత్తశుద్ధి లేదు: మాజీ మంత్రి నాగం
✔రైతన్నలకు కొత్త రుణాలు..బ్యాంకర్లు ప్రత్యేక ఫోకస్

News August 18, 2024

MBNR: రైతన్నలకు కొత్త రుణాలు.. బ్యాంకర్లు ప్రత్యేక ఫోకస్!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 3.38 లక్షల మంది రైతులకు రూ.2,781.56 కోట్ల రుణమాఫీ అయిందని అధికారులు వెల్లడించారు. కొత్త రుణాలకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 4,21,939 ఖాతాలకు రూ.8,928 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. యాసంగిలో 2,81,294 ఖాతాలకు రూ.5,950.56 కోట్లు ఇచ్చేందుకు బ్యాంకర్లు దృష్టి పెట్టారు. ఈ ఏడాది మొత్తం 7.03 లక్షల ఖాతాదారులకు రూ.14,878 కోట్ల పంట రుణాలు అందించనున్నారు.

News August 18, 2024

MBNR: ‘GOOD NEWS’.. కార్గోలో రాఖీ సేవలు.!

image

ఆర్టీసీ కార్గో ద్వారా రాఖీలు పంపుకునే అవకాశం రాఖీ పౌర్ణమి సందర్భంగా సదూర ప్రాంతాలలో ఉన్న తమ సోదరులకు మహిళలు ఆర్టీసీ కార్గో ద్వారా రాఖీలను పంపేందుకు టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిందని ఉమ్మడి జిల్లా లాజిస్టిక్స్ ఏటీఎం ఇసాక్ తెలిపారు. రీజియన్ పరిధిలోని వివిధ మండలాలు, గ్రామాలకు చెందిన మహిళలు రాఖీలతో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు, ఇతర సామగ్రిని పంపేందుకు కార్గో సేవలు వినియోగించుకోవాలని కోరారు.

News August 18, 2024

KTRకు నాలెడ్జ్ లేదు.. హరీశ్‌రావువి చిల్లర మాటలు: కోదండరెడ్డి

image

రైతులకు రుణమాఫీ చేయడం KTR, హరీశ్‌‌రావుకు ఇష్టం లేదా? అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ప్రశ్నించారు. HYD గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడారు. KTRకు రాజకీయ నాలెడ్జ్ లేక ప్రజలను రెచ్చగొడుతున్నారని, హరీశ్‌రావు సీనియరై కూడా చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతు రుణాలపై బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకున్నామని, రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు.

News August 18, 2024

మహబూబ్‌నగర్: PU పరిధిలో 19న జరిగే పరీక్షలు వాయిదా

image

PU పరిధిలో ఈనెల 19న జరిగే పీజీ, బీఈడీ, ఫార్మసీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు PU పరీక్షల నియంత్రణ అధికారి డా. రాజకుమార్ శనివారం ఓ ప్రకటనలు తెలిపారు. సోమవారం రాఖీ పండుగ సందర్భంగా జరిగే పరీక్షలను వాయిదా వేశామన్నారు. 19న జరిగే పరీక్షలను 23వ తేదీన జరుగుతాయని రీ షెడ్యూల్‌ను శనివారం యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. మిగతా పరీక్షలు యథావిధిగా జరుగుతాయన్నారు.

News August 18, 2024

కొందరికి రుణమాఫీ జరగని మాట వాస్తవమే: ఎంపీ 

image

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొందరికి రుణమాఫీ జరగని మాట వాస్తవమేనని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. శనివారం రాత్రి ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీల విషయమై కలెక్టర్ కార్యాలయాలలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేవుడు మీద ఒట్టేసి చెబుతున్నా అర్హులకే రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ తరహాలో రియల్ ఎస్టేట్ భూములకు రుణమాఫీ చేయం అని వెల్లడించారు.

News August 18, 2024

MBNR: అందుబాటులో ఓపెన్ పీజీ 2వ సంవత్సర హాల్ టికెట్స్ 

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గల డా.బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పీజీ ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈనెల 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని విశ్వవిద్యాలయం సమన్వయకర్త డాక్టర్ జి. సత్యనారాయణ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లు https://www.braouonline.in/PGHallTickets/Halltic వెబ్‌సైట్లో ఉంచామని తెలిపారు.

News August 18, 2024

మూసాపేట్: చికెన్ తీసుకురాలేదని వైన్స్‌లో గొడవ

image

ఆర్డర్ చేసిన చికెన్ తీసుకురాలేదని కస్టమర్లకు, యజమానికి మధ్య గొడవ జరిగిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట్ మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. సంకలమద్ది గ్రామానికి చెందిన నలుగురు యువకులు మండల కేంద్రంలోని ఓ వైన్స్‌లో చికెన్ ఆర్డర్ చేశారు. డ్రింక్ పూర్తయ్యే వరకు చికెన్ రాకపోవడంతో సీసా పగలగొట్టి గొడవకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగారని తెలిపారు.