India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ ఏడాది నేటితో పూర్తవుతోంది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు ఈ సంవత్సరం ఎన్నో తీపి జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాలను మిగిల్చింది. చేసిన తప్పుల నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని ఉంటారు. వాటన్నింటిని సరిదిద్దుకునే ప్రయత్నమూ చేసుంటారు. మరీ ఈ ఏడాది మీరేం సాధించారు? ఏం కోల్పోయారు? ఏం నేర్చుకున్నారు? మీ మధుర జ్ఞాపకాన్ని కామెంట్ చేయండి.
2024కి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు పాలమూరు జిల్లా వ్యాప్తంగా చిన్నా పెద్ద సిద్ధమయ్యారు. యువతులు న్యూ ఇయర్ సందర్భంగా ఇంటి ముందు రంగుల ముగ్గులు వేసి 2025కి స్వాగతం పలికేందుకు రెడీగా ఉండగా.. యువకులు పార్టీలు, దావత్‌లు అంటూ ఫుల్ జోష్ మీద ఉన్నారు. కొందరు మాత్రం ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి న్యూ ఇయర్‌కు మీప్లాన్స్ ఏంటో కామెంట్ చేయండి.
మహబూబ్ నగర్‌కు నేడు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ వస్తున్నట్లు గద్వాల కలెక్టర్ సంతోష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ పై అధ్యయనం చేస్తారని తెలిపారు. ఇందుకు గాను జిల్లాలోని ఎస్సీ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కుల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు MBNR కలెక్టరేట్లో హాజరై మాజీ న్యాయమూర్తికి విజ్ఞాపనలు సమర్పించి, చర్చించుకోవాలని తెలిపారు.
✔కల్వకుర్తి:రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి✔న్యూ ఇయర్..ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు:SPలు✔గద్వాల:13వ రోజు న్యాయవాదుల దీక్ష✔ఎస్ఎస్ఏలకు క్రమబద్ధీకరించాలి:బిఎస్పీ✔జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు గద్వాల యువకుడు✔NGKL:పాముకాటుతో యువ రైతు మృతి✔NRPT:PSను తనిఖీ చేసిన డిఎస్పీ✔19వ రోజు కొనసాగిన ఉద్యోగుల సమ్మె✔సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:SIలు ✔జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన కోస్గి విద్యార్థి
కల్వకుర్తిలోని కొత్త కాటన్ మిల్ వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్‌పై కల్వకుర్తి వైపు వస్తున్న ఇద్దరు యువకులు అదుపుతప్పి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పట్టణానికి చెందిన శ్రీనాథ్ (17), భాను (16)గా గుర్తించారు. మృతులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కర్నే తండా లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని వెంటనే మంజూరు చేయాలని గతంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా రూ.1 కోటి 63 లక్షల మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో RT నంబర్ 345 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండంలోని బింగిదొడ్డి గ్రామానికి చెందిన వేణు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. తనకు సహకారం అందించిన కోచ్, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన యువకుడిని గ్రామస్థులు అభినందించారు.
ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నవాబుపేట మండలం కాకర్లపహాడ్‌లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అంకిత(18) మహబూబ్‌నగర్‌లో డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఆలయంలో పని చేస్తుంటారు. కాగా, ఆదివారం వారు గుడికి వెళ్లి తిరిగి వచ్చే వరకు అంకిత ఇంట్లో ఉరేసుకుంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
కొడంగల్ నియోజవర్గంలోని దౌల్తాబాద్ పరిధిలో వేట వలలో భారీ కొండ చిలువ చిక్కింది. మండల కేంద్రంలోని దౌల్తాబాద్, రాళ్లపల్లి మధ్యలో ఉన్న అడవి సమీపంలో కొందరు వేటకు వేసిన వలలో కొండ చిలువ చిక్కింది. ఇవాళ ఉదయం వెళ్లిన వేటగాళ్లు వలలో చిక్కిన కొండ చిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కొండ చిలువను పట్టుకొని ఫారెస్టు ఆఫీసర్లకు అప్పగించారు.
ఉమ్మడి పాలమూరులో గతంలో ఎప్పుడు లేని విధంగా కోడి గుడ్డు ధర కొండెక్కింది. నూతన సంవత్సర వేడుకల్లో కేకు తయారీలో వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. దీంతో మరింత పెరిగే అవకాశం ఉంది. రిటైల్ ధర అక్టోబర్- రూ.6.30, నవంబర్- రూ.6.50, డిసెంబర్- రూ.7.10 పైన ఉంది. కార్తీక మాసం ముగియడంతో మాంసం ధర తగ్గి గుడ్ల ధర గణనీయంగా పెరిగింది. ధర పెరగడంతో గుడ్లు నోటికి అందడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.