India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈనెల 14 ,15వ తేదీలలో మహబూబ్ నగర్ పట్టణంలోని శిల్పారామంలో మహబూబ్ నగర్ మహానగరోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. మంగళవారం శిల్పారామం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఉదయం 10:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఇప్పటివరకు మహబూబ్ నగర్-1,29,451, నాగర్ కర్నూల్-1,06,525, నారాయణపేట-77,092, గద్వాల్-84,114, వనపర్తి-80,418 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరూ నెలకు 200 యూనిట్లలోపు(జీరో బిల్) విద్యుత్ వినియోగించుకుంటున్నారు. ఈ పథకం ద్వారా ఆయా జిల్లాల్లో విద్యుత్ వినియోగం తగ్గిందని అధికారులు తెలిపారు.

బాదేపల్లి మార్కెట్లో ఇవాళ 296 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మడానికి తీసుకువచ్చారు. వేరుశనగ 3,770 క్వింటాళ్లు అమ్మడానికి రాగా గరిష్ఠ ధర క్వింటాలుకు రూ. 6,809 లభించగా కనిష్ఠ ధర రూ. 4,265 లభించింది. కందులు 113 క్వింటాళ్లు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.7,000, కనిష్ఠ ధర రూ. 4,002 లభించింది. మొక్కజొన్న 142 క్వింటాళ్లు అమ్మకానికి రాగా గరిష్ఠ ధర రూ. 2,361 కనిష్ఠ ధర రూ. 2,075 లభించింది.

ZPTC, MPTC గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాస్టర్ ట్రైనర్లుగా నియమించిన వారు ఎన్నికల సిబ్బందికి ఎన్నికల నిర్వహణ నిబంధనలపై అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం ZP సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లు మండల స్థాయి ట్రైనర్లకు ZPTC, MPTC గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కోడేరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. కోడేరుకు చెందిన వెంకటశేషయ్య బైక్ కొనివ్వాలని తన కొడుకుని అడిగారు. దీనికి కొడుకు అంగీకరించకపోవటంతో.. ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.

ఈ నెల 12, 13వ తేదీల్లో మన్యంకొండ లక్ష్మీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని MBNR, NRPT డిపోల నుంచి తీసుకున్న 20 బస్సుల ద్వారా దాదాపు 150 అదనపు ట్రిప్పులను నడపనున్నట్లు వారు పేర్కొన్నారు. కొండ మీదికి 20 మినీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు మాఘశుద్ధ త్రయోదశి సోమవారం రాత్రి స్వామి వారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. అలమేలు, మంగ పద్మావతి అమ్మవార్లతో వెంకటేశ్వర స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చాడు. పట్టు వస్త్రాలు, వజ్రకవచం అలంకరించి గోవింద నామ స్మరణ మధ్య సూర్యప్రభ వాహనంపై మెట్ల దారిలో ఊరేగించారు. ధర్మకర్తలు అళహరి మధుసూదనాచారి పాల్గొన్నారు.

ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. సోమవారం స్త్రీ నిధి బ్యాంక్ రుణం ద్వారా అందించిన సంచార చేపల విక్రయ వాహనాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. వాహనాన్ని ఎక్కడ వినియోగిస్తారు, వ్యాపారం ఎలా చేస్తారు అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. సోమవారం స్త్రీ నిధి బ్యాంక్ రుణం ద్వారా అందించిన సంచార చేపల విక్రయ వాహనాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. వాహనాన్ని ఎక్కడ వినియోగిస్తారు, వ్యాపారం ఎలా చేస్తారు అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

నీటిగుంతలో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన పాన్‌గల్ మండలం మాధవరావుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన నందిని, వినోద్‌ల కుమారుడు రుద్రరాజు(2) ఆదివారం పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా.. పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. చిన్నారిని వెంటనే బయటికి తీసి ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. చిన్నారి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Sorry, no posts matched your criteria.