Mahbubnagar

News August 16, 2024

ఆత్మకూర్: యాక్సిడెంట్‌.. 2 నెలల పసికందు మృతి

image

ORRపై <<138659>>యాక్సిడెంట్‌<<>>లో చనిపోయిన ముగ్గురిలో 2 నెలల బాలుడు ఉన్నారు. ఆత్మకూర్‌కు చెందిన 12 మంది తూఫాన్‌ వాహనంలో యాదాద్రికి నుంచి వస్తున్నారు. కరీంనగర్‌ నుంచి శంషాబాద్‌ వెళ్తున్న కారు వేగంగా వచ్చి వెనుక నుంచి తూఫాన్‌ను బలంగా ఢీకొట్టడంతో ఎగిరిపడింది. తూఫాన్‌లో ఉన్న డ్రైవర్ తాజ్‌, వరాలు స్పాట్‌లో చనిపోయారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 2 నెలల బాలుడు మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదైంది.

News August 16, 2024

మద్దూర్: అనుమానాస్పదంగా చిరుత మృతి

image

అనుమానస్పద స్థితిలో చిరుత మృతి చెందిన ఘటన మద్దూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జాదరావుపల్లి తాటిగట్టు గుట్టపై గురువారం చోటు చేసుకుంది. గుట్ట సమీపంలోని చెరువులో నీరు తాగడానికి వచ్చిన సమయంలో ఏదైనా జంతువు దాడి చేసి ఉండవచ్చు అని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఫారెస్ట్ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.

News August 16, 2024

షాద్‌నగర్: డీఐ, నలుగురు కానిస్టేబుళ్లపై FIR నమోదు

image

షాద్‌నగర్‌లో సునీత అనే మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో పోలీసులపై తొలి కేసు నమోదైంది. సస్పెన్షన్‌‌లో ఉన్న షాద్‌నగర్ డీఐ రాంరెడ్డితోపాటు నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ఉద్దేశపూర్వకంగా హింస, మారణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. బాధితురాలు సునీత ఈనెల 11వ తేదీన ఫిర్యాదు చేయగా ఈమేరకు కేసు నమోదైంది.

News August 16, 2024

MBNR: మూడో విడత రుణమాపీ UPDATE

image

మూడో విడత రుణమాఫీ(రూ.1.5 నుంచి 2 లక్షలు)ని సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. దీంతో MBNR జిల్లాలో 11,458 మంది రైతులకు రూ.138.75 కోట్లు, నాగర్‌కర్నూల్‌లో 21,352 మంది రైతులకు 261.36 కోట్లు, గద్వాలలో 9550 మంది రైతులకు 121.91 కోట్లు, వనపర్తిలో 10,047 మందికి రూ.126.63 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. నారాయణపేట జిల్లాలో 3 విడతల్లో మొత్తం 58,754 మంది రైతులకు రూ.503.17కోట్లు మాపీ కానుంది.

News August 16, 2024

WNP: 9ఏళ్లుగా ఆ గ్రామంలో మద్యం నిషేధం

image

పానగల్ మండలం గోప్లాపూర్ గ్రామంలో 2016 జూలై 11 నుంచి యువకులు, విద్యావంతులు గ్రామ పెద్దల సమక్షంలో నాటి నుంచి నేటి వరకు మధ్య నిషేధం అమలు చేస్తున్నారు. మద్యం విక్రయించిన లేదా కొనుగోలు చేసిన పదివేల రూపాయల జరిమానా తీర్మానించారు. మాజీ సర్పంచ్ లక్ష్మీ మాట్లాడుతూ.. యువకుల ఉజ్వల భవిష్యత్తు కోసం గ్రామంలో తీసుకున్న నిర్ణయం ఎన్నో గ్రామాలకు ఆదర్శవంతంగా మారిందని అన్నారు. గ్రామంలో అందరూ ఆనందంగా ఉన్నారన్నారు.

News August 16, 2024

నాగర్ కర్నూల్ జిల్లా ప్రత్యేక చరిత్ర !

image

NGKLకు నాగనా, కందనా(రాజులు) అనే పేరుతో పూర్వం పిలిచేవారు. పూర్వం1870 సం.లో నిజాం ప్రభుత్వం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకుంది. ఈ ప్రాంతంలో రైతులు బండ్లకు వాడే కందెన(గ్రీజు)ను అమ్మడంతో కందనూల్, అనంతరం చిన్న కర్నూల్, ప్రస్తుతం నాగర్ కర్నూల్ అనే పేరు వచ్చిందని టాక్. ఈ ప్రాంతాన్ని పూర్వం చాళుక్యులు, కందూరు చోడులూ కాకతీయులు, నిజాం నవాబ్లు పాలించారు. రాష్ట్రంలో 11 అక్టోబర్ 2016న ఏర్పడిన కొత్త జిల్లా.

News August 16, 2024

NRPT: వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం !

image

 ఊట్కూరు మండలంలో వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వివరాలు.. ఈనెల 8 భర్త బయటకు వెళ్లగా మధ్యాహ్నం ఆదే గ్రామానికి చెందిన యువకుడు ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. విషయం బయట చెప్తే ఇద్దరిని చంపేస్తానని బెదిరించాడు. ఆమె మనోవేదనతో అనారోగ్యానికి గురికావడంతో భర్త ఆర తీయడంతో విషయం చెప్పింది. ఘటనపై ఫిర్యాదు వచ్చినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ సురేందర్‌ తెలిపారు.

News August 15, 2024

ఉమ్మడి జిల్లా” నేటి ముఖ్యాంశాలు”

image

@ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
@కోస్గీ: ఇంజనీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు: ప్రిన్సిపాల్.
@MBNR: డిసెంబర్ 9 నుండి రాష్ట్రంలో అసలైన స్వేచ్ఛ: మంత్రి జూపల్లి.
@NRPT: జల సిరుల తెలంగాణగా మార్చడమే లక్ష్యం: గుర్నాథ్ రెడ్డి.
@GDL:రాష్ట్ర సర్వతో అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ప్రీతం.
@WNP: అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందినప్పుడే నిజమైన స్వాతంత్రం: మాజీ మంత్రి

News August 15, 2024

ఆత్మకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులంతా వనపర్తి వాసులే

image

ORRపై జరిగిన ఘోర <<13863174>>రోడ్డు ప్రమాదం<<>>లో ముగ్గురు మృతిచెందారు. మృతులంతా వనపర్తి జిల్లా వాసులే. ఆత్మకూరుకు చెందిన రాజేశ్ కుటుంబంతో కలిసి తుపాన్ వాహనంలో యాదగిరిగుట్ట దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో తుపాన్‌లో ఉన్నఓ బాలుడు, రాజేశ్, డ్రైవర్ తాజ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో 10 మందిని ఆసుపత్రికి తరలించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. 

News August 15, 2024

కోస్గి: ఇంజినీరింగ్ కళాశాలలోస్పాట్ అడ్మిషన్స్

image

కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో నూతనంగా ప్రారంభమైన ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో CSE, CSD, CSM గ్రూపుల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్స్ తీసుకోనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు గురువారం తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 16 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 28న అడ్మిషన్స్ నిర్వహించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.