India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జడ్చర్లలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఓ విద్యార్థినికి షూ వేశారు. జడ్చర్ల నియోజకవర్గంలో విద్యార్థులకు బూట్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో నేడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినికి ఆయన స్వయంగా బూట్లు తొడిగి అందరిని ఆశ్చర్యపరిచారు. ఎమ్మెల్యే నిరాడంబరతకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
మహబూబ్ నగర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరతమాత చిత్రపటానికి పూజలు చేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల ఆశయాలు కొనసాగించాలని అన్నారు. దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పలువురుBJP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం కూచూర్ గ్రామం ఆర్మీ జవాన్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. గ్రామంలో 3,248 మంది జనాభా ఉండగా 78 మంది ఆర్మీలో ఉన్నారు. మరో 9 మంది సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్లో పనిచేస్తుండగా 10 మంది పోలీస్ ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన వీరప్ప కుమారుడు రవి 1993లో ఆర్మీలో చేరగా ఆయన స్ఫూర్తితో దేశ సంరక్షణకు మేమంటే మేము అంటూ యువత పోటీ పడుతున్నారు.
పాలమూరులో లోకాయపల్లి సంస్థానాధీశులు పట్టణ నలువైపులా 4 ప్రవేశ ద్వారాలను నిర్మించారు. 3 కమాన్లు కాలగర్భంలో కలిసిపోగా తూర్పు కమాన్ మాత్రం మిగిలింది. స్వాతంత్రోద్యమానికి తూర్పుకమాన్ కు వీడదీయలేని సంబంధం ఉంది. 1947 ఆగస్టు 15న ఎక్కడా త్రివర్ణపతాకాలు ఎగరేయవద్దని హుకూం జారీ చేశారు. నిజాం పోలీసులు గస్తీ తిరిగినా వారి కన్నుగప్పి ఉద్యమకారుడు విరివింటి లక్షణమూర్తి తూర్పు కమాన్ పై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
రాష్ట్రపతి పతకానికి ఇటిక్యాల ASI వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. కడప జిల్లా బద్వేల్ మండలం పోరుమామిళ్లకు చెందిన వెంకటేశ్వర్లు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి 1989లో పోలీసు ఉద్యోగం సంపాదించారు. మొదట KNRలో విధుల్లో చేరారు. 8 నెలల అనంతరం అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలికి బదిలీపై వచ్చారు. అనంతరం హెడ్‌కానిస్టేబుల్‌గా బిజినేపల్లకి అక్కడి నుంచి మిడ్జిల్ అనంతరం ASIగా ఉన్నతి పొంది 2020లో ఇటిక్యాలకు బదిలీపై వచ్చారు.
రాఖీ పండగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ కార్గోలో రాఖీలు, మిఠాయిలు, బహుమతులు పంపవచ్చని ఏటీఎం లాజిస్టిక్స్ ఇసాక్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సేవలు అందుబాటులో ఉంటాయని, పూర్తి వివరాల కొరకు 91542 98609, 91542 98610 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. దూర ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాలకు చెందిన బాలుడు <<13853898>>రఫీ హత్యలో<<>> విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలుడి సమీప బంధువైన మౌలాలి బాలుడి తల్లి సమీరాతో అక్రమ సంబంధం కొనసాగించాడు. ఇటీవల సమీరా మరొకరితో చనువుగా ఉంటుందని ఆగ్రహించి, మౌలాలి ఈనెల 13న ఆమె కుమారుడిని అపహరించి ముళ్ల పొదల్లో దారుణంగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగా <<13849590>>నజీర్ కుమారుడు<<>> రఫీ ఈనెల 13న కనిపించకుండా పోయాడు. ఈ విషయమై తండ్రి ఇటిక్యాల పీఎస్ లో కంప్లైంట్ చేశాడు. అయితే బుధవారం సాయంత్రం బాలుడు గ్రామ శివారులో పంట పొలాల మధ్య ఉన్న ముళ్లపొదల్లో శవమై కనిపించాడు. అటుగా వెళ్లిన రైతులు గ్రహించి పోలీసులకు, గ్రామస్థులకు సమాచారం అందించారు. దీంతో ఘటనస్థలికి డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రవిబాబు, ఎస్సై వెంకటేశ్ చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
విదేశీ పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి పూల బొకే, శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. అమెరికా, కొరియాల విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో సీఎంను కలిశారు. విదేశీ పర్యటన ద్వారా పలు కంపెనీలు రాష్ట్రానికి తెచ్చారని, తద్వారా తెలంగాణ ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. సంస్థానాధీశులు నిర్మించిన కోటలు, ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు, ప్రాజెక్టులు, నల్లమల అటవీ సంపదకు ఈ ప్రాంతం నెలవు కావడంతో 2 సర్క్యూట్లుగా విభజించి డెవలప్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. NGKL, WNP జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలను ‘నల్లమల టూరిజం హబ్’గా, NRPT, MBNR, GDL ప్రాంతాలను కలిపి ‘ఏకో టూరిజం హబ్’గా అభివృద్ధి చేయనుంది.
Sorry, no posts matched your criteria.