Medak

News June 29, 2024

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

image

జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల పెండింగ్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. బడి మానేసిన పుల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

News June 29, 2024

సిద్దిపేట: ‘సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించండి’

image

సీజనల్ వ్యాధుల వల్ల ప్రబలే అంటూ వ్యాధులపైన క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని DMHO డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. వర్గల్ UPHCని ఆకస్మిక సందర్శించారు. అనంతరం సిబ్బందితో సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జ్వర పీడితులకు తక్షణమే రక్త నమూనాలు సేకరించి చికిత్స అందించాలని, అవసరం ఉన్న సమయంలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు.

News June 28, 2024

మెదక్ రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే..

image

మెదక్ జిల్లా వడియారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల వివరాలు గుర్తించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాకు చెందిన మేకల వ్యాపారులు చిక్వ రాజు (57), చిక్వ మనీష్ కుమార్(30), కూలీలు ఎండి ఇబ్రహీం(21), ఎండీ షబ్బీర్ ఖాన్(48), ఎండీ జీసన్(21)గా గుర్తించారు. క్షతగాత్రులు రేవా జిల్లాకు రమేష్, మహేష్, శుక్లాల్, మనీలాల్, మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన డ్రైవర్ బుట్టా సింగ్‌గా తేలింది.

News June 28, 2024

విద్యార్థినులకు హృదయ ఆధారిత విద్య అందించాలి: కలెక్టర్ క్రాంతి

image

కస్తూర్బా పాఠశాలలో చదివే విద్యార్థినులకు హృదయ ఆధారిత నైపుణ్య విద్యను అందించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డిలో శుక్రవారం కస్తూర్బా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ బాలికలకు వారం రోజులపాటు వీటిపై అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో డీఇఓ వెంకటేశ్వర్లు, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి సుప్రియ పాల్గొన్నారు.

News June 28, 2024

పటాన్‌చెరు: కుక్కల దాడితో చిన్నారి మృతి

image

పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మహీదర వెంచర్లో కార్యకలాపాలు నిర్వహించడం కోసం విశాల్ (8) అనే చిన్న పిల్లవాడు వెళ్లగా కుక్కలు దాడి చేయడంతో చిన్నారి చనిపోయాడు. బిహార్ రాష్ట్రం నుంచి కూలి పనికి చిన్నారి కుటుంబం పటాన్ చెరువుకు వచ్చింది. మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 28, 2024

సిద్దిపేట: విశిష్ట ప్రతిభావంతులైన చేనేతలకు గుర్తింపు

image

ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని చేనేత రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన చేనేత కార్మికులకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరిట రాష్ట్రస్థాయి పురస్కారాలు ప్రధానం చేస్తామని జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి సంతోష్ ప్రకటించారు. చేనేత సహకార, సహకారేతర రంగంలో పనిచేస్తున్న కార్మికులు వచ్చే నెల 10 వ తేదీలోపు దరఖాస్తులను కలెక్టరేట్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

News June 28, 2024

మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

image

మెదక్ జిల్లా చేగుంట 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడియారం వై జంక్షన్ వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక ఉన్న లారీలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరికి గాయాలైనట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 28, 2024

బీఆర్ఎస్, బీజేపీ కుమ్ముక్కనడం విడ్డూరం: హరీష్ రావు

image

BRS, BJP కుమ్మక్కయ్యాయని ముఖ్యమంత్రి డిల్లీలో ఆరోపించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో బీఆర్ఎస్ మెజారిటీ సాధించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ గెలిచిందని ప్రశ్నించారు.

News June 28, 2024

MDK: కార్మికులకు వరం.. లేబర్ కార్డు

image

గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం మంది వివిధ రంగాలకు చెందిన కూలీలు ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వం కార్మికులకు లేబర్ కార్డును అందించడం జరిగిందని జిల్లా సహాయ కార్మిక అధికారి యాదయ్య అన్నారు. కేవలం రూ.110 చెల్లించి కార్డు పొందవచ్చన్నారు. దరఖాస్తుకు కావాల్సిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతాతో పాటు రెండు ఫోటోలతో దరఖాస్తు అందించాలన్నారు. మెదక్ జిల్లాలో 30 వేలు మంది కార్మికులు ఉన్నట్లు తెలిపారు.

News June 28, 2024

ధరణి సమస్యలు పరిష్కరించండి: రాహుల్‌రాజ్ 

image

జిల్లాలో ధరణి పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను  జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. గురువారం చిలిపిచేడ్ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దారుతో ధరణి దరఖాస్తుల పరిష్కరణ పురోగతిని కలెక్టర్ పరిశీలించి పరిష్కరించేందుకు తగు సూచనలు చేశారు. ప్రత్యేక కార్యాచరణ ద్వారా ధరణి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.