Medak

News June 28, 2024

ధరణి సమస్యలు పరిష్కరించండి: రాహుల్‌రాజ్ 

image

జిల్లాలో ధరణి పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను  జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. గురువారం చిలిపిచేడ్ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దారుతో ధరణి దరఖాస్తుల పరిష్కరణ పురోగతిని కలెక్టర్ పరిశీలించి పరిష్కరించేందుకు తగు సూచనలు చేశారు. ప్రత్యేక కార్యాచరణ ద్వారా ధరణి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

News June 27, 2024

ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: వల్లూరు క్రాంతి

image

ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి అధికారులతో గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని చెప్పారు. ప్రజావాణి దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.

News June 27, 2024

బీజేపీలోకి పటాన్‌చెరు ఎమ్మెల్యే..?

image

BRS‌కు మరో షాక్‌ తగలనుందా..?, పటాన్‌చెరు MLA గూడెం మహిపాల్‌రెడ్డి BJPలో చేరుతారా.. జిల్లాలో అవుననే చర్చ జరుగుతోంది. మహిపాల్‌రెడ్డి ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనతో పార్టీ మారుతారనే టాక్. జహీరాబాద్‌ మాజీ MP, BJP నేత బీబీ పాటిల్‌తో మహిపాల్‌రెడ్డి సమావేశం కావడంతో ఆయన BJP వైపు అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. తన అనుచరులకు చెప్పకుండా ఢిల్లీకి వెళ్లడం సైతం పలు అనుమానాలకు తావిస్తుంది.

News June 27, 2024

లక్ష్మాపూర్‌లో రైతు అనుమానాస్పద మృతి

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని వ్యవసాయ పొలం వద్ద రాగుల అశోక్ అనే రైతు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే అశోక్ తలపై గాయం ఉండడంతో భూ వివాదంలో ప్రత్యర్థులు దాడి చేసి హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న రామాయంపేట పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 27, 2024

సంగారెడ్డి: కుమార్తెను లైంగికంగా వేధిస్తున్న తండ్రి హత్య

image

కుమార్తెను లైంగికంగా వేధిస్తున్న తండ్రిని భార్య హత్య చేసిన ఘటన సంగారెడ్డిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. అర్ధరాత్రి మద్యం మత్తులో తండ్రి కుమార్తెను లైంగికంగా వేధిస్తుండడంతో భార్య గొడ్డలితో నరికి చంపింది. అనంతరం తల్లీకుమార్తె పోలీస్ స్టేషన్ ముందు లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 27, 2024

సిద్దిపేట: నేడు దరఖాస్తులకు చివరి తేదీ

image

సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో బీఎస్సీ అటవీ శాస్త్రానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 27 చివరి తేదీ అని కళాశాల పరిశోధన కేంద్రం డీన్ తెలిపారు. ర్యాంకుల ఆధారంగా 50, పేమెంట్ ఆధారంగా 10, ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 5మందికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. www.fcrihyd.in వెబ్సైటును సందర్శించాలన్నారు. మరిన్ని వివరాలకు 9666460939 నంబరుకు సంప్రదించాలన్నారు.

News June 27, 2024

ఆరు నెలల్లో అన్నీ తారుమారవుతాయి.. పరేషాన్‌ కావద్దు: KCR 

image

‘ఆరు నెలల్లో అన్నీ తారుమారవుతాయి.. పరేషాన్‌ కావద్దు’ అని మాజీ CM KCR పార్టీ నాయకులతో అన్నారు. ఎవరికీ ఎప్పుడూ ఏదీ తక్కువ చేయలేదని, అయినా కొందరు పార్టీ మారడం బాధాకరమన్నారు. అధికార దాహంతో పార్టీ వీడుతున్న నాయకులపై సుప్రీంకోర్టుకు వెళ్దామని పేర్కొన్నారు. బుధవారం పార్టీ MLAలు బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్‌, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి కేసీఆర్‌ను కలిశారు.

News June 27, 2024

సిద్దిపేట: 79 మంది కానిస్టేబుళ్లు బదిలీ

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో 78 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ సీపీ అనూరాధ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 27 పోలీస్ స్టేషన్ల పరిధిలో చాల కాలంగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. ఒకే స్టేషన్‌లో దాదాపు ఐదేళ్ల పాటు విధులు నిర్వహించిన వారు బదిలీల ఈ జాబితాలో ఉన్నారు.

News June 27, 2024

మెదక్: ఐటీఐఆర్‌ను కేంద్రం మళ్లీ తీసుకురావాలి: జగ్గారెడ్డి

image

కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్‌‌ను మళ్లీ తీసుకురావాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యేTGPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బుధవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. 2014లో అధికారంలోకి వచ్చిన BJP సర్కార్ ITIRను రద్దు చేశారని తెలిపారు. దీన్ని రద్దు చేయకపోతే ఈ పదేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు వినతి పత్రం సమర్పిస్తానని ఆయన అన్నారు.

News June 26, 2024

జహీరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీ.. వ్యక్తి మృతి

image

జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో వద్ద బైకు మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు ఢీ కొన్న యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. బైక్‌పై ప్రయాణిస్తున్న చిరాగ్ పల్లి గ్రామానికి చెందిన అజ్మత్ షా (24) మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్ పోలీసులు తెలిపారు.