Medak

News December 15, 2024

మెదక్: ఈనెల 25న ఉపరాష్ట్రపతి పర్యటన

image

కౌడిపల్లి మండలం కృషి విజ్ఞాన కేంద్రాన్ని శనివారం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఉపరాష్ట్రపతి జగధీప్ ధన్కడ్ ఈనెల 25న కౌడిపల్లి మండలం తునికి శివారులోని గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రానికి రానున్నారని తెలిపారు. విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు చేస్తున్న ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.

News December 14, 2024

మెదక్: సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్

image

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని సర్కారుపై మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. 14 రోజులు గడిచినా జీతాలు ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు అంటూ రేవంత్‌రెడ్డి గప్పాలు కొట్టారన్నారు. డిసెంబర్‌లో 14వ తేదీ వచ్చినా 39,568 మంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు జీతాలు రాక ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉందన్నారు.

News December 14, 2024

సంగారెడ్డి : నేటి లోక్అదాలత్ జిల్లా వ్యాప్తంగా 7బెంచీలు

image

జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా 7 బెంచీలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేశ్ తెలిపారు. సంగారెడ్డిలో మూడు బెంచీలు, జోగిపేటలో ఒకటి, నారాయణఖేడ్ ఒకటి, జహీరాబాద్ ఒకటి, మొత్తం ఏడు బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. పెండింగ్ కేసులను తొందరగా పరిష్కరించేందుకు, కేసు పెండింగ్లో ఉన్నవారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 14, 2024

మనోహరాబాద్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. రామాయపల్లి గ్రామానికి చెందిన కటికల రేణుక (40) సమీపంలోని ఇండూస్ మెడికేర్ కంపెనీలో కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈరోజు ఉదయం కంపెనీకి వెళ్తుండగా గ్రామ చౌరస్తా వద్ద బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే రేణుక మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతదేహాన్ని తూప్రాన్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

News December 14, 2024

మెదక్: నేడు మంత్రి కొండా సురేఖ పర్యటన

image

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో శనివారం రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటించనున్నారు. మండల పరిధిలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్‌ను మంత్రి సందర్శిస్తారని అధికారులు తెలిపారు. అర్బన్ పార్క్‌లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని పేర్కొన్నారు.

News December 13, 2024

మెదక్: శిథిలావస్థలోని ఇళ్ల వివరాలను సేకరించాలి: కలెక్టర్

image

చిన్నశంకరంపేట మండలం మాందాపూర్ గ్రామంలో కొన్నసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్ వివరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన పురాతన ఇళ్లలో నివాసముంటున్న వారు కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు వస్తే వారి వివరాలను సైతం యాప్లో పొందుపర్చాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే అత్యంత పారదర్శకంగా కొనసాగుతుందని ఆయన అన్నారు.

News December 13, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి పంజా

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా విపరీతమైన చలి పెరగడంతో జనం ఇంట్లోంచి బయటకు రావటానికి జంకుతున్నారు. వాహనదారులు, పాదచారులు చలికి ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మెదక్ జిల్లా దామరంచలో 11.9 డిగ్రీలు నమోదు కాగా.. కనిష్ఠంగా సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 10.1, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 12.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News December 13, 2024

మెదక్: ట్రాక్టర్ నడుస్తుండగానే ఊడిపోయాయి

image

రోడ్డుపై ట్రాక్టర్ నడుస్తుండగానే యంత్ర పరికరాలు విడిపోయి పడిపోయాయి. ప్రమాదం నుంచి డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ చౌరస్తాలో గురువారం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్ ముందు చక్రాలు, ఇంజన్ భాగం ఊడిపోయింది. డ్రైవర్ అప్రమత్తమై వాహనం నుంచి దూకడంతో ప్రమాదం తప్పింది.

News December 13, 2024

ఓపెన్ స్కూల్ దరఖాస్తులు ఈనెల 16 వరకు పెంపు

image

ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్మీడియట్ చదివేందుకు దరఖాస్తు గడపను ఈనెల 16 వరకు పెంచినట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. మీసేవా, ఆన్‌లైన్ కేంద్రాల్లో దరఖాస్తు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. అ అవకాశాన్ని గడువును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News December 12, 2024

హీర్యా నాయక్ ఉగ్రవాదా.. లేక దోపిడీ దొంగా..?: హరీశ్ రావు

image

దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇంత కంటే దారుణం ఏముంటుందని ప్రశ్నించారు. రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా..? లేక దోపిడీ దొంగనా అని నిలదీశారు.