Medak

News December 12, 2024

మాజీ మంత్రులను అడ్డుకోవడం దుర్మార్గం: హరీశ్ రావు

image

వికారాబాద్ జిల్లా తాండూరులో ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రి పాలైన గిరిజన బాలికలను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ వేదికగా మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామనన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళ ప్రజా ప్రతినిధులకు ఇస్తున్న గౌరవం ఇదేనా..? అని ప్రశ్నించారు.

News December 12, 2024

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటలో జాగ్రత్త

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి చంపేస్తోంది. మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. మెదక్ జిల్లా శివ్వంపేటలో 9.4డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, సంగారెడ్డి జిల్లా నల్లవల్లి 9.7, కంగ్టీ 9.8, కోహిర్‌లో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్‌లో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News December 12, 2024

సంగారెడ్డి: ఉద్యోగుల వివరాలను సేకరించాలి: DEO

image

సంగారెడ్డి జిల్లాలోని విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్షాలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు సేకరించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఆదేశించారు. రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు ఉద్యోగుల వివరాలను సేకరించి జిల్లా కార్యాలయానికి పంపాలని మండల విద్యాధికారులకు సూచించారు. కోరారు. సూచించారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

News December 12, 2024

చిదంబ‌రం తెలంగాణ ప్ర‌క‌ట‌న‌కు కేసీఆరే కార‌ణం: హ‌రీశ్‌రావు

image

నాటి కేంద్ర మంత్రి చిదంబరం నుంచి తెలంగాణ ప్రకటన వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ఈ సత్యాన్ని ఏమార్చాలని కాంగ్రెస్ చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డిపై హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. సంగారెడ్డిలో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ గురించి సీఎం రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేకుంటే నీ రెండు కళ్ళ సిద్ధాంతం గుర్తుకు వస్తుందని హ‌రీశ్‌రావు తెలిపారు.

News December 12, 2024

రాజీమార్గమే రాజామార్గం: ఎస్పీ ఉదయ్

image

రాజీమార్గమే రాజామార్గం అని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీపడే కేసుల్లో రాజీ పడేటట్లు కక్షిదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికాలకు సూచించారు. ఇద్దరు కొట్లాడితే ఒక్కరే గెలుస్తారు. రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారని.. కక్షలతో ఏమీ సాధించలేమని అన్నారు. అదేరోజు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

News December 11, 2024

క్రీడా సమాఖ్య పోటీల్లో రాష్ట్ర జట్టు ప్రతిభ

image

వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో జరుగుతున్న క్రీడా సమాఖ్య పాఠశాల స్థాయి అండర్-14 వాలీబాల్ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు ప్రతిభ చూపుతున్నట్లు కోచ్ అల్లి నరేశ్ తెలిపారు. బాలుర విభాగంలో మొదటి మ్యాచ్ పంజాబ్(3-2)తో, రెండవ మ్యాచ్ ఢిల్లీ(3-0)తో విజయం సాధించినట్లు వివరించారు. విజయం పట్ల అధ్యక్షుడు నాగరాజు, ఎస్జీఎఫ్ సెక్రెటరీ రమేష్, కిషోర్, దేవానంద్, హరిత, పుష్పవేణి హర్షం వ్యక్తం చేశారు.

News December 11, 2024

 మెదక్: వీడియో కాల్ మాట్లాడుతూ మహిళ సూసైడ్ !

image

వీడియో కాల్ మాట్లాడుతూ మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. టేక్మాల్ మం. కొరంపల్లికి చెందిన ప్రభాకర్‌కు పాపన్నపేట మం. గాందారిపల్లి చెందిన లావణ్య(38)తో 20ఏళ్ల క్రితం పెళ్లైంది. కాగా లావణ్య నిన్న ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుంది. అయితే తన చెల్లి చివరిగా ఓ వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని ఆమె అన్న కాశీనాథం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు  కేసు నమోదు చేశారు.

News December 11, 2024

డిసెంబర్ 15వ తేదీన జిల్లాకు విశారదన్ మహారాజ్ రాక

image

సిద్దిపేట జిల్లా కేంద్రంలో డిసెంబర్ 15న జరిగే ధర్మ సమాజ్ పార్టీ (DSP) జిల్లా మహాసభ (ప్లీనరీ)కి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధినేత విశారదన్ మహారాజ్ హాజరవుతారని జిల్లా అధ్యక్షుడు సదన్ మహరాజ్ తెలిపారు. బుధవారం ఆయన సిద్దిపేటలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 93 శాతం మంది బీసీ, ఎస్సీ ఎస్టీ, అగ్ర కుల పేదల తరఫున పోరాడే ఏకైక పార్టీ ధర్మ సమాజ్ అన్నారు.

News December 11, 2024

పారదర్శక పాలన అందించాలి: మంత్రి పొన్నం

image

పారదర్శక పాలన అందించాలని నూతన పాలకవర్గానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బుధవారం నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. పారదర్శక పాలనతో ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు.

News December 11, 2024

మెదక్: వేర్వేరు కారణాలతో ముగ్గురి సూసైడ్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. వివరాలిలా.. హుస్నాబాద్ మండలం పొట్లపల్లికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీధర్ ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకున్నాడు. అదే విధంగా దుబ్బాక పరిధిలోని ధర్మాజీపేట వాడకు చెందిన నర్సింలు(42) అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హత్నూర మండలం నస్తీపూర్‌కి చెందిన కుమార్‌పై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సూసైడ్ చేసుకున్నాడు.