Medak

News March 18, 2024

MDK: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

పదోతరగతి పరీక్షలకు వేళైంది. నేటి నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. నిమిషం నిబంధన ఎత్తివేశారు. మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో 269 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 46,356 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

News March 17, 2024

MDK: కొల్చారంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

కొల్చారం మం. కిష్టాపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మెదక్ వైపు వస్తున్న ఒక ద్విచక్ర వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ వాసి హబీబ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 17, 2024

SRD: భారీ వర్షం.. పిడుగుపడి ఒకరి మృతి

image

కంగ్టి మండలం భీమ్రాలో ఆదివారం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో పిడుగు పడింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన శిరుగొండ (45) మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ‘పొలం పనుల్లో ఉండగా వర్షం పడింది. రేకుల షెడ్డు కింద తలదాచుకోగా ఒక్కసారిగా పిడుగు పడింది’ అని స్థానికులు PSకు సమాచారం ఇచ్చారు. కంగ్టి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 17, 2024

మెదక్‌: ఆటో‌ డ్రైవర్‌ ఆత్మహత్య

image

మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండముల కిరణ్ (23) అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News March 17, 2024

ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి బారులు దీరారు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని మాత దర్శనానికి పోటెత్తారు. అదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అమ్మవారికి తలనీలాలు సమర్పించి, వనదుర్గ భవాని మాతకు ఓడి బియ్యం పోసి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఛైర్మన్ బాల గౌడ్, ఈఓ మోహన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.

News March 17, 2024

SRD: సిలిండర్‌ పేలి తాత, మనవరాలి మృతి

image

గ్యాస్‌ సిలిండర్‌ పేలి తీవ్రంగా గాయపడిన ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 10న రాత్రి స్థానిక మాణిక్‌ ప్రభు వీధిలో ఎరుకల లక్ష్మన్న ఇంట్లో గ్యాస్‌ లీకై మంటలు అలుముకున్నాయి. ఆయన్ను కాపాడే క్రమంలో కోడలు సుగుణ, మనవరాలు కీర్తి(4) గాయపడ్డారు. వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిచంగా చికిత్స పొందుతూ కీర్తి శుక్రవారం, నిన్న లక్ష్మన్న చనిపోయారు. తాత, మనుమరాలు మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.

News March 17, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా..

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రాత్రి భారీ వర్షం కురిసింది. ఈరోజు ఉ. 8:30 గంటల వరకు గడచిన 24 గంటల్లో ఏడబ్ల్యూఎస్ స్టేషన్లలో నమోదైన వర్షపాతం వివరాలు.. చిన్న శంకరంపేట 37.5 మిల్లీమీటర్లు, చేగుంట 34.8, దౌల్తాబాద్ 31.0, తుక్కాపూర్ 26.3, మాసాయిపేట 22.0, ఝరాసంఘం 21.8, నారాయణరావుపేట 20.0, కొల్చారం 19.0, కౌడిపల్లి 15.5, సత్వార్ 14.8, శనిగరం 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News March 17, 2024

సంగారెడ్డి: ప్రజావాణి రద్దు

image

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లా కలెక్టరేటో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు
సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి ఉండదని, ఎన్నికల తర్వాత యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని చెప్పారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని మెదక్, సిద్దిపేట అధికారులు కోరారు.

News March 17, 2024

మెదక్ ఎంపీ స్థానంపై వీడని పీటముడి

image

మెదక్‌ ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిత్వం ఎంపిక విషయంలో పీటముడి వీడటం లేదు. టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆశిస్తున్నారు. మల్కాజ్‌గిరి టికెట్‌పై సైతం ఆశలు పెట్టుకున్నారు. అక్కడ ఇవ్వకుంటే మెదక్‌ టికెట్‌ అయినా ఖరారు చేయాలని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. పటాన్‌చెరుకు చెందిన నీలం మధు, మైనంపల్లి టికెట్ పోటీలో ఉండగా అధిష్ఠానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందో చూడాలి.

News March 17, 2024

సిద్దిపేట: నోడల్ అధికారులకు శిక్షణ: కలెక్టర్

image

లోక్ సభ ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల నోడల్ అధికారులుగా నియామకమైన వారికి శిక్షణ ఇస్తున్నట్టు కలెక్టర్ ఎన్నికల అధికారి మను చౌదరి తెలిపారు. విలేకరులతో మాట్లాడారు. మెదక్ లోక్ సభ పరిధిలో దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయని, కరీంనగర్ లోక్సభ పరిధిలో హుస్నాబాద్ నియోజకవర్గం భువనగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో జనగామ శాసనసభ పరిధికి సంబంధించి జిల్లాలోని నాలుగు మండలాలు ఉన్నాయన్నారు.