Medak

News December 7, 2024

రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. ఉమ్మడి మెదక్ REPORT

image

రేవంత్ రెడ్డి CMగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్‌‌ జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మెదక్‌ మెడికల్ కళాశాల, ఆందోల్ నర్సింగ్ కళాశాల మంజూరు, జోగుపేట ఆసుపత్రి 150 పడకలకు పెంపు, పటాన్చెరు వరకు రూ.1700 కోట్లతో మెట్రో విస్తరణ, తిమ్మాపూర్‌లో 1000మందికి ఉపాధి లభించే కోకాకోలా కంపెనీ ప్రారంభం, సహా పలు పనులు చేపట్టారు. మీ కామెంట్?

News December 7, 2024

MDK: ఇన్‌ఛార్జ్ మంత్రి ఏడాది పాలన.. మీ కామెంట్?

image

తూర్పు వరంగల్ MLA కొండా సురేఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఏడాది. కాగా, ఆమెకు CM రేవంత్ దేవాదాయ & అటవీ శాఖలు కేటాయించడంతో పాటు MDK ఇన్‌ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఇన్‌ఛార్జ్ మంత్రిగా MDKలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ వేదికగా ఫ్రీ బస్సు పథకం ప్రారంభం, రూ.500 గ్యాస్, రుణమాఫీ, జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మీ కామెంట్?

News December 7, 2024

సంగారెడ్డి: ACBకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

image

లంచం తీసుకుంటూ కల్హేర్ మండలం మాసాన్‌పల్లి పంచాయతీ కార్యదర్శి ఉమేశ్‌ ACBకి చిక్కాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మహదేవుపల్లి చౌరస్తాలో ఫిష్ స్టాల్ ఏర్పాటు చేసేందుకు బ్యాంక్ లోన్ ఎల్‌ఓసీ సర్టిఫికెట్ కోసం ఉమేశ్‌ను ఆశ్రయించాడు. దీంతో ఎల్‌ఓసీ ఇచ్చేందుకు రూ. 15 వేలు లంచం అడగడంతో బాధితుడు ACBని ఆశ్రయించాడు. ఎంపీడీఓ ఆఫీస్‌లో లంచం తీసుకుంటుండగా పంయితీ కార్యదర్శి ACBకి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు.

News December 6, 2024

అంబేడ్కర్‌కు నివాళులు అర్పించకుండా నిర్బంధాలా..?: హరీశ్ రావు

image

రాష్ట్రంలో అప్పటికీ ఎమర్జెన్సీ కొనసాగుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు X వేదికగా మండిపడ్డారు. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వెళ్తున్న BRS నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దమన్నారు. రాజ్యాంగ నిర్మాతకు నివాళులు అర్పించే స్వేచ్ఛ రాష్ట్రంలో లేదా అని నిలదీశారు. అదుపులోకి తీసుకున్న పార్టీ శ్రేణులను విడుదల చేయాలన్నారు.

News December 6, 2024

మెదక్: వేర్వేరు కారణాలతో నలుగురు సూసైడ్

image

వేర్వేరు కారణాలతో ఉమ్మడి జిల్లాలో నిన్న నలుగురు సూసైడ్ చేసుకున్నారు. తూప్రాన్ మం. నర్సంపల్లికి చెందిన శివ(24) ఇంట్లో ఊరేసుకోగా.. అక్కన్నపేట మం. అంతకపేటకు చెందిన ప్రకాశ్ భార్య పుట్టింటింకి వెళ్లిందన్న మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. రాయపోల్‌కు చెందిన ఎరుపుల నర్సింలు(41) మద్యానికి బానిసై, కుటుంబ కలహాలతో పురుగుమందు తాగి చనిపోయాడు. పటాన్‌చెరు మం. ఇస్నాపూర్‌లో కార్మికుడు బహుద్దూర్ గదిలో ఉరేసుకున్నాడు.

News December 6, 2024

సంగారెడ్డి: రేపు ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలోని జూబ్లీ క్లబ్ ఆవరణలోని ఎంఎస్ అకాడమీలో ఉదయం 10 గంటల నుంచి ఎంపికలు జరుగనున్నాయి. జిల్లాలో ఎంపికైన క్రీడాకారులకు 16 న హైదరాబాద్లో జరిగే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనాల్సి ఉంటదని చెప్పారు.

News December 6, 2024

సంగారెడ్డి: ఈనెల 12 నుంచి బడి బయట పిల్లల సర్వే

image

సంగారెడ్డి జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి జనవరి 11 వరకు బడి బయట పిల్లల సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. అనంతరం డిఈవో మాట్లాడుతూ.. జిల్లాలోని సిఆర్పీలు, ఐఈఆర్పీలు, డిఎల్ఎంటిలు, గ్రామాలలో, అవాస ప్రాంతాలలో బడి బయట పిల్లల సర్వే చేయాలని, సర్వేలో గుర్తించిన విద్యార్థుల వివరాలను ప్రభంద పోర్టల్లో నమోదు చేయాలని పేర్కొన్నారు.

News December 5, 2024

రేవంత్ రెడ్డి నీ పిట్ట బెదిరింపులకు భయపడం: హరీష్ రావు

image

సీఎం రేవంత్ రెడ్డి నీ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడే వాళ్లం కాదని ఎమ్మెల్యే హరీష్ రావు X వేదికగా మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసు బనాయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ రాక్షస పాలన కొనసాగిస్తున్నారు అని మండిపడ్డారు.

News December 5, 2024

డబుల్ బెడ్ రూమ్ పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం

image

హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఈరోజు 81 కుటుంబాలకు డబుల్ బెడ్రూం పట్టాలను మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నారు. ప్రజాపాలనను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని వాటిని తిప్పి కొట్టాలని అన్నారు.

News December 5, 2024

సిద్దిపేట: యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలి

image

యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని నెక్లెస్ రోడ్డులో ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా యోగా శిక్షణ కార్యక్రమాన్ని మునిసిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యోగా శిక్షణతో పాటు పోటీలను నిర్వహించారు. వారితో మునిసిపాలిటీ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.