Medak

News June 21, 2024

ఎంపీ రఘునందన్ పిటిషన్.. వారికి బెయిల్ మంజూరు

image

ఇటీవల మెదక్​ పట్టణంలో జరిగిన ఇరువర్గాల ఘర్షణకు సంబంధించిన కేసులో ఓ వర్గానికి చెందిన 16 మందికి శుక్రవారం బెయిల్​ మంజూరైంది. ఘర్షణలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్​, మెదక్​ టౌన్​ ప్రెసిడెంట్ నాయిని ప్రసాద్ తదితర 16 మందిపై కేసు నమోదు కాగా పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. వారి తరఫున అడ్వకేట్‌గా​ ఎంపీ రఘునందన్​ రావు, అడ్వకేట్​ సంతోష్​ రెడ్డి ​గురువారం బెయిల్ పిటిషన్ వేశారు.

News June 21, 2024

రెచ్చగొట్టే ప్రసంగాలు తప్ప.. ఉద్యోగాల చర్చ లేదు: జగ్గారెడ్డి

image

బీజేపీ, మంత్రులకు రెచ్చగొట్టే ప్రసంగాలు తప్పితే ఉద్యోగుల చర్చ లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీ భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ఐటీఐఆర్ యూపీఏ ప్రభుత్వం మంజూరు చేస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. చేరికల అంశం తన పరిధిలో లేదని తెలిపారు.

News June 21, 2024

ఏసీబీకి చిక్కిన న్యాల్‌కల్ RI దుర్గయ్య

image

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఆర్ఐ దుర్గయ్య రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆర్ఐని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాలో అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నా అధికారుల్లో అవినీతి తగ్గడం లేదని జిల్లాలో చర్చించుకుంటున్నారు.

News June 21, 2024

రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన ఉద్యమ నేత జయశంకర్‌: హరీశ్ రావు

image

ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్ధంతి సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి, మ్మెల్యే హరీశ్‌ రావు నివాళులర్పించారు. రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన ఉద్యమ నేత, స్వరాష్ట్ర సాధనే ఊపిరిగా బతికిన సిద్ధాంత కర్త అని చెప్పారు. ఆయన స్ఫూర్తిని చెదరకుండా తమ గుండెల నిండా పదిలంగా ఉంచుకున్నామని తెలిపారు. జయహో జయశంకర్ సార్, యావత్‌ తెలంగాణ పిడికిలెత్తి జోహారులర్పిస్తున్నదంటూ సామాజిక మాధ్యమం X వేదికగా నివాళులు అర్పించారు.

News June 21, 2024

ములుగులో కారు ఢీకొని విద్యార్థి మృతి

image

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన ఘటన ములుగులో గరువారం జరిగింది. SI విజయ్ కుమార్ వివరాల ప్రకారం.. ములుగు గ్రామానికి చెందిన తన్నీరు జస్వంత్ కాలేజ్‌కు వెళ్తున్న క్రమంలో సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్లున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జస్వంత్‌కు తీవ్ర గాయాలు కాగా.. లక్ష్మక్కపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News June 21, 2024

బాలల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి: RJD

image

బాలల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ మోతి పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డిలోని బాల రక్షాబంధన్‌ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలల హక్కుల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News June 21, 2024

అరచేతిపై యోగా లోగో, యోగా నమస్కారాలు

image

జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. యోగాతో పొందే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం లక్ష్యం. “యోగం” అనే పదం సంస్కృత మూలం. దీని అర్థం “చేరడం”, “కలయిక” లేదా “ఏకం చేయడమని ఖేడ్ కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ తెలిపారు. ఈ మేరకు తన అరచేతిపై యోగ కార్యక్రమాల చిత్రాలను పెయింట్ వేసి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

News June 21, 2024

సిద్దిపేట: ‘అభ్యర్థులు తప్పక పాటించాలి’

image

ఈనెల 24 నుంచి 29 వరకు జరుగనున్న TGPSC పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సూచనలు పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా సూచించారు. గిరిజన సంక్షేమ, ఎస్సీ అభివృద్ధి, బీసీ అభివృద్ధి శాఖ గ్రేడ్1 & 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్స్ సంక్షేమంలో మార్టన్ గ్రేడ్1 & గ్రేడ్ 2, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖలో లేడీ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు పరీక్షలు జరగనున్నాయి.

News June 20, 2024

మెదక్: రైల్వే సమస్యలు పరిష్కరించాలని ఎంపీ విజ్ఞప్తి

image

మెదక్ పార్లమెంట్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు మెదక్ ఎంపీ రఘునందన్ రావు వినతిపత్రం అందజేశారు. పటాన్చెరువు నుండి మెదక్, అక్కన్నపేట వరకు రైల్వే లైన్ పొడగింపు, మెదక్, సిద్దిపేట స్టేషన్ల నుంచి తిరుపతికి రైల్వే సర్వీస్ ప్రారంభం సహా పలు సమస్యలను లేఖలో వివరించారు.

News June 20, 2024

టైటానిక్ షిప్ లా BRS పరిస్థితి: MP రఘునందన్

image

మెదక్ పార్లమెంటు సీటు BRS గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయని, మెదక్ పార్లమెంట్‌లో ఆరడుగులు ఉన్నోడు, డబ్బులున్నోడు ఉన్నాడు కాబట్టి వాళ్లే గెలుస్తారని అనుకున్నారని ఎంపీ రఘునందన్ అన్నారు. మెదక్‌లో తాను దెబ్బకొడితే BRS అడ్రస్ లేకుండా పోయిందన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన BJP కార్యకర్తల అభినందన సభకు ఆయన హాజరై మాట్లాడారు. టైటానిక్ షిప్ లా BRS పరిస్థితి తయారయ్యిందని విమర్శించారు.