India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏడాది విజయోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తుంటే ఈ బూటకపు ఎన్ కౌంటర్ ఏంది.? అని ఎమ్మెల్యే హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు.. బూటకపు ఎన్ కౌంట్లర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు అటకెక్కించి ఏడో గ్యారెంటీగా డబ్బా కొట్టిన ప్రజాస్వామ్య పాలనకు సైతం విజయవంతంగా తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.
స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కొల్చారం మండలం రంగంపేటకు చెందిన కార్తీక్(24) మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి మిత్రుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి HYDకి వెళ్తుండగా మియాపూర్ వద్ద ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ కార్తీక్ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు
మెట్రో లోకో పైలట్ స్థాయి నుంచి మెట్రో ట్రైన్స్‌ను నియంత్రించే స్థాయికి ఎదిగాడు మెదక్ జిల్లా యువకుడు. రేగోడ్‌కు చెందిన బోయిని వీరప్రసాద్ 2017లో ప్రారంభమైన HYD మెట్రోలో భాగంగా నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు తొలి ప్యాసింజర్ మెట్రో నడిపారు. గతంలో మెట్రో లోకోపైలట్, మెట్రో డిపో కంట్రోలర్‌గా పనిచేసి నేడు మెట్రో ట్రాఫిక్ కంట్రోలర్ అధికారి అయ్యారు. దీంతో వీర ప్రసాద్‌ను గ్రామస్థులు, మిత్రులు అభినందిస్తున్నారు.
రాష్ట్రంలో దళిత సమ సమాజ నిర్మాణం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో నిర్వహించిన రైతు పండుగ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వేతో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమం సమంగా అందిస్తూ ముందుకు సాగుతామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన విజయోత్సవాలకు టీపీసీసీ ఇన్చార్జిలను నియమించింది. సిద్దిపేట-నారాయణరెడ్డి, మెదక్-ఆకుల లలిత, ఖేడ్-లోకేశ్ యాదవ్, ఆందోల్-పహీమ్ ఖురేషి, నర్సాపూర్-ఆంజనేయులు యాదవ్, జహీరాబాద్-మన్నె సతీష్, సంగారెడ్డి శివసేనారెడ్డి, పటాన్ చెరు-మెట్టు సాయికుమార్, దుబ్బాక-శశికళ యాదవ రెడ్డి, గజ్వేల్-పారిజాత నరసింహారెడ్డి లను నియమించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నూటికి నూరు శాతం రైతు రుణమాఫీ చేసి తీరుతామని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకేసారి రూ.18 వేల కోట్లు రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని గుర్తు చేశారు. కులగణనతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని అన్నారు.
దీక్షా-దివస్‌ను BRS శ్రేణులు సక్సెస్ చేశాయి. సోషల్ మీడియాలో KCR పోరాటానికి ఎలివేషన్స్ జత చేస్తూ ఆకాశానికి ఎత్తాయి. BRS MLAలు ర్యాలీలు తీసి KCR చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు తెలంగాణ నలుమూలల నాయకులు తెలంగాణ భవన్‌కు క్యూకట్టారు. కానీ, KCR మాత్రం బయటకురాలేదు. ఉద్యమంలో అంతా తానై నడిచిన గులాబీ బాస్ నిన్నటి దీక్షా-దివస్‌లో ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించకపోవడం గమనార్హం.
మాది ప్రజా ప్రభుత్వ.. రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రైతు రుణమాఫీకి రూ.18,000 కోట్లు, రైతు భరోసాకు రూ.7,625 కోట్లు, రైతు బీమాకు రూ.1455 కోట్లు, పంటల భీమాకు రూ.1,300 కోట్లు, ఉచిత విద్యుత్‌కు రూ.10,444 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. సన్న వడ్లకు బోనస్ రూ.5,040 కోట్లు కేటాయించామన్నారు.
అరవై శాతం శరీరం కాలిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారం రోజులు మృత్యువుతో పోరాడి ఓడింది. సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామానికి చెందిన మీనా హనుమంతరావు దంపతుల కూతురు స్నేహలత(18)పై ఈనెల 22న ఓ అగంతకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గాయపడ్డ ఆమెకు HYDలో చికిత్స అందించారు. 60 శాతం శరీరం కాలిన యువతి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఘటనపై కేసు నమోదైంది.
రాష్ట్రంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నియంత్రణపై వైద్యా,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలోనీ ప్రాథమిక ఆసుపత్రిలో అందిస్తున్న సేవల బలోపేతంపై మంత్రి చర్చించారు. సీజనల్ వ్యాధులు విస్తరించకుండా ప్రాథమిక ఆసుపత్రులలో అవసరమైన సిబ్బంది, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.