India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘ప్రభుత్వ బడుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం టీచర్లుగా మీ బాధ్యత’ అని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాయికోడ్‌లో బుధవారం నిర్వహించిన ‘బడి బాట’లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులపై ప్రజల ఆలోచన విధానం మార్చుకోవాలని, ఆ బడులు మనవి అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలని సూచించారు. ప్రైవేటుకు దీటుగా విద్య బోధన కొనసాగేలా చూడాలని కోరారు.
ఉద్యోగుల అన్ని రకాల సమస్యల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దశలవారీగా సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రిని ఉద్యోగుల సమస్యలు లేవనెత్తగా పైవిధంగా స్పందించారని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డాకూర్ గ్రామానికి చెందిన గోపి(30) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన గోపి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో కరెంట్ షాక్‌తో ఇద్దరు మరణించారు. మెదక్ మండలం పేరూరు గ్రామానికి చెందిన వి.నగేష్(40) వ్యవసాయ పొలం వద్ద స్తంభానికి ఉన్న సపోర్ట్ వైరు పట్టుకోవడంతో షాక్‌కు గురై మృతిచెందాడు.
దీని విద్యుత్ అధికారులే నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబీకులు గ్రామంలో ధర్నా చేశారు. అలాగే మెదక్‌లోని గాంధీనగర్‌లో గుట్ట కిందిపల్లికి చెందిన చింతల నర్సింలు మైక్ వైర్లు సరిచేస్తుండగా షాక్ కొట్టి చనిపోయాడు.
నేడు, రేపు ఉమ్మడి మెదక్‌కు వర్ష సూచన ఉన్నట్లు HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల్లో సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, మెదక్, సిద్దిపేటలో ఓ మోస్తరు వర్షం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పిడుగులు పడే ప్రమాదం ఉందన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షసూచనతో మెతుకుసీమ రైతులు సాగుకు సిద్ధమయ్యారు.
టాంకాం ద్వారా జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం జర్మనీ భాష నేర్చుకునేందుకు శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిని వందన తెలిపారు. ఆసక్తి గలవారు www.tomcom.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టాంకాం మొబైల్ యాప్‌లో సైతం దరఖాస్తులు సమర్పించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాల సంఖ్య 1,018కు చేరాయి. ఇందులో 814 పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాలలుగా గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఇతర పనులు చేయిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.34.80 కోట్లు కేటాయించింది. కానీ, ఇప్పటివరకు రూ.8.20 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి.
సిద్దిపేట పట్టణంలోని ఓ స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడు మృతి చెందాడు. లింగారెడ్డిపల్లికి చెందిన జాన్ బాబు-సంగీతల కుమారుడు గిరీశ్ (17) బాసరలోని త్రిబుల్ ఐటీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సెలవుల్లో భాగంగా ఇంటికి వచ్చిన అతను సిమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్లాడు. లోతుగా ఉన్న పూల్‌లో దూకడంతో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్ట నిమిత్తం తరలించారు.
ఝరాసంగం మం. గుంతమర్పల్లి గ్రామానికి చెందిన భార్గవ రెడ్డి పొలంలో నిన్న సాయంత్రం మొసలిని గుర్తించారు. వ్యవసాయ పనులు చేసేందుకు చెత్త కుప్పలు, కర్రలు తొలగిస్తుండగా మొసలి కనిపించినట్లు గ్రామస్థులు తెలిపారు. అధికారులకు సమాచారం ఇవ్వగా.. తహశీల్దార్ సంజీవరావు, SI రాజేందర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చీకటి కావడంతో గుర్తించలేదు. మొసలి సంచారం విన్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. హైదరాబాదులోని సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించే విషయంలో హోటల్ యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. హోటల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.