India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలపై గ్రామ గ్రామాన అవగాహన కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లతో శనివారం రాష్ట్ర సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాల్లో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించాలన్నారు.

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అనురాధ హెచ్చరించారు. జిల్లా పరిధిలో చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మాంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. చైనా మాంజతో తలెత్తే అనార్థాలపై అందరు అవగాహన కలిగి ఉండాలన్నారు. చైనా మాంజాను అమ్మినా, రవాణా చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో 6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మెదక్ జిల్లాలోని బోడగట్టు, మనోహరబాద్, శివంపేట, నార్సింగి, కుల్చారం, సంగారెడ్డి జిల్లా కోహిర్, న్యాల్కల్, అల్మాయిపేట్, మాల్చెల్మా, నల్లవల్లి, అల్గోల్, సత్వార్, లక్ష్మీసాగర్, సిద్దిపేట జిల్లాలో అంగడి కిష్టాపూర్, పోతారెడ్డిపేట తదితర ప్రాంతాల్లో చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్డు భద్రతపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాల విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతపై ఫ్లకార్డులతో అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

హైదరాబాద్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని నందినగర్ వారి నివాసంలో నూతన సంవత్సరం సందర్భంగా మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న సస్థానిక సంస్థల ఎన్నికల పట్ల దిశా నిర్దేశం చేశారు.

సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో డబ్బా కొట్టారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్‌ను జరపకపోగా పేరు మార్చి ప్రజావాణిని చేశారని తెలిపారు. సీఎం రేవంత్ కేవలం ఒకే ఒక్కరోజు హాజరై, 10ని.లు పాటు మాత్రమే ప్రజల నుంచి వినతులు స్వీకరించారని అన్నారు.

మెదక్ జిల్లా నార్సింగిలోని కనకదుర్గ వైన్స్‌లో చోరీకి వెళ్లి తాగి పడుకున్న నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారి వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన రాజాసోద్ రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తూ మద్యానికి బానిస అయ్యాడు. రోజూ మద్యం కొనుక్కుని తాగే వైన్స్‌కు కన్నం వేశాడు. మద్యం తాగి వైన్స్‌లోనే పడుకొని దొరికిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న దొంగను రామాయంపేట ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. వివరాలిలా.. దుద్యాలలో కంది నూర్పిడి యంత్రంలో పడి మహిళ చనిపోగా.. పాపన్నపేటలో నీట మునిగి రైతు మృతిచెందాడు. సంగారెడ్డిలో చేపల వేటకు వెళ్లిన కార్మికుడు మరణించగా.. సిద్దిపేటలో బైక్ అదుపు తప్పి కూలీ చనిపోయాడు. పరిగిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందగా.. చేగుంటలో మద్యం మత్తులో వ్యక్తి కిందపడి చనిపోయాడు.

నూతన సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని అధికారులకు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా అధికారులు, ఉద్యోగులు కలెక్టరేట్‌లో కలెక్టర్ వల్లూరు క్రాంతిని గురువారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా కృషి చేయాలని చెప్పారు.

సంగారెడ్డిలో నేడు మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీలో అమృత్ 2.0 కార్యక్రమం ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా సమాఖ్య షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం, సమాఖ్య పెట్రోల్ పంపుకు శంకుస్థాపన, మోడల్ ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన చేసి 108 అంబులెన్స్‌లను ప్రారంభిస్తారు. జిల్లాలో అభివృద్ధి పనులపై సమీక్షించున్నారు.
Sorry, no posts matched your criteria.