Medak

News November 16, 2024

వర్గల్: పెళ్లైనా నాలుగు నెలలకే సూసైడ్

image

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట వర్గల్ మండలానికి చెందిన భాను, మాదారానికి చెందిన రేణుక(22)ను నాలుగు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా, వీరి మధ్యలో కొన్నిరోజులుగా గొడవలు జరుతున్నాయి. ఈనెల 14న భాను కుటుంబ సభ్యులకు చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియోను పంపిచారు. దీంతో మనస్తాపం చెందిన రేణుక ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదైంది.

News November 16, 2024

రామాయంపేట: 6 నెలల్లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు

image

రామాయంపేట మండలం కాట్రియల్ గ్రామానికి చెందిన మద్ది రాజాసాబ్ మూడో కుమారుడు  శరత్ కుమార్ 6 నెలల్లోనే 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దే చదువుకొని ఉద్యోగాలు సాధించడంతో పలువురు అభినందించారు. గతంలో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వగా గురువారం వెలువడిన గ్రూప్- 4 ఫలితాల్లో సెలెక్ట్ అయ్యారు.

News November 16, 2024

MDK: 19న ఏడుపాయల నుంచి పాదయాత్ర !

image

ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై ఉద్యమించడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్దమవుతున్నాయి. ఈనెల 19వ తేదీన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా-లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి.. ఇతర నాయకులు, రైతులతో కలిసి ఏడుపాయల నుంచి మెదక్ వరకు పాదయాత్ర చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News November 16, 2024

సంగారెడ్డి: గ్రూప్-3 పరీక్షకు అర గంట ముందే గేట్లు మూసివేత

image

ఈనెల 17,18 తేదీల్లో జరిగే గ్రూప్-3 పరీక్షకు అర గంట ముందే గేట్లు మూసివేస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం తెలిపారు. ఉ.9:30 నుంచి మ.2.30 గంటల తర్వాత పరీక్షకు అనుమతించమని పేర్కొన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు 2 గంటల ముందు గాని పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.

News November 15, 2024

మెదక్: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

మనోహరాబాద్ మండలం కళ్లకల్ 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక కారు అతివేగంగా వెళుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిని ఢీ కొట్టి నడిరోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నడుచుకుంటూ వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 15, 2024

MDK: 19న ఏడుపాయల నుంచి పాదయాత్ర !

image

ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై ఉద్యమించడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్దమవుతున్నాయి. ఈనెల 19వ తేదీన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా-లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి.. ఇతర నాయకులు, రైతులతో కలసి ఏడుపాయల నుంచి మెదక్ వరకు పాదయాత్ర చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News November 15, 2024

సంగారెడ్డి: విషాదం.. పుట్టినరోజు నాడే విద్యార్థిని మృతి

image

పటాన్‌చెరు పరిధి ఇంద్రేశంలో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఫిలిపియన్స్‌లో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్నిగ్ధ అనే అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మృతి చెందినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి పుట్టినరోజు నాడే ఆమె చనిపోవడం ఆ కుటుంబాన్ని కలిచివేసింది.

News November 15, 2024

సంగారెడ్డిలో లగచర్ల రైతులను కలవనున్న KTR

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ నేడు సంగారెడ్డికి రానున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామానికి చెందిన పార్టీ నాయకులు, రైతులను పరామర్శించనున్నారు. వికారాబాద్ జిల్లా అధికారులపై దాడి ఘటనలో అరెస్టు చేసిన వారిని సంగారెడ్డి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

News November 15, 2024

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ చేస్తున్నారు: మెదక్ ఎంపీ

image

రాష్ట్రంలో పాలన పడకేసిందని, సీఎం రేవంత్ మాటలకు చేతలకు పొంతన లేదని ఎంపీ రఘునందన్ రావు విమర్శంచారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పులే సీఎం రేవంత్ చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం ఖమ్మం మిర్చి యార్డులో రైతులను అరెస్టు చేసి బేడీలు వేసినప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో అరెస్టుల పర్వం కొనసాగించడం ఎంతవరకు సమంజసమని అన్నారు.

News November 14, 2024

ఏడుపాయలలో రేపు పల్లకీ సేవ, లక్ష దీపారాధన

image

మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాత క్షేత్రంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవ, లక్ష దీపారాధన, గంగా హారతి కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వాహణాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.